Kajal Agarwal: కాజల్ అగర్వాల్ (Kajal Agarwal).. ‘చందమామ’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా రామ్ చరణ్ (Ram Charan), చిరంజీవి (Chiranjeevi) వంటి తండ్రి కొడుకులతో కూడా హీరోయిన్ గా సినిమాలు చేసి రికార్డు సృష్టించింది. ఇకపోతే తాజాగా మంచు విష్ణు(Manchu Vishnu) ‘కన్నప్ప’ సినిమాలో పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ కనిపించిన విషయం తెలిసిందే . ఇందులో ఈమె నటనకు అభిమానులు మంత్రముగ్ధులయ్యారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే రాణిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు సంబంధించి.. గతంలో వైరల్ అయిన వార్తలు ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ గా నిలిచాయి.
సౌత్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అతడే – కాజల్ అగర్వాల్
గతంలో ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన కాజల్ ఆ ఇంటర్వ్యూలో పలువురు సౌత్ స్టార్ హీరోల గురించి మాట్లాడుతూ వారి లుక్స్ కి తనదైన శైలిలో రేటింగ్ ఇచ్చింది. అందులో భాగంగానే అందరిలో కెల్లా మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఆ జాబితాలో సౌత్ స్టార్స్ అయిన అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్(Ram Charan) లేకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. రాపిడ్ ఫైర్ రౌండ్ లో భాగంగా కాజల్ ను సౌత్ నటులకు, వారి లుక్స్ ఆధారంగా రేట్ చేయమని అడగగా.. ఈమె ప్రభాస్ కి 8/10, రామ్ చరణ్ 7/10, రామ్ పోతినేని 7/10, అల్లు అర్జున్ 6/10 , ఎన్టీఆర్ 6/10, కళ్యాణ్ రామ్ 5/10 అంటూ ఇలా తనకు నచ్చిన రేటింగ్ ఇచ్చింది. ఇక ఈ జాబితాలో ప్రభాస్ ను అందరిలో కెల్లా మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా ఆమె స్పష్టం చేయడం గమనార్హం. ఇక ఇది చూసిన కొంతమంది నెటిజన్స్ నిజాయితీగా ఈ రేటింగ్స్ ఇచ్చింది.. అంటూ ఆమెపై కామెంట్లు చేస్తున్నారు.
ఈ హీరోలతో కాజల్ నటించిన చిత్రాలు ఇవే..
ఇకపోతే ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా ఈమె ఏ హీరోల కైతే రేటింగ్ ఇచ్చిందో.. ఆ హీరోలు అందరితో కూడా ఈమె సినిమాలు చేసింది. అలా అల్లు అర్జున్ తో కలిసి ‘ఆర్య 2’ సినిమాలో నటించింది. ఇక రాంచరణ్ తో మగధీర, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, నాయక్ వంటి పలు చిత్రాలలో స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. అటు కళ్యాణ్ రామ్ తో తన మొదటి సినిమా లక్ష్మీ కళ్యాణం సినిమా చేసింది. ఇక రామ్ పోతినేనితో 2009లో వచ్చిన గణేష్ సినిమా చేసింది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి బృందావనం సినిమాలో నటించింది. ఇక ప్రభాస్ తో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇలా వీరందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది కాబట్టి వీరి గురించి ఈమె తటపటాయించకుండా డైరెక్ట్గా చెప్పేసింది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Dil Raju – Sirish Reddy : ప్రస్టేషన్.. ప్రస్టేషన్… దిల్ రాజు అసలేం ఏమైంది ?