E-Paper
Advertisement

అనిల్ నీ మాస్టర్ ప్లాన్ ఏంటయ్యా?

అనిల్ నీ మాస్టర్ ప్లాన్ ఏంటయ్యా?
Advertisement

Anil ravipudi:అనిల్ రావిపూడి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హిట్ మెషిన్ గా దూసుకుపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో.. కామెడీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తూ ప్రతి చిత్రంతో విజయాన్ని అందుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఓటమెరుగని దర్శకుల జాబితాలో పేరు దక్కించుకున్న ఈయన.. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి సరసన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు గత ఏడాది వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చేసి మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎక్కువగా సంక్రాంతిని టార్గెట్ గా చేస్తూ.. సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడి ఇప్పుడు మళ్లీ నెక్స్ట్ సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకొని.. మళ్ళీ వెంకటేష్ తో సినిమా చేస్తున్నారు.

వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్..

అయితే ఈసారి తనకు దర్శకుడిగా అవకాశం కల్పించిన నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ను కూడా ఈ సినిమాలో భాగం చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఎప్పుడైతే వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ మూవీ అంటూ ప్రకటించారో అప్పటినుంచి అంచనాలు పెరిగిపోయాయి. మాస్ హీరోని ఈసారి మళ్లీ ఫ్యామిలీ హీరోగా చూపించడానికి సిద్ధం అయిపోయారు అనిల్ రావిపూడి.

కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..

Advertisement

ఇకపోతే ఈరోజు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు కావడంతో తన కెరీర్ కు పునాదులు వేసిన తన మొదటి హీరోకి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమాకు సంబంధించిన కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు అనిల్ రావిపూడి. ఇక ఇందులో కళ్యాణ్ రామ్ తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టు, మెడలో పూలదండతో సరికొత్త గెటప్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. ఇక ఈ సినిమా నుండి కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ..” నా మొదటి సినిమా హీరో.. నా బెస్ట్ బడ్డీలలో ఒకరైన కళ్యాణ్ రామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. డెబ్యూ డైరెక్టర్ గా నాపై మీరు ఉంచిన నమ్మకానికి నేను ఎప్పటికీ కృతజ్ఞుడిని..#VenkyAnil 5#NKRAR2 మూవీలో మిమ్మల్ని ఒక సరికొత్త పాత్రలో చూపించడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాను. 2027 సంక్రాంతిని మరింత గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అంటూ సోషల్ మీడియాలో రాసుకు వచ్చారు.

అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్ ఏంటి?

ఇకపోతే ఒక మాస్ హీరోని ఫ్యామిలీ హీరోగా చూపిస్తానని.. పైగా కళ్యాణ్ రామ్ ను సరికొత్త పాత్రలో చూపిస్తానని ప్రకటించడంతో అనిల్ రావిపూడి నీ మాస్టర్ ప్లాన్ ఏంటయ్యా? అంటూ నెటిజన్స్, ఇటు నందమూరి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ మాస్ హీరోని తన తెలివితేటలతో ఆడియన్స్ మెచ్చేలా ఏ విధంగా తీర్చిదిద్దుతారో చూడాలి. ఇకపోతే తాజాగా కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలవ్వగా.. అందులో చాలా సాంప్రదాయంగా ఆకట్టుకున్నారు కళ్యాణ్ రామ్. ఈ పాత్రలో కళ్యాణ్ రామ్ షేడ్ ఏంటో తెలియాలి అంటే ఈ పాత్ర పై పూర్తి అప్డేట్ వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే.

Advertisement

also read:12 ఏళ్లుగా ఆయన ఫోటోనే నా మొబైల్ వాల్ పేపర్.. అసలు విషయం చెప్పిన అఖిల్!

అనిల్ రావిపూడి కొత్త మూవీ విశేషాలు..

ఇకపోతే ఈ సినిమాలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్.. కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్లు ఎంపికయ్యారు. మరి భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాయడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా.. షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Related News

12 ఏళ్లుగా ఆయన ఫోటోనే నా మొబైల్ వాల్ పేపర్.. అసలు విషయం చెప్పిన అఖిల్!

61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్!

ఇండస్ట్రీలో ఘోర విషాదం..లెజెండ్రీ పాండవాని సింగర్ మృతి!

Kissik Talks Show : సిద్ధు వల్ల బాగా ఏడ్చేశాను.. అదే నేను చేసిన పెద్ద తప్పు…

మేము గుర్తులేమా? ఖుష్బూపై సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్!

అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యా.. 15 ఏళ్లు నరకం చూశా -యాక్టర్ బాలాజీ!

రఘువరన్ మృతికి కొడుకే కారణమా.. విస్తుపోయే నిజాలు బయటపెట్టిన బాలాజీ!

Big Stories

Advertisement
×