Pushpa 2 Stampede: టాలీవుడ్ స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా ప్రిమీయర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అందరికీ తెలిసే ఉంటుంది.. ఈ దారుణ ఘటనలో ఒక తల్లి ప్రాణాలను వదిలేసింది.. ఆమె బిడ్డ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ ఘటనపై ఇప్పటికే పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది.. అంతేకాదు ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది.. ఆ నోటీసులో ఏముందో తెలుసుకుందాం..
పుష్ప ఘటన NHRC సీరియస్..
గతంలో ఎప్పుడూ లేనివిధంగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ టైం లో జరిగింది. తన సినిమా రెస్పాన్స్ ని తెలుసుకోవడానికి ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా థియేటర్కు వెళ్లిన అల్లు అర్జున్ ను చూడ్డానికి అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లారు.. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలను కోల్పోయింది. ఆమె కుమారుడు ప్రాణం ఉన్న జీవస్తవంలా ఇప్పటికీ ఆసుపత్రి బెడ్ పైనే ఉన్నాడు.. ఈ ఘటనపై తాజాగా తెలంగాణ జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయ్యింది. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్, రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. అలాగే, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘటనలో పోలీసుల పాత్రపై కూడా సంపూర్ణ నివేదిక సమర్పించాలని కమిషన్ స్పష్టం చేసింది..
Also Read : తల్లికి మాటిచ్చిన అక్షయ్.. అవనిని మోసం చేసిన ప్రణతి..
శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందంటే..?
అల్లు అర్జున్ నటించిన మాస్ యాక్షన్ మూవీ పుష్ప… ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్ గా పుష్ప 2 రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రీమియర్ షోలో బాధాకర సంఘటన జరిగింది. ప్రివ్యూ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో సినిమా చూసేందుకు వచ్చిన అభిమానుల రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో శ్రీ తేజ్ అనే బాలుడు కోమాలోకి వెళ్లగా అతని తల్లి రేవతి మరణించింది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న మానవ హక్కుల కమిషన్, విచారణను వేగవంతం చేసింది. ప్రభుత్వం మరియు పోలీసుల వైఫల్యాలను పరిశీలిస్తూ, చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. బాధితుల కుటుంబాలకు తక్షణ పరిహారంగా రూ.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.. ఏ ఇలాంటి ఘటనలు ఇకముందు జరగకుండా ఉండాలని చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం శ్రీతేజ్ పరిస్థితి అలానే ఉందని తెలుస్తుంది.. ఇంకా మనుషుల్ని గుర్తుపట్టడం లేదని ఇటీవల బిగ్ టీవీతో తండ్రి చెప్పిన విషయం తెలిసిందే.. మరి అతని ఆరోగ్యం ఎప్పుడు కోరుకుంటుందో అని తెలుగు రాష్ట్రాల ఎదురుచూస్తున్నారు.. తల్లి చనిపోయిన బిడ్డ బ్రతికితే బాగుండు అని కోరుకుంటున్నారు..