Ishan – Pant: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం 5 టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. నాలుగో టెస్ట్ జరుగుతుండగానే టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కు తీవ్రమైన గాయమైంది. అతని కాలికి నిన్న గాయం కావడంతో మ్యాచ్ మధ్యలోనే.. ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆరు వారాల పాటు రిషబ్ పంత్ కు విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. దీంతో అతన్ని ఇండియాకు పంపిస్తున్నారట. ఒకవేళ అదే జరిగితే.. సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు ఇషాన్ కిషన్… రంగంలోకి దిగుతాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అతన్ని ఇండియా నుంచి ఇంగ్లాండ్ కు తీసుకువస్తారని సమాచారం అందుతోంది.
జురెల్ కు ఎదురుదెబ్బ.. రంగంలోకి హైదరాబాద్ ఆటగాడు ( Ishan Kishan )
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం నాలుగో టెస్ట్… మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కు తీవ్రమైన గాయం అయింది. ఈ మ్యాచ్ లో 37 పరుగులు చేసిన రిషబ్ పంత్… వొక్స్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ ఆడబోయాడు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ ఆటగాడు వేసిన బంతి నేరుగా… రిషబ్ పంత్ కాలికి తగిలింది. దీంతో అక్కడే కుప్పకూలినంత పని చేశాడు. అనంతరం అతని నొప్పి ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే గ్రౌండ్ నుంచి ఆసుపత్రికి తరలించారు.
అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రిషబ్ పంత్ ( Rishabh Pant) కాలుకు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. స్కానింగ్ రిపోర్టులో అతని కాలు ఫ్రాక్చర్ అయినట్లు తేలిందట. దీంతో రిషబ్ పంత్ కు ఆరు వారాల పాటు రెస్ట్ అవసరమని చెబుతున్నారట వైద్యులు. అంటే ఈ ఐదు టెస్టుల సిరీస్ నుంచి దాదాపు రిషబ్ పంత్ దూరం కాబోతున్నట్లు సమాచారం అందుతుంది. దీంతో టీం ఇండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగలడం గ్యారంటీ అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో… అదనంగా జూరెల్ వికెట్ కీపర్ గా ఉపయోగపడతాడు. కానీ అతన్ని టీమిండియా ఫైనల్ చేసే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. అతని కారణంగా గత మ్యాచ్ లో టీమిడియా ఓడిపోయిందని.. అలాంటిది మళ్లీ.. జురెల్ కు అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. కాబట్టి రిషబ్ పంత్ స్థానంలో… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈశాన్ కిషన్ ను రంగంలోకి దింపబోతున్నారట. దేశవాళి క్రికెట్ లో కూడా ఇషాన్ కిషన్ అద్భుతంగా రానిస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే అతన్ని ఇంగ్లాండ్ కు తీసుకువచ్చేలా ఉన్నారు.
REPORTS : Following Rishabh Pant’s injury and a six-week rest advisory, Ishan Kishan is likely to rejoin the Test squad.
However, Dhruv Jurel continues to be India’s first-choice wicketkeeper for the fifth Test.#Test #Cricket #IshanKishan #ENGvsIND pic.twitter.com/zKNZ4OkDVa
— OneCricket (@OneCricketApp) July 24, 2025