Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకున్న ఈమె తెలుగులో కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకున్నారు. సీతారామం(Sitaramam) అనే సినిమా ద్వారా తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని తెలుగు ప్రేక్షకుల మదిలో సీతగా నిలిచిపోయారు. ఇక ఈ సినిమా తర్వాత ఫ్యామిలీ స్టార్, హాయ్ నాన్న వంటి సినిమాలలో నటించి అదే స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక త్వరలోనే అడివి శేష్ హీరోగా నటించిన డెకాయిట్(Dacoit) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
సన్ ఆఫ్ సర్దార్ 2..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు చివరి దశలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నా మృణాల్ త్వరలోనే సన్ ఆఫ్ సర్దార్ 2 (Son Of Sardar 2)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా జూలై 25వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మృణాల్ నటుడు అజయ్ దేవగన్(Ajay Devagan) రవికిషన్ తో కలిసి కపిల్ శర్మ టాక్ షో కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వీరందరి మధ్య సరదా సంభాషణ జరిగిందని తెలుస్తోంది.
చిన్నప్పటి నుంచి నా కల..
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా నటి మృణాల్ ఠాకూర్ తన పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తనుకు చిన్నప్పటినుంచి పెళ్లి(Wedding) చేసుకొని తల్లి కావడం అనేది కల అంటూ తెలియచేశారు. ప్రస్తుతం అయితే తన ఫోకస్ మొత్తం కెరియర్ పైనే ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. టీవీ ఆర్టిస్టుగా తన ప్రయాణం మొదలుపెట్టిన ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కెరియర్ పై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు వెల్లడించారు.
అక్కినేని హీరోతో రిలేషన్?
ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం మృణాల్ డేటింగ్ రూమర్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈమె టాలీవుడ్ నటుడు అక్కినేని సుమంత్(Sumanth) తో కలిసి చాలా క్లోజ్ గా ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వీరిద్దరి గురించి ఎన్నో రకాల రూమర్లు బయటకు వచ్చాయి. అయితే ఈ రూమర్లపై వీరిద్దరూ స్పందిస్తూ ఆ వార్తలను కొట్టి పారేశారు.వీరిద్దరూ కలిసి సీతారామం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మృణాల్ హీరోయిన్గా నటించగా సుశాంత్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ఇలా ఈ సినిమాతో ఏర్పడిన పరిచయం కారణంగానే వీరిద్దరూ కలిసి క్లోజ్ గా ఫోటో దిగడంతో ఈ ఫోటో పై ఎన్నో రకాల ఊహాగానాలు వచ్చాయి. ఇక ప్రస్తుతం ఈమె సన్ ఆఫ్ సర్దార్ 2, డెకాయిట్, అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా బాలీవుడ్ రామాయణ సినిమాలో కూడా ఓ పాత్రలో నటించబోతున్నారని సమాచారం.
Also Read: Pawan Kalyan: రామ్ చరణ్, ఎన్టీఆర్ నాటు నాటు పాటపై పవన్ కామెంట్స్.. ఏమన్నారంటే?