Goa Government: భారతదేశంలో ఉన్న అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక రాష్ట్రాల్లో గోవా ఒకటి. గోవాలోని అందమైన బీచ్ లు, రాత్రి జీవన శైలి, సాంస్కృతిక వైవిధ్య పర్యాటకులను తెగ ఆకర్షిస్తాయి. అయితే గత కొన్ని రోజుల నుంచి పర్యాటక ప్రదేశాల్లో దోపిడీ చేసే సంఘటనలు ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా స్థానిక టాక్సీ ఆపరేటర్లు, ఇతర వ్యాపారుల నుంచి ఈ సమస్యను అరికట్టేందుకు, గోవా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే 2025 ఆగస్టు 2న గోవా అసెంబ్లీ కొత్త చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం.. పర్యాటక ప్రదేశాల్లో దోపిడీ, అనధికార కార్యకలాపాలకు పాల్పడితే రూ.1 లక్ష వరకు జరిమానా విధించనున్నారు.
ఈ కొత్త బిల్లు గోవా టూరిజం ప్రమోషన్, మేనేజ్‌మెంట్, రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ బిల్ 2025గా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇది పర్యాటకులకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించనుంది. ఈ బిల్లు అమలులోకి రావడం వల్ల గోవా పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందనుంది.. ఈ చట్టం ద్వారా.. అధిక ధరలు వసూలు చేయడం, పర్యాటకులను వేధించండం, ఇతర మోసపూరిత కార్యకలాపాలను నియంత్రించేందుకు కఠిన నిబంధనలు అమలులోకి రానున్నాయి.
ALSO READ: IBPS Notification: డిగ్రీ అర్హతతో 10,277 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ వెకెన్సీలు.. డోంట్ మిస్
రోజురోజుకీ గోవాలో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2025 జనవరిలో 28.5 లక్షల మంది గోవాను సందర్శించారు. ఇది గత సంవత్సరం కంటే 10.5% పెరుగుదల నమోదైంది. అయితే.. టాక్సీ మాఫియా వంటి సమస్యలు, అధిక ఛార్జీలు, అనధికార కార్యకలాపాలు విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గడానికి కారణమయ్యాయని స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో తెలిపారు. ఈ చట్టం ఈ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ALSO READ: Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!
అలాగే గోవా మరొక నిర్ణయం తీసుకునే దిశ అడుగులు వేస్తోంది. గోవా సర్కార్ యాప్-ఆధారిత క్యాబ్ సేవలను ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది పర్యాటకులకు సరసమైన రవాణా సౌకర్యాలను అందజేస్తుంది. ఈ చర్యలు గోవా పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాయని, అలాగే స్థానిక ఆర్థిక వ్యవస్థను మరింత బలంగా చేస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పర్యాటకుల భద్రత, సౌకర్యం కోసం ఈ చట్టం తీసుకుచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇది గోవాను మరింత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా మారుస్తుంది.