Kingdom Ticket Rates Hike: విజయ్ దేవరకొండ నటించి లేటెస్ట్ మూవీ ‘కింగ్ డమ్‘. జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎప్పుడో మే 30న రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ఈ మూవీ రిలీజ్ కి ఆలస్యం అయ్యింది. లైగర్, ఖుషి వంటి ప్లాప్ చిత్రాల తర్వాత విజయ్ నుంచి వస్తున్న చిత్రమిది. దీంతో ఈ సినిమా కోసం అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన మూవీ పోస్టర్స్, గ్లింప్స్ మంచి హైప్ క్రియేట్ చేశాయి. దీంతో కింగ్ డమ్ చిత్రానికి ప్రస్తుతం భారీ బజ్ నెలకొంది.
ఏపీలో పెరిగిన టికెట్ ధరలు
స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ చిత్రం విజయ్ లుక్ ఆసక్తిని పెంచుతుంది. ఇక సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందాని అభిమానులంత ఆసక్తిగా చూస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా పలుమార్లు వాయిదా అనంతరం జూలై 30న విడుదలకు సిద్దమౌతుంది. మూవీ టీం ప్రమోషన్స్ ని భారీగా ప్లాన్ చేసింది. మరో రెండు రోజుల్లో ట్రైలర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే జూలై 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ లోనూ రోజు రోజు అంచనాలు పెరుగుతున్నాయి. ఇక మూవీ రిలీజ్ కు ఇంకా వారం రోజులు ఉన్నాయి. అప్పుడే మూవీ టికెట్ ధరలను ఫిక్స్ చేసింది.
టికెట్ ధరలు ఇలా
తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూవీ టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సింగిల్, మల్టిప్లెక్స్ టికెట్ ధరలను ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రిన్స్ కి రూ. 50, మల్టిప్లెక్స్ లో రూ. 75 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో పెరిగిన ధరలతో సింగిల్ స్క్రిన్స్ లో రూ. 290 మల్టీప్లెక్స్ లో 395 వరకు టికెట్ ధరలు ఉండే అవకాశం ఉంది. ఇవి మొదటి పది రోజులు మాత్రమే ఈ ధరలు ఉండనున్నాయి. కాగా ఈ సినిమా విజయ్ డబుల్ రోల్ చేస్తున్నట్టు టాక్. ఆర్మీ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని మూవీ పోస్టర్స్, గ్లింప్స్ చూసి అనుకున్నారు. కానీ, ఇది శ్రీలంక.. ఎల్ టీటీఈ నాయకుడు ప్రభాకరన్ నడిపిన ఉద్యమ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించిన ఇండస్ట్రీలో గుసగుస. మూవీ రిలీజ్ ఇంకా కొన్నిరోజులే ఉండగా.. జూలై 26న తిరుపతిలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు.
తిరుపతిలో ట్రైలర్ లాంచ్ కు ప్లాన్
అలాగే జూలై 28న హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మూవీ టీం ప్లాన్ చేస్తుంది. మొదటి నుంచి కింగ్ డమ్ మూవీ ఎలివేషన్స్ ఇస్తూనే వస్తున్నాడు నిర్మాత నాగవంశీ. ఈ కింగ్ డమ్ రెండు భాగాలుగా రాబోతోందని చెప్పాడు. మూవీకి విషయంలో ఎటువంటి ప్రచారం. ఎలాంటి రివ్యూలు రాసిన తను ఒప్పుకుంటానంటూ కింగ్ డమ్ కథపై థీమా వ్యక్తం చేస్తున్నాడు. ఎలా చూసిన ఈ సినిమా నెక్ట్స్ లెవెల్ ఉంటుందని హైప్ ఇస్తున్నాడు. కాగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా తెరకెక్కిన ఈ సినిమా సుమారు ఐదు భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.