BigTV English

Suriya: తెలుగు ప్రేక్షకులు నిన్ను నెత్తిన పెట్టుకుంటే.. ఇదేనా నువ్వు చేసేది సూర్య

Suriya: తెలుగు ప్రేక్షకులు నిన్ను నెత్తిన పెట్టుకుంటే.. ఇదేనా నువ్వు చేసేది సూర్య

Suriya: సూర్య.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అయితే సూర్యకు మరో పేరు కూడా ఉంది.  అదే తెలుగువారి దత్తపుత్రుడు. తెలుగు ప్రేక్షకుల గురించి అందరికీ తెల్సిందే. కథ నచ్చిందంటే చాలు.. హీరో ఎవరు.. ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చింది అనేది కూడా చూడరు. అలా తమిళ్ నుంచి తెలుగువారికి పరిచయమైన హీరో సూర్య. గజినీ సినిమాతో తెలుగువారికి పరిచయమయ్యాడు సూర్య. ఆ సినిమా ఎంతటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు. ఇక గజినీ తరువాత సూర్య వెనక్కి  తిరిగి చూసుకోలేదు ఆయన నటించిన ప్రతి తమిళ్ సినిమా తెలుగులో రిలీజ్ అయ్యింది. అలా తెలుగువారికి సూర్య దత్తపుత్రుడుగా మారిపోయాడు.


 

తమిళ్ లో సూర్యకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు కానీ, తెలుగులో మాత్రం ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది. తెలుగు హీరోలకు చేసినట్లు సూర్య పుట్టినరోజును ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. పూలాభిషేకాలు.. పాలాభిషేకాలు.. కొంతమంది అయితే రక్తాభిషేకం కూడా చేశారు. అంతలా తెలుగువారు సూర్యను అభిమానించారు. ఇక కేవలం సినిమాల వలనే ఇంత అభిమానమా.. అంటే కాదు. సూర్య చేసే మంచి పనులకు  తెలుగువారు ఫిదా అయ్యారు. అనాధ పిల్లలను చదివించడం, అగారం ఫౌండేషన్ నడిపించడం.. ఇలా సూర్య చేసిన మంచి పనులే అతడికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి.


 

తెలుగు అభిమానులు సూర్య కోసం ఇంత చేస్తే.. అతను మాత్రం తెలుగువారిని చులకనగా తీసుకున్నాడా.. ? ప్రస్తుతం ఇదే విషయమై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అదేంటి.. అలా అనేశారు. అంతలా సూర్య ఏం చేశాడు.. ? అంటే. తన తమిళ సినిమాకు తెలుగులో టైటిల్ మార్చలేదు. ఇదొక పెద్ద సమస్యనా అంటారేమో ఇదే ఇక్కడ పెద్ద సమస్య. ఈమధ్యకాలంలో భాషా వివాదం ఏ రేంజ్ లో రచ్చ రేపుతున్నాయో అందరీకీ తెల్సిందే. అంతెందుకు ఈరోజు.. కర్ణాటకలో హరిహర వీరమల్లు టైటిల్.. వాళ్ల భాషలో లేదని ఫ్లెక్సీలు చింపేశారు.

 

ఇక అదే భాషాభిమానం తెలుగువారు చూపిస్తున్నారు. అయితే ఇది ఇప్పుడే కొత్తగా జరిగితే అంతగా పట్టించుకోకపోదురు. కానీ, తమిళ తంబీలు గత కొన్నేళ్లుగా ఇదే పని చేస్తున్నారు. తెలుగువారు అంటే చులకనగా చూస్తున్నారు. టైటిల్స్ ఎలా పెట్టినా.. వారు చూస్తారులే అని తేలికగా తీసుకుంటున్నారు. పొన్నియన్ సెల్వన్, వెట్టయాన్, తూనీవు,  తుడురమ్, మార్గాన్.. ఇలా తమిళ్ టైటిల్స్ తోనే తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అసలు ఆ టైటిల్స్ ఏంటి.. ? వాటి అర్ధం ఏంటి.. ? అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ, తెలుగువారు సినిమాలపై ఉన్న పిచ్చితో వాటిని హిట్ చేస్తున్నారు. అదే.. ఆ మంచి మనసునే వారు చులకనగా తీసుకున్తున్నారు.

 

ఇప్పుడు సూర్య సైతం అదే బాటలో నడవడం తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్జే  బాలాజీ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రం కరుప్పు. అంటే తెలుగులో నలుపు అని అర్ధం. ఈ టైటిల్ కు కనీసం నలుపు అని పెట్టినా అంత వివాదం రాకపోదును. కానీ,  సూర్య పుట్టినరోజునే అన్ని భాషల్లో అదే పేరుతో టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ఎంత బావున్నా.. కరుప్పు అనే టైటిల్ ఎవరికీ పెద్దగా ఎక్కలేదు. తమిళ్ లో ఆ టైటిల్ యాప్ట్ అయ్యి ఉండొచ్చు. కథలో ఆ పేరు ఉంటుంది కాబట్టి పెట్టి ఉండొచ్చు. కానీ, తెలుగుకు వచ్చేసరికి ఆ పేర్లన్నీ మారిపోతాయి. అలా అయితే ఇక్కడ టైటిల్ మార్చాలి కదా. మేకర్స్ మార్చనప్పుడు సూర్య అయినా అడ్డుపడాలి కదా అని అభిమానుల ఆవేదన. తెలుగు ప్రేక్షకులు నిన్ను నెత్తిన పెట్టుకుంటే.. ఇదేనా నువ్వు చేసేది సూర్య అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మరి ట్రైలర్ వచ్చేలోపు టైటిల్ మారుస్తాడా.. ? లేదా తెలుగు అభిమానుల ఆగ్రహానికి సూర్య బలవుతాడా.. ? అనేది చూడాలి.

Related News

Cm Revanth Reddy: చలనచిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి వెళ్లాలి

Anaganaga Oka Raju : వంశీ మామూలు ప్లానింగ్ కాదు, ఏకంగా పవన్ కళ్యాణ్ టార్గెట్

OG Ticket: ఏపీలో ‘ఓజి’ స్పెషల్ షోకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధర తెలిస్తే షాకే!

Disha patani: దిశా పటాని ఇంటి ముందు కాల్పులు, నిందితులు ఎన్కౌంటర్

OG Censor : ఓజి సినిమా సెన్సార్ పూర్తి, కొత్త రికార్డులు ఖాయం

TG Viswa Prasad: విశ్వప్రసాద్ సరికొత్త రూటు… ఇక ఇండస్ట్రీకి మంచి రోజులే

Manchu Lakshmi: ఆమె నా రోల్ మోడల్.. ట్విస్ట్ ఇచ్చిన మంచు లక్ష్మీ!

Manchu Lakshmi: మనోజ్ రీ ఎంట్రీ వెనుక ఇంత కథ ఉందా.. మంచు లక్ష్మీ ఏమన్నారంటే?

Big Stories

×