BigTV English

Mrunal Thakur :నాకు అలాంటి డైరెక్టర్ తో పని చేయడం ఇష్టం 

Mrunal Thakur :నాకు అలాంటి డైరెక్టర్ తో పని చేయడం ఇష్టం 

Mrunal Thakur : సీతారామం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ సందర్భాలలో మొదటి సినిమాతో విపరీతమైన పేరు వస్తుంది. సరిగ్గా మృణాల్ సీతారామం సినిమాతో అదే జరిగింది.


కేవలం మృణాల్ ఠాకూర్ మాత్రమే కాకుండా హను రాఘవపూడి కెరియర్ లో కూడా ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్. ప్రస్తుతం ప్రభాస్ లాంటి హీరోతో సినిమా చేస్తున్నాడు అంటే. దానికి సీతారామం సక్సెస్ కూడా ఒక కారణం అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత మృణాల్ ఠాకూర్ చేసిన సినిమా హాయ్ నాన్న. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది.

అలాంటి వారితో పనిచేయటం ఇష్టం 


హాయ్ నాన్న సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు శౌర్యవ్. ఈ సినిమా చేయడానికి అంటే ముందు అతను ఒక డాక్టర్. కానీ మొదటి సినిమాతోనే ఇంత మంచి సక్సెస్ అందుకున్నాడు. సినిమా చేస్తున్న తరుణంలో ఇంత బ్రిలియంట్ ఫిలిం తీస్తాడు అని మేము ఊహించలేదు అని తెలిపింది మృణాల్ ఠాకూర్. నేను ఎప్పుడూ కొత్త ఫిలిం మేకర్స్ తో పనిచేయడానికి ఇష్టపడతాను. ఎందుకంటే కొత్త ఫిలిం మేకర్స్ ఎప్పుడు తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి మంచి ప్యాషన్ తో ఉంటారు. శౌర్యవ్ కూడా అలా ప్యాషన్ ఉన్న దర్శకుడు అని మృణాల్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

పర్ఫెక్ట్ టైంలో బ్లాక్ బస్టర్ 

సీతారామం సక్సెస్ అనేది మృణాల్ ఠాకూర్ కెరియర్ కు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పటికే హిందీలో చేసిన జెర్సీ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. సరైన హిట్ సినిమా ఒకటి కూడా పడలేదు. ఆ తరుణంలో సీతారామం పడటంతో ఇంక వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే శేష్ తో పాటు డెకాయిట్ సినిమాలో కనిపించనుంది. ముందుగా నాగ్ అశ్విన్ కల్కి సినిమా కోసం మృణాల్ ఠాకూర్ ను తీసుకున్నారు. ఆ తరుణంలో హను కథ చెప్పడంతో, సీత పాత్రకు మృణాల్ ఠాకూర్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని అనిపించి, దర్శకుడు హనుకు చెప్పాడు. హను ఆడిషన్ చేసిన తర్వాత తనకి కూడా నచ్చడంతో అలా సీత పాత్రను తనకు అందించాడు.

Also Read: Lokesh Kanagaraj: నా దృష్టిలో రజనీకాంత్, కమల్ హాసన్ కంటే అతనే స్టార్ హీరో

Related News

Peddi Movie: పెద్ది కొత్త షెడ్యూల్ ఖరారు.. ఆ దేశానికి పయనమైన టీమ్!

Chiranjeevi: బ్లడ్ బ్యాంక్ స్థాపించడం వెనుక ఆయన హస్తం ఉంది -చిరంజీవి

Mrunal Thakur: సినిమాల ఫెయిల్యూర్ కు అదే ప్రధాన కారణం.. ఫైర్ అయిన మృణాల్!

War 2 Tickets: వార్ 2 టికెట్స్‌.. హిందీ-తెలుగు వెర్షన్ల మధ్య ఇంత తేడానా? తెలుగు వారిన దోచేస్తున్న నిర్మాతలు

Jr.NTR: ఆ ఒక్క కారణంతోనే వార్ 2 చేశా… అసలు విషయం చెప్పిన ఎన్టీఆర్!

Big Stories

×