Anchor Ravi:ప్రముఖ మేల్ యాంకర్ గా తనకంటూ ఒక అద్భుతమైన కెరియర్ ను బిల్డ్ చేసుకున్నారు యాంకర్ రవి (Anchor Ravi). ఒకవైపు పలు షోలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే.. మరొకవైపు సినిమా ఈవెంట్లకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ లాంటి ప్రోగ్రామ్స్ తో మంచి పేరు కూడా వచ్చింది. అంతేకాదు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 (Telugu Bigg Boss S5)లో కూడా పాల్గొని అక్కడ కూడా తన పెర్ఫార్మన్స్ తో అందరి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇంకా బుల్లితెరపై హోస్ట్ గానే కాకుండా వెండితెరపై పలు చిత్రాలలో కూడా నటించారు. వాస్తవానికి అక్కడ హీరోగా చేసి సక్సెస్ అవ్వాలనుకున్నారు కానీ విజయం ఆయనను వరించలేదు. దీంతో మళ్లీ యాంకర్ గానే సెటిల్ అయిపోయారు.
అవన్నీ ముందే ఊహించాను – యాంకర్ రవి
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి తన జీవితంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా ఒక లేడీ యాంకర్.. ఒక ట్రెండీ స్వామీజీ తో కలిసి తనపై చేతబడి చేయించిందని చెప్పి హాట్ బాంబ్ పేల్చారు రవి. ఈ విషయం అటు విన్న యాంకర్ కే కాదు ఇటు అభిమానులను కూడా కలవరపాటుకు గురిచేసింది. ఇంటర్వ్యూలో భాగంగా ” ట్రోలింగ్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?” అని యాంకర్ ప్రశ్నించగా.. “ఇండస్ట్రీలోకి వచ్చే ముందే ఇలాంటివన్నీ ఉంటాయని ఊహించి ముందే ప్రిపేర్ అయి వచ్చాను. కాబట్టి ఆ ట్రోలింగ్ నేను పెద్దగా పట్టించుకోను.
నాపై చేతబడి చేయించారు – యాంకర్ రవి
అంతెందుకు నా ఎదుగుదలను ఓర్వలేక నా బ్యాచ్ లోనే ఒక యాంకర్ నాపై పూజలు చేయించింది. అది కూడా లేటెస్ట్ గా ట్రెండ్ అయిన ఒక స్వామి దగ్గరకు వెళ్లి పూజలు చేయించింది. అది ఒక రకమైన చేతబడి. ముఖ్యంగా నా కెరియర్ డౌన్ ఫాల్ అవ్వాలని.. నాపై ఇలా చేతబడి క్షుద్ర పూజలు చేయించారు ..నాకు బాగా క్లోజ్ గా ఉన్న వ్యక్తులు నాతో చెప్పారు. మొదట ఇవన్నీ ఆశ్చర్యం అనిపించినా.. ఆ తర్వాత నన్ను ఇలాంటివి ఏమి చేయలేవని, అయినా నేను ఇవన్నీ నమ్మను అని కూడా చెప్పాను” అంటూ రవి చెప్పుకొచ్చారు.
వారి పేర్లు బయటకు తీస్తున్న నెటిజన్స్..
మొత్తానికి అయితే రవి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. సామాన్యులకే అనుకుంటే సెలెబ్రెటీ అయిన మీకు కూడా తప్పలేదా ఇలాంటి క్షుద్ర పూజలు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే యాంకర్ రవి ఇలా కామెంట్లు చేయడంతో ఆ లేడీ యాంకర్, ఆ స్వామీజీ పేర్లు బయటకు తీస్తూ మరీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
యాంకర్ రవి కెరియర్..
యాంకర్ రవి విషయానికొస్తే.. ‘సంథింగ్ స్పెషల్’ షోతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.. ఆ తర్వాత పటాస్, ఆడాళ్ల మజాకా, ఆడాళ్లు మీకు జోహార్లు వంటి షోలు చేసి మరింత పాపులారిటీ అందుకున్నారు. ఇక ఢీ జూనియర్స్, ఫ్యామిలీ సర్కస్, మొండి మొగుడు పెంకి పెళ్ళాం, కిర్రాక్ , అలీ టాకీస్ వంటి షోలు కూడా చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు రవి.
ALSO READ:Film industry: నోరు జారిన నిర్మాత..200 మంది కార్మికులతో ఆందోళన!