Coolie Trailer: సౌత్ సినిమా ఇండస్ట్రీ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా కూలీ.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర వంటి స్టార్ హీరోలు ఈ సినిమాలో నటించడం వలన విపరీతమైన క్యూరియాసిటీ పెరిగింది.
ఈ సినిమా ఆగస్టు 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.రజనీకాంత్ సినిమా నుంచి ఆడియన్స్ ఏమి కోరుకుంటారో వాటన్నిటిని కూడా ఈ సినిమాలో ప్రజెంట్ చేశాడు లోకేష్. రజినీకాంత్ కటౌట్ ను పర్ఫెక్ట్ గా వాడాడు. ట్రైలర్ చూస్తుంటే కమల్ హాసన్ కు విక్రంతో ఎటువంటి హిట్ ఇచ్చాడో , ఇప్పుడు కూలి సినిమాతో రజనీకాంత్ కి అదే స్థాయికి అందించబోతున్నాడు అని ఈజీగా అర్థమవుతుంది. ట్రైలర్ లో ఉపేంద్రను సరిగ్గా చూపించలేదు.
ట్రైలర్ టాక్
సౌబిన్ తో మొదలైన ఈ ట్రైలర్ అందరి నటులకు సరైన ప్రత్యేకత ఉండేలా డిజైన్ చేశారు. సత్యరాజ్ కూతురుగా శృతిహాసన్ నటిస్తుంది. సత్యరాజ్ ఫ్రెండ్ రజినీకాంత్. రజనీకాంత్ సినిమాలో దేవ అనే పాత్రలో కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ట్రైలర్లో రజనీకాంత్ ని రివిల్ చేసే విధానం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. బీభత్సమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాకుండా అనిరుద్ వాయిస్ లో రజనీ ను రివీల్ చేయడం అనేది కొత్తగా అనిపిస్తుంది. ఏదేమైనా ట్రైలర్ చూస్తుంటే సక్సెస్ గ్యారెంటీ అనిపిస్తుంది.