E-Paper
Advertisement

కనిపించే దైవం కూడా అమ్మ తర్వాతే.. మదర్స్ డే స్పెషల్ చిరు పోస్ట్ వైరల్!

కనిపించే దైవం కూడా అమ్మ తర్వాతే.. మదర్స్ డే స్పెషల్ చిరు పోస్ట్ వైరల్!
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాల పరంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయం పట్ల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పోస్టులు చేస్తుంటారు. సందర్భం ఏదైనా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేస్తే పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా మదర్స్ డే సందర్భంగా ఈయన తన అమ్మ అంజనాదేవితో కలిసి ఉన్నటువంటి కొన్ని అపురూపమైన ఫోటోలను ఈయన తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ తన తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవితోపాటు తన చెల్లెలు తమ్ముళ్లు కలిసి తన అమ్మతో దిగిన కొన్ని రేర్ ఫోటోలను ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు..

అమ్మ మన మొదటి గురువు..

ఇలా ఈ ఫోటోలను షేర్ చేసిన చిరు” అమ్మ… మన మొదటి గురువు,మన మొదటి ధైర్యం, కనిపించే దైవం కూడా “కని పెంచిన” మాతృమూర్తి తర్వాతే..మన విజయాల వెనక త్యాగం..మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మది.మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే” అంటూ చిరంజీవి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

బాబీ సినిమాతో బిజీగా చిరు..

Advertisement

చిరంజీవి తన అమ్మ అంటే ఎంతో అమితమైన గౌరవం చూపిస్తూ ఉంటారు. తల్లి పట్ల గౌరవం ప్రేమ ఉన్నటువంటి ఈయన నేడు మాతృ దినోత్సవం సందర్భంగా తన తల్లితోపాటు మాతృమూర్తులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడంతో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన బాబి డైరెక్షన్లో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్ అన్ని కూడా పూర్తి అయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న చిరంజీవి త్వరలోనే బాబి డైరెక్షన్లో బిజీ కానున్నారు.

Advertisement

ఇప్పటికే చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభర సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు పూర్తికాని నేపథ్యంలో విడుదల వాయిదా పడుతూ వస్తోంది అయితే ఈ సినిమా జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు చిత్ర బృందం మాత్రం ఈ సినిమా విడుద గురించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ సినిమాలో చిరంజీవి త్రిష జంటగా నటించిన సంగతి తెలిసిందే.

Also Read: టాలీవుడ్ ప్రొడ్యూసర్ చీటింగ్ … కోట్ల రూపాయలు మోసపోయానన్న సంజన,!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×