BigTV English
Advertisement

HHVM-Keeravani: ఆ ట్రోల్స్ కి చెక్.. పవన్ మాటలే నిజమయ్యాయి.. హరి హర వీరమల్లుకు ప్రాణం పోసిన కీరవాణి

HHVM-Keeravani: ఆ ట్రోల్స్ కి చెక్.. పవన్ మాటలే నిజమయ్యాయి.. హరి హర వీరమల్లుకు ప్రాణం పోసిన కీరవాణి


MM Keeravani Music For HHVM: ఎట్టకేలకు హరి హర వీరమల్లు మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఫ్యాన్స్ కి పండగ తెచ్చిపెట్టింది. పవన్ యాక్షన్, ఎలివేషన్స్ థియేటర్లలో ఈళలు వెయించాయి. అయితే సాధారణ ఆడియన్స్ నుంచి మాత్రం హరి హర వీరమల్లుకు మిశ్రమ స్పందన వస్తుంది. ఫస్టాఫ్ బ్లాక్ బస్టర్ అయితే.. సెకండాఫ్ డిజాస్టర్ అంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ లో వీఎఫ్ఎక్స్ దారుణంగా ఉందని, కథ నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టించిందనే వార్తలు వస్తున్నాయి. ఇక సినిమాకు పవన్ కళ్యాణ్, ఎంఎం కీరవాణి మ్యూజిక్ ప్రధాన బలంగా అంటున్నారు.

ఫస్టాఫ్, ఇంటర్వెల్ ట్విస్ట్ అదుర్స్


ఫస్టాఫ్, ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్ మరింత ప్లస్ అనే రివ్యూస్ వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా పవన్ ఎంత బలమో.. ఎంఎం కీరవాణి మ్యూజిక్ కూడా అంతే బలమైందని ప్రేక్షకులంత చర్చించుకుంటున్నారు. సినిమా.. పడిపోతున్న ప్రతిసారి కీరవాణి తన మ్యూజిక్ తో నిలబెట్టాడు. బ్యాగ్రౌండ్ స్కోర్, పాటలకు అందించిన స్వరాలు ఆడియన్స్ బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అసుర హననంకు ఆయన కొట్టిన మ్యూజిక్ గూస్ బంప్స్ అనిపించేలా ఉంది. యాక్షన్, హీరో ఎంట్రీ సన్నివేశాలకు ఆయన ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత ఎలివేషన్ ఇచ్చాయి. మొదటి నుంచి పవన్ కీరవాణిని ప్రశంసిస్తూనే వస్తున్నారు. ఈ సినిమా కీరవాణి తన సంగీతంలో ప్రాణం పోశాడంటూ పదే పదే ఆయనను కొనియాడారు.

ఆ విమర్శలు, ట్రోల్స్ కి చెక్

దీంతో కీరవాణిపై ఉన్న ఆ విమర్శలు, ట్రోల్స్ కి హరి హర వీరమల్లుతో చెక్ పడింది. ఆయనను విమర్శించిన వారి ప్రస్తుతం కీరవాణిని ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే కీరవాణి మ్యూజిక్ అంటే కేవలం ఎస్ఎస్ రాజమౌళి సినిమాలకే అంకితం అంటారు. జక్కన చిత్రాలకు తప్పితే.. ఆయన సంగీతం మరే మూవీకి వర్కౌట్ కాదని ఇండస్ట్రీలో బలంగా నమ్ముతారు. ఇతర సినిమాలకు ఆయన సంగీతం ఇచ్చారంటే అవి ప్లాప్ అనే ప్రచారం కూడా ఉంది. దీంతో చాలావరకు కీరవాణి రాజమౌళి సినిమాలకు తప్పితే ఇతర చిత్రాలకు చేసింది అరుదు. కానీ, లాంగ్ గ్యాప్ తర్వాత కీరవాణి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరకు సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ లో ఆయన సంగీతంపై ట్రోల్స్ వచ్చాయి.

కీరవాణిపై ప్రశంసలు

అదేం బ్యాగ్రౌండ్ స్కోర్ అని, మ్యూజిక్ చాలా పేలవంగా ఉందని విమర్శలు గుప్పించారు. దీంతో కీరవాణి సంగీతం కేవలం జక్కన సినిమాలకే మాత్రమే అంకితం అనేట్టు మారింది. అయితే అదంత నిన్నటి వరకు. ఇప్పుడు కీరవాణి సంగీతం.. ప్లాప్ సినిమాని కూడా నిలబెడుతుందని అంటున్నారు. దీనికి హరి హర వీరమల్లు ప్రత్యేక ఉదాహరణ. కీరవాణి సంగీతం లేకుండ సెకండాఫ్ పేలవంగా ఉండేదని, పడిపోయిన కథను కీరవాణి తన మ్యూజిక్ తో నిలపాడని క్రిటిక్స్ సైతం ప్రశంసిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ మూవీకి పవన్ ఎంత ప్లస్ అయ్యారో.. ఆయన పాత్ర అంత ఎలివేట్ అవ్వడానికి కీరవాణి మ్యూజిక్ ప్రధాన కారణమని కూడా ఓ వర్గం ఆడియన్స్ నుంచి కూడా టాక్ వస్తుంది. హరి హర వీరమల్లు మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి అంతా కీరవాణి మ్యూజిక్ గురించే మాట్లాడుకుంటున్నారు. అబ్బా.. కీరవాణి ఏం కొట్టాండి బాబూ అంటున్నారు.

Also Read: Kingdom Ticket Rates: కింగ్ డమ్ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్

Related News

Megastar Chiranjeevi : అన్నపూర్ణ స్టూడియోలో మన శంకరవరప్రసాద్ గారు, సినిమా పూర్తయ్యేది అప్పుడే

Sai Durgha Tej : స్టార్డం అంటే హీరోలతో ఫోటోలు దిగడం కాదు, సాయి తేజ్ అలా అనేశాడేంటి?

Ram Charan: ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా, ఈసారి హిట్ ఖాయం

Thiruveer: ఆ సినిమా టికెట్ కౌంటర్ లోనే చచ్చిపోతా అనుకున్నా

Kaantha First Spark: దుల్కర్ కాంత.. చాలా గట్టిగానే ఉండబోతున్నట్టుందే

Parasakthi: సింగారాల సీతాకోకవే.. ఏముందిరా సాంగ్.. నెక్స్ట్ లెవెల్ అంతే

Ustaad Bhagat Singh : సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ, మరి ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి?

Anupama Parameswaran : బైసన్ బాగా కలిసి వచ్చింది, వైజయంతి బ్యానర్ లో అనుపమ సినిమా

Big Stories

×