Lokesh Kanagaraj: ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా తెలుగు ఆడియన్స్ అన్ని రకాల సినిమాలు చూస్తున్నారు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గట్టిగా మాట్లాడితే కొన్నిసార్లు తెలుగు సినిమాల కంటే కూడా మలయాళం సినిమాలకే ఎక్కువ బ్రహ్మరథం పడుతూ ఉంటారు. దర్శకుడు హరీష్ శంకర్ లాంటి వాళ్ళు కూడా ఈ మాటలను మాట్లాడారు.
ఇక ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా కూలీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు చాలామంది స్టార్ హీరోలు కనిపిస్తున్నారు. గతంలో కూడా విక్రమ్ సినిమాలో కొంతమంది నటులను పెట్టి అద్భుతంగా డీల్ చేశాడు లోకేష్. ఇక ప్రస్తుతం అదే స్థాయిలో ఈ సినిమాను కూడా డిజైన్ చేస్తాడు అని కొంతమంది నమ్మకం.
అతనే నా స్టార్ హీరో
ఒక దర్శకుడికి మొదట అవకాశం దొరకటం అనేది గగనం. ఆ అవకాశాన్ని అందుకొని ఆ దర్శకుడు ఏ స్థాయికి వెళ్ళాడు అనేది సెకండరీ. కానీ అవకాశం ఇచ్చిన వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకోవడం గ్రాటిట్యూడ్. మా నగరం సినిమాతో ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ఆ తరువాత కార్తీ హీరోగా చేసిన ఖైదీ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక ప్రస్తుతం ఖైదీ 2 సినిమాను లోకేష్ చేయాల్సి ఉంది. దీనిపై రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో స్పందించాడు లోకేష్. విజయ్, కమల్ హాసన్, రజనీకాంత్ ప్లాంట్ స్టార్ హీరోలతో పని చేసిన తర్వాత మళ్లీ టైర్2 హీరో పనిచేయటం ఎలా ఉంది అని ఒక జర్నలిస్ట్ లోకేష్ ను అడిగాడు. దీనికి లోకేష్ స్పందిస్తూ… నా మొదటి సినిమా అయిపోయిన తర్వాత నన్ను బలంగా నమ్మి అంత పెద్ద బాధ్యత నాకు అప్పగించింది హీరో కార్తీ. నా దృష్టిలో రజనీకాంత్,కమల్ హాసన్ కంటే కూడా కార్తీక్ నేను బిగ్ హీరోలా ఫీల్ అవుతాను అంటూ చెప్పాడు.
ఖైదీ 2 పై క్లారిటీ వచ్చేసినట్లే
ఇక లోకేష్ చెప్పిన మాటలు బట్టి చూస్తుంటే కూలీ సినిమా అయిపోయిన వెంటనే ఖైదీ 2 సినిమాను మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఖైదీ సినిమాను లోకేష్ డీల్ చేసిన విధానం చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా ఢిల్లీ బ్యాక్ స్టోరీ తెలుసుకోవడానికి చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం లోకేష్ కి సపరేట్ గా ఒక బ్రాండ్ ఏర్పడిపోయింది. లోకేష్ ప్రస్తుతం ఏ హీరో తో సినిమా చేసిన లోకేష్ పేరు చూసి కూడా థియేటర్ కు వచ్చే ఆడియన్స్ ఉన్నారు అని చెప్పడం అతిశయోక్తి కాదు.
Also Read: SR Kalyanamandapam : ఒక సక్సెస్ తీసుకొచ్చిన వరుస డిజాస్టర్స్