E-Paper
Advertisement

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!
Advertisement

Mahindra September 2026 Offers: కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి మహీంద్రా సెప్టెంబర్ లో సూపర్ ఆఫర్లు ప్రకటించింది. పలు SUVలపై క్యాష్ డిస్కౌంట్లు, కన్స్యూమర్ బెనిఫిట్స్, ఫ్రీ యాక్సెసరీల రూపంలో ప్రయోజనాలు అందిస్తోంది. ముఖ్యంగా పాత స్టాక్‌ లో ఉన్న స్కార్పియో Nపై అత్యధికంగా రూ.3 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ ఆఫర్లు సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటాయి. అయితే, వేరియంట్, సిటీ, డీలర్, అందుబాటులో ఉన్న స్టాక్‌ను బట్టి డిస్కౌంట్ మారే అవకాశం ఉంది.

స్కార్పియో Nపై రూ.3 లక్షల వరకు..

సెప్టెంబర్‌లో మహీంద్రా స్కార్పియో N పాత స్టాక్‌పై భారీ ప్రయోజనాలను ప్రకటించింది. ఎంపిక చేసిన వేరియంట్లపై మొత్తం రూ.3 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ఇందులో రూ.1.50 లక్షల వరకు కన్స్యూమర్ ఆఫర్, రూ.1.25 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 విలువైన ఉచిత యాక్సెసరీలు ఉన్నాయి. ప్రస్తుతం స్కార్పియో N ధర రూ.13.69 లక్షల నుంచి రూ.25.49 లక్షల వరకు ఉంది. మూడు వరుసల సీట్లతో ఉండే ఈ SUVకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

థార్ రాక్స్‌ పై రూ.2.40 లక్షల బెనిఫిట్స్..

Advertisement

థార్ రాక్స్ కొనుగోలు చేయాలనుకునేవారికి కూడా ఈ నెలలో మంచి ఆఫర్ అందిస్తోంది. ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.2.40 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ఇందులో రూ.1.20 లక్షల వరకు కన్స్యూమర్ బెనిఫిట్, రూ.90,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 విలువైన ఉచిత యాక్సెసరీలు ఉన్నాయి. థార్ రాక్స్ ధరలు రూ.12.52 లక్షల నుంచి రూ.23.52 లక్షల వరకు ఉన్నాయి.

XUV 3XOపై రూ.1.20 లక్షల వరకు తగ్గింపు..

కాంపాక్ట్ SUV కొనాలని చూస్తున్న వారికి XUV 3XOపై కూడా ఆఫర్ అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన వేరియంట్లపై మొత్తం రూ.1.20 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇందులో రూ.60,000 వరకు కన్స్యూమర్ ఆఫర్, రూ.40,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 విలువైన యాక్సెసరీలు ఉన్నాయి. XUV 3XO ధర రూ.7.79 లక్షల నుంచి రూ.15.04 లక్షల వరకు ఉంది.

స్కార్పియో క్లాసిక్, థార్‌పైనా ఆఫర్లు!

Advertisement

స్కార్పియో క్లాసిక్‌పై రూ.1.10 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ.50,000 కన్స్యూమర్ ఆఫర్‌తో పాటు రూ.30,000 వరకు క్యాష్ డిస్కౌంట్, మరో రూ.30,000 విలువైన యాక్సెసరీలు ఉన్నాయి. మరోవైపు 3-డోర్ థార్ 4WD వేరియంట్లపై రూ.1 లక్ష వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ.50,000 కన్స్యూమర్ ఆఫర్, రూ.30,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 విలువైన యాక్సెసరీలు ఉన్నాయి. అయితే RWD వేరియంట్లకు అధికారిక ఆఫర్ లేదు.

బొలెరో నియోపై కూడా తగ్గింపు

మహీంద్రా బొలెరో నియో, నియో ప్లస్ మోడళ్లపై కూడా తగ్గింపు ప్రకటించింది. బొలెరో నియో ప్లస్‌పై రూ.50,000 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ఇందులో రూ.25,000 కన్స్యూమర్ ఆఫర్, రూ.15,000 క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 విలువైన యాక్సెసరీలు ఉన్నాయి. బొలెరో నియోపై గరిష్టంగా రూ.20,000 వరకు తగ్గింపు అందిస్తోంది.

Read Also: మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Tags

Related News

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

నల్లగొండ జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు, ఏడాదిలో 11 వేలకు పైగా కొనుగోళ్లు!

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

Big Stories

Advertisement
×