E-Paper
Advertisement

Mrunal Thakur: అమ్మకు అవమానం… కట్ చేస్తే ఖరీదైన కారు కొన్న మృణాళ్ ఠాకూర్!

Mrunal Thakur: అమ్మకు అవమానం… కట్ చేస్తే ఖరీదైన కారు కొన్న మృణాళ్ ఠాకూర్!
Advertisement

Mrunal Thakur: మృణాళ్ ఠాకూర్ పరిచయం అవసరం లేని పేరు. మరాఠీ ముద్దుగుమ్మగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె కెరియర్ మొదట్లో పలు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగారు. అనంతరం మరాఠీ సినిమాలలో అవకాశాలు అందుకోవడమే కాకుండా ఈమె నటించిన సినిమాలు మంచి సక్సెస్ కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకున్నారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్న ఈమె తెలుగులోకి సీతారామం (Sitaramam)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సీతగా తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేశారు. ఈ సినిమా తరువాత మృణాళ్ ఠాకూర్ కు పెద్ద ఎత్తున తెలుగులో కూడా అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

బంధువుల నుంచి అవమానం..

ఇకపోతే ఈమె ఇటీవల ఓ సందర్భంలో తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా తన తల్లికి జరిగిన అవమానం గురించి మృణాళ్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తన కుటుంబం సంపన్న కుటుంబం కాదని ఎన్నో సందర్భాలలో అవమానాలను ఎదుర్కొన్నామని తెలిపారు. ఒకానొక సందర్భంలో మా బంధువులు వారి కారులో మా అమ్మను కూర్చో పెట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదని, అలా ఆరోజు మా అమ్మకు జరిగిన అవమానం నన్ను బాగా బాధపెట్టిందని తెలిపారు.

మెర్సిడెస్ మొదటి వ్యక్తిని నేనే..

Advertisement

ఆ రోజే నేను మా అమ్మకు ఒక మాట ఇచ్చాను. ఏదో ఒక రోజు నీకు ఖరీదైన కారు కొనిస్తానని మాట ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారమే తాను మెర్సిడెస్ కారు (mercedes car)కొన్నానని తెలిపారు. అయితే మా ఫ్యామిలీలో ఇలాంటి ఖరీదైన కారు కొన్న తొలి వ్యక్తిని నేనే అంటూ ఎంతో గర్వంగా అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన మృణాళ్ నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రలలో నటిస్తూనేడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.

ఉగాది పండుగ సందర్భంగా డెకాయిట్..

Advertisement

ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎన్నో అవమానాలను ఇబ్బందులను ఎదుర్కొన్న ఈమె వివాదాలలో కూడా నిలిచారు. ఇక ఈమె తెలుగులో చివరిగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈమె ప్రస్తుతం అడివి శేష్(Adivi Sesh) తో కలిసి డెకాయిట్ (Decoit)అనే సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19,2026లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఈ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని డిసెంబర్ 25న విడుదల కావాల్సి ఉండగా, షూటింగ్ ఆలస్యం కావడంతో వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Samantha: సమంత ఫోటో పై నెటిజన్ కామెంట్స్.. దిమ్మ తిరిగి కౌంటర్ ఇచ్చిన సామ్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×