BigTV English

Drinking Water Project: ఒక్క ప్రాజెక్ట్‌తో హైదరాబాద్‌కు తాగునీటికి నో ఢోకా.. ఎలా అంటే..!

Drinking Water Project: ఒక్క ప్రాజెక్ట్‌తో హైదరాబాద్‌కు తాగునీటికి నో ఢోకా.. ఎలా అంటే..!

Drinking Water Project: మూసీ మురిసేలా.. హైదరాబాద్ కు మరో 50 ఏళ్ల పాటు తాగునీటికి ఢోకా లేకుండా గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ 2, 3కి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తీసుకురావడం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు లింక్ చేయడం, మూసీ పునరుజ్జీవం కోసం వాడడం ఇదే జరగబోతోంది. ఈ ఒక్క ప్రాజెక్ట్ తో హైదరాబాద్ తాగునీటి అవసరాల రూపురేఖలే మారబోతున్నాయి. మూసీకి మంచిరోజులు రాబోతున్నాయ్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.


20 TMC గోదావరి నీటిని సరఫరా చేయడం

మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి ఘన్ పూర్, ముత్తంగి మీదుగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు నీటి తరలింపు జరగబోతోంది. అక్కడి నుంచి తాగునీటి అవసరాలకు, మరికొంత మూసీకి రిలీజ్ చేస్తారు. ఈ స్కీంతో హైదరాబాద్ కు 20 TMC గోదావరి నీటిని సరఫరా చేయడం, ఇందులో 15 TMC తాగునీటి కోసం అలాగే 5 TMC ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్‌ల పునరుజ్జీవనం కోసం వాడే లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 7,360 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీన్ని హైబ్రిడ్ అన్యుటీ మోడ్ కింద చేపట్టారు. 40% ఖర్చును తెలంగాణ ప్రభుత్వం భరించనుండగా, మిగిలిన 60 శాతాన్ని కాంట్రాక్టర్ సంస్థలు పెట్టనున్నాయి. 2027 నాటికి పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


గోదావరి ఫేజ్-I ఎల్లంపల్లి నుంచి నీటి సరఫరా

హైదరాబాద్ కు ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, మంజీరా, సింగూర్, అలాగే నాగార్జున సాగర్ నుంచి కృష్ణా ఫేజ్- I, II, III, అలాగే గోదావరి ఫేజ్-I శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి రోజుకు 580-600 మిలియన్ గ్యాలన్ల నీరు సప్లై అవుతోంది. అయితే ఈ తాగునీళ్లు భవిష్యత్ అవసరాలకు సరిపోవు. ఒక అంచనా ప్రకారం 2030 నాటికి తాగునీటి డిమాండ్ 750 MGDకి అలాగే 2050 నాటికి 1,014 MGDకి చేరుకుంటుందంటున్నారు. అందుకే చాలా ముందు చూపుతో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల ప్రకారం ఈ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. నిజానికి గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించారు. గోదావరి ఫేజ్-I కింద ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి 10 TMC నీటిని హైదరాబాద్‌కు ఇప్పటికే సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ నుంచి 20 TMC నీటిని తీసుకుంటారన్న మాట.

ఘన్‌పూర్ వద్ద 780 ఎంఎల్‌డీల నీటి శుద్ధి కేంద్రం

ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్‌ కంపెనీ ఇప్పటికే రెడీ చేసింది. ప్రాజెక్టులో భాగంగా పంప్‌హౌస్‌లు, సబ్‌స్టేషన్లు, మల్లన్నసాగర్‌ నుంచి ఘన్‌పూర్‌ వరకు 3,600 MM డయా భారీ పైప్‌లైన్‌ వేస్తారు. ఘన్‌పూర్‌ వద్ద 780 ఎంఎల్‌డీల కెపాసిటీతో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఘన్‌పూర్‌ నుంచి ముత్తంగి వరకు పంపింగ్‌ మెయిన్‌ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపడతారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారు. 15 TMCల నీళ్లను హైదరాబాద్ దాని చుట్టుపక్కల ఉన్న తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ కి సప్లై చేస్తారు. ఇందులో ORR లోపల వెలుపల ఉన్న 27 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ తో ఓవరాల్ కెపాసిటీ 850 MGDకి పెరుగుతుంది. ఇది రాబోయే పదేళ్ల అవసరాలు తీర్చనుంది.

కోకాపేట్ వద్ద మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్

ఈ ప్రాజెక్టు రెండు ప్యాకేజీలుగా అమలు చేస్తారు. మల్లన్నసాగర్ నుండి ఘన్‌పూర్ వరకు ఒకటి.. అక్కడి నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లింకప్ పనులు మరొకటి. ఘన్‌పూర్ వద్ద 1170 MLD సామర్థ్యం కలిగిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. ఉస్మాన్‌సాగర్ దగ్గర 120 MLD, హిమాయత్‌సాగర్ వద్ద 70 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తారు. మల్లన్నసాగర్ వద్ద పంప్ హౌస్, ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్‌మెంట్ ఏర్పాటు చేస్తారు. అలాగే ఘన్‌పూర్ వద్ద 40 మిలియన్ లీటర్స్ క్లియర్ వాటర్ రిజర్వాయర్ కమ్ పంప్ హౌస్ నిర్మిస్తారు. ఇక కోకాపేట్ వద్ద 22.50 మిలియన్ లీటర్స్ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏర్పాటవుతుంది. గండిపేట్ దగ్గర 18 మిలియన్ లీటర్స్ క్లియర్ వాటర్ రిజర్వాయర్, అలాగే హిమాయత్‌సాగర్ వద్ద 18 మిలియన్ లీటర్స్ క్లియర్ వాటర్ రిజర్వాయర్లు నిర్మిస్తారు. సో ఈ ప్రాజెక్టు హైదరాబాద్ భవిష్యత్ తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా.. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సహాయపడుతుంది. దీంతో మూసీ నది పర్యావరణం బాగుపడుతుంది. రివర్ ఫ్రంట్ లో క్లీన్ వాటర్ తో చుట్టుపక్కల పార్కులు, ఇతర అభివృద్ధి పనులు జరగబోతున్నాయి. అదే జరిగితే సీఎం రేవంత్ ఊహించినట్లుగా మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు పడినట్లు అవుతుంది.

గోదావరి ఫేజ్ 2, త్రీ ఒక కీలక ప్రాజెక్ట్ అయితే ఓఆర్ఆర్ ఫేజ్ టూ కూ ప్రాధాన్యత ఉంది. ఇది 40 లక్షల మందికి తాగునీటి అవసరాలు తీర్చేలా దీన్ని ప్రారంభించారు సీఎం రేవంత్. అలాగే కోకాపేట్ లేఅవుట్, నియోపొలిస్, SEZ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా.. మురుగునీటి శుద్ధి కోసం 298 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్ట్‌ కు శంకుస్థాపన చేశారు. ఈ రెండూ హైదరాబాద్ మహానగర రూపు రేఖలు మార్చబోతున్నాయి.

25 లక్షల మంది జనాభాకు తాగునీరు

1,200 కోట్ల ఖర్చుతో ఓఆర్ఆర్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ – ఫేజ్-2 ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఇది జిహెచ్ఎంసీ పరిధి, సమీప మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, అలాగే ఓఆర్ఆర్ పరిధిలోని పలు గ్రామ పంచాయతీలకు నీటిని అందించనుంది. ఇందులో మొత్తం 71 రిజర్వాయర్లు నిర్మించగా.. అందులో 15 రిజర్వాయర్లను ఈసారి ప్రారంభిస్తున్నారు. 25 లక్షల మంది జనాభాకు తాగునీరు అందనుంది. ఇందులో సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, కీసర, రాజేంద్రనగర్, షామీర్‌పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఆర్‌సీ పురం, పటాన్‌చెరు, బొల్లారం వంటి ఏరియాలు ఉన్నాయి.

ఓఆర్ఆర్ ఫేజ్-I తో 190 గ్రామాలకు తాగునీరు

2036 నాటికి ORR పరిధిలో జనాభా మరింత పెరగడం ఖాయమే. పెరుగుతున్న నగరీకరణ, హైదరాబాద్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సహజంగానే ఎక్కువవుతాయి. దీంతో జనాభా వలసలు పెరుగుతాయి. అందుకే ముందు చూపుతో ORR ఫేజ్ 2 చేపట్టారు. ఓఆర్ఆర్ ఫేజ్-I తో ఇప్పటికే 190 గ్రామాలకు తాగునీటి సరఫరా చేస్తున్నారు. ఫేజ్-II ద్వారా ఈ సప్లైని మరింత విస్తరిస్తారన్న మాట. ఓఆర్ఆర్ ఫేజ్ 2 ను రెండు ప్యాకేజీలుగా డివైడ్ చేసి పని చేశారు. ప్యాకేజీ-1 లో 613 కోట్లతో సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, కీసరకు 33 సర్వీస్ రిజర్వాయర్లు, 1,522 కిలోమీటర్లు పైప్‌లైన్ నెట్‌వర్క్ రెడీ చేశారు. ప్యాకేజీ-2 లో భాగంగా 587 కోట్లతో రాజేంద్రనగర్, షామీర్‌పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, పటాన్‌చెరు, ఆర్‌సీ పురం, బొల్లారం ఏరియాలను కవర్ చేస్తూ 38 సర్వీస్ రిజర్వాయర్లు, 1,250 కిలోమీటర్ల పైప్‌లైన్ నెట్‌వర్క్ ను రెడీ చేశారు.

రూ. 298 కోట్లతో రెండేళ్లలో పూర్తి చేసే లక్ష్యం..

సో టోటల్ గా 1,200 కోట్లను హడ్కో నుంచి రుణంగా తీసుకుని చేపట్టారు. ఈ ORR ఫేజ్ 2తో 14 మండలాల్లోని 25 లక్షల మంది జనాభాకు తాగునీటి సరఫరా జరగనుంది. ఇప్పటికే ఉన్న 1.5 లక్షల నల్లా కనెక్షన్లు, అలాగే కొత్త కనెక్షన్లు ఇస్తారు. ORR పరిధిలోని విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, కమర్షియల్ స్పేసెస్ కు రెగ్యులర్ గా నీటి సరఫరా జరగనుంది. ఇది ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందంటున్నారు. వీటితో పాటే కోకాపేట్ లే అవుట్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేశారు. 298 కోట్లతో రెండేళ్లలో పూర్తి చేసే లక్ష్యంగా పెట్టుకున్నారు. కోకాపేట్ హైదరాబాద్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటి. ఈ ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య సముదాయాలు, ఐటీ కారిడార్‌లు, సెజ్‌లు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ అభివృద్ధి కారణంగా తాగునీటి డిమాండ్, మురుగునీటి నిర్వహణ అవసరాలు పెరిగాయి. ఓఆర్ఆర్ ఫేజ్-II డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుతో సమన్వయం చేస్తూ, ఈ ప్రాజెక్టు కోకాపేట్ ప్రాంతంలో సమగ్ర మౌలిక సదుపాయాలను అందించడం లక్ష్యంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ తో 40 లక్షల మందికి బెనిఫిట్ జరగడమే కాదు.. ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల అభివృద్ధికి మరింత ఊతం ఇస్తుందంటున్నారు.

Also Read: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర..

గోదావరి ఫేజ్ 2, 3 ప్రాజెక్టుపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. హైదరాబాద్ కు ఇచ్చేది, మూసీలో కలిపేది, గండిపేటకు తెచ్చేది కాళేశ్వరం నీళ్లు కాదా అని క్వశ్చన్ చేస్తున్నారు. 1,100 కోట్లతో హైదరాబాద్‌కి నీళ్లు తేవొచ్చని, కానీ 7,700 కోట్లు ఖర్చు చేస్తూ 7 రెట్లు పెంచుతూ కమీషన్ల కోసమే పనులు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. వీటిపై కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తోంది. మేడిగడ్డ కుంగిందని వాస్తవాలు చెబితే తమనే బీఆర్ఎస్ నిందిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి అంటున్నారు.

Story By Vidya Sagar, Bigtv

Related News

AP Liquor Scam: వైసీపీలో గుబులు.. లిక్కర్ స్కాంలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరు?

kavitha Political Future: రాజీనామా తర్వాత కవిత సైలెంట్..! జాతీయ పార్టీలో చేరతారా?

Tadipatri Politics: జేసీ యాక్షన్ ప్లాన్..! పెద్దారెడ్డికి మళ్లీ షాక్..

GST 2.0: ప్రజల డబ్బు బయటకు తెచ్చేందుకు.. జీఎస్టీ 2.0తో మోదీ భారీ ప్లాన్

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

×