Big TV Kissik Talks show: బిగ్ టీవీ (Big tv)నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks) కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభించింది. ఇక ఈ వారం ఈ కార్యక్రమంలో సీరియల్ నటి శోభా శెట్టి (Sobha Shetty)హాజరయ్యారు. శోభ శెట్టి అంటే టక్కున అందరికీ ఈమె గుర్తుకు రాకపోయినా కార్తీకదీపం(Karthika Deepam) విలన్ మోనిత (Monitha)అంటే మాత్రం అందరికీ టక్కున గుర్తుకువస్తుంది. కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయిన ఈమె ఈ సీరియల్ తర్వాత ఎలాంటి సీరియల్ లోను నటించలేదు. ప్రస్తుతం పలు తెలుగు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. అదేవిధంగా తెలుగు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని మరింత ఆదరణ సొంతం చేసుకున్నారు.
కార్తీకదీపం విలన్ గా…
తాజాగా జబర్దస్త్ వర్ష (Varsha)యాంకర్ గా వ్యవహరిస్తున్న కిస్సిక్ టాక్ షోకి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో భాగంగా శోభా శెట్టి కెరియర్ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. కన్నడ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంఘటనలు గురించి అలాగే తమిళం, తెలుగులో సీరియల్స్ అవకాశాలు గురించి కూడా ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. అదేవిధంగా తన పెళ్లి(Wedding) గురించి కూడా ఈ సందర్భంగా శోభ శెట్టి క్లారిటీ ఇచ్చారు. ఈమె మరో బుల్లితెర నటుడు యశ్వంత్ రెడ్డి(Yashwanth Reddy) అనే వ్యక్తిని ప్రేమించిన సంగతి తెలిసిందే త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.
యశ్వంత్ రెడ్డితో నిశ్చితార్థం…
కార్తీకదీపం సీరియల్ లో హీరో కార్తీక్ తమ్ముడి పాత్రలో యశ్వంత్ నటించారు. ఈ సీరియల్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. అయితే వీరి ప్రేమ విషయాన్ని ఎక్కడ బయట పెట్టలేదు కానీ బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా వీరి ప్రేమ వ్యవహారం బయటపడడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక వీరిద్దరూ కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఏడాది శోభాశెట్టి యశ్వంత్ ఇద్దరు ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం(Engagment) కూడా జరుపుకున్నారు.
ఈ క్రమంలోనే శోభ శెట్టి పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ఏడాదిలోనే తాను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశామని తెలియజేశారు. అయితే యశ్వంత్ తన లవ్ ప్రపోజల్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. యశ్ లేకపోతే నేను నా జీవితాన్ని అసలు ఊహించుకోలేనని, నాకు జీవితమే లేదు అంటూ ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి శోభా శెట్టి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఇండస్ట్రీలో ఈమె ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు. కొన్ని సందర్భాలలో తన అమ్మతో కలిసి ఎయిర్ పోర్ట్ లోనే నిద్రపోయిన రోజులు ఉన్నాయి అంటూ శోభా శెట్టి ఎమోషనల్ ఈ. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ శనివారం బిగ్ టీవీ ప్లస్ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం కానుంది.