Allu Aravind : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా పేరు సొంతం చేసుకున్న అల్లు అరవింద్ (Allu Aravind) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇటీవలే ఈయన తల్లిగారు అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma) 94 సంవత్సరాల వయసులో వృద్ధాప్య కారణాలతో మరణించిన విషయం తెలిసిందే. నిన్న హైదరాబాదులో ఆమె కుటుంబ సభ్యులు.. సినీ ప్రముఖులు, సన్నిహితులు, బంధువుల సమక్షంలో దశదినకర్మ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆ కార్యక్రమం అలా పూర్తయిందో లేదో ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడం వైరల్ గా మారింది. అనుమతి లేకుండా పెంట్ హౌస్ నిర్మించారని, దానిని కూల్చివేస్తామని..అయితే అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చి వేయకూడదో వివరణ కోరుతూ అధికారులు నోటీసులలో తెలిపారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అల్లు అరవింద్ కి జీహెచ్ఎంసీ నోటీసులు..
పూర్తి వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో అల్లు అరవింద్ బిజినెస్ పార్క్ భవనాన్ని సుమారుగా 1000 గజాల విస్తీర్ణంలో నిర్మించారు. దీనికోసం గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు నాలుగు అంతస్తుల వరకు జీహెచ్ఎంసి అధికారుల నుంచి అనుమతులు లభించాయి. ఏడాది క్రితమే నిర్మాణం పూర్తయింది. వాణిజ్య వినియోగంలోకి కూడా వచ్చింది. అయితే ఇటీవల ఎటువంటి అనుమతి తీసుకోకుండా నాలుగో అంతస్తు పై కొత్తగా ఇప్పుడు పెంట్ హౌస్ కూడా నిర్మించారు. అయితే ప్రస్తుతం రూల్స్ అమలులో ఉండడంతో ఇది గమనించిన టౌన్ ప్లానింగ్ అధికారులు..ఈ పెంట్ హౌస్ నిర్మాణం భవన నిర్మాణ నిబంధనలకు విరుద్ధమని తేల్చారు. అందుకే అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలి అని జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది.
ఎందుకు కూల్చివేయకూడదో వివరణ ఇవ్వాలన్న అధికారులు!
ముఖ్యంగా ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులే ఇలాంటి అక్రమ నిర్మాణాలకు పాల్పడుతుంటే.. ఇక మిగతా వారికి ఎలాంటి సమాధానం చెప్పాలి అని.. అందుకే నగరపాలక సంస్థకి ఇటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అధికారులు చెబుతున్నారు. ఈ భవనం ఇప్పటికే వాణిజ్య కార్యకలాపాల కోసం ఉపయోగించబడుతున్న నేపథ్యంలో అక్రమ నిర్మాణం పై జీహెచ్ఎంసి తదుపరి చర్య ఏంటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా అల్లు అరవింద్ ఇలాంటి పనులు చేయడం సమంజసం గా లేదు అని.. వెంటనే వివరణ ఇవ్వాలి అని అధికారులు నోటీసులు జారీ చేశారు. మరి ఈ పెంట్ హౌస్ నిర్మాణం పై అలాగే దీనిని ఎందుకు కూల్చివేయకూడదు అనే అంశంపై అల్లు అరవింద్ ఎప్పుడు వివరణ ఇస్తారో చూడాలి.
also read:Bigg Boss 9 Promo : నామినేషన్స్ షురూ.. సెలబ్రెటీస్ మధ్య చిచ్చు పెట్టిన కామనర్స్