Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ram Charan Tej)ప్రస్తుతం బుచ్చిబాబు సాన (Bucchi Babu Sana)దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా(Peddi movie) షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నప్పటికీ అభిమానులు మాత్రం ఈయన సినిమాల విషయంలో కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. RRR వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఈయన క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ (Game Changer)సినిమాకు కమిట్ అయ్యారు. ఎన్నో అంచనాలు నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకులను ఎంతో నిరాశకు గురి చేసింది.
హిట్ కొట్టాలన్న కసి..
ఈ సినిమా అభిమానులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోవడంతో చరణ్ తన తదుపరి సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారని తెలుస్తోంది. ఎలాగైనా ఇండస్ట్రీ హిట్ కొట్టాలన్న కసితోనే ఈయన సినిమాలను ఎంపిక చేసుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్న పెద్ది సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా విషయంలో చరణ్ కూడా ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి.
శ్రీలంక పయనమైన పెద్ది టీమ్…
ఇక డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఈ సినిమా షూటింగ్ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఈ సినిమా షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొత్త షెడ్యూల్ చిత్రీకరణ కోసం చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణ కోసం చిత్ర బృందం శ్రీలంక(Sri Lanka) వెళ్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అందుకు తగ్గ ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది. వచ్చేవారమే ఈ సినిమా షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కానుంది.
రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ….
ఇక ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor)నటించబోతున్నారు. ఇప్పటికే ఈమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయడంతో అభిమానులను కూడా ఆకట్టుకుంది ఇక ఇటీవల దేవర సినిమాతో మంచి హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే చరణ్ తో కలిసి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు. ఇక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే ఆలోచనలో బుచ్చిబాబు ఈ సినిమా కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని స్పష్టమవుతుంది.
Also Read: Mrunal Thakur: సినిమాల ఫెయిల్యూర్ కు అదే ప్రధాన కారణం.. ఫైర్ అయిన మృణాల్!