E-Paper
Advertisement

OTT Movie : పాపులర్ హీరోయిన్ కు బతికుండగానే నరకం చూపించే కిల్లర్… ఇంటెన్స్ బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పాపులర్ హీరోయిన్ కు బతికుండగానే నరకం చూపించే కిల్లర్… ఇంటెన్స్ బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : బెంగాలీ ఇండస్ట్రీ నుంచి రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఒక సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమా రొమాంటిక్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది. ఇందులో ఒక నటి తనను తానే చంపుకోవడానికి ఒక క్రిమినల్ ని నియమించుకుంటుంది. ఈ స్టోరీ చివరివరకూ చూపు తిప్పుకోకుండా చేస్తుంది. మీరు కూడా ఈ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాపై ఓ లుక్ వేయండి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ?

హొయిచోయ్ లో స్ట్రీమింగ్

Advertisement

‘కిల్‌బిల్ సొసైటీ’ (Killbill Society) 2025లో విడుదలైన ఒక బెంగాలీ బ్లాక్ కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం. ఇది సృజిత్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం 2012లో విడుదలైన “హెమ్‌లాక్ సొసైటీ”కి సీక్వెల్‌గా రూపొందింది. ఇది బ్లాక్ కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ అంశాలు కలగలిసి ఒక ప్రత్యేకమైన కథనంతో ఆకట్టుకుంటోంది. ‘కిల్‌బిల్ సొసైటీ’ సినిమా 2025 ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైంది. ఇది బెంగాలీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ “హొయిచోయ్”లో 2025 జూన్ 13 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో పరంబ్రత చటర్జీ, కౌషానీ ముఖర్జీ , బిస్వనాథ్ బసు, సందిప్త సేన్, అనింద్య చటర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా శ్రీ వెంకటేశ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మించగా, సృజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.

స్టోరీలోకి వెళితే

Advertisement

‘కిల్‌బిల్ సొసైటీ’ కథ పూర్ణ అయిచ్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ చుట్టూ తిరుగుతుంది. ఆమె సినిమాలలో కూడా నటిగా గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆమె జీవితం స్టార్‌డమ్ వైపు సాగుతున్న సమయంలో, ఆమె ప్రైవేట్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఆమె సమాజం, కుటుంబం నుండి తీవ్రమైన అవమానాన్ని ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఆమె తన భర్తనుంచి వేధింపులను ఎదుర్కొంటుంది.
మనస్తాపంతో పూర్ణ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. కానీ స్వయంగా అలా చేయలేక, ఒక కాంట్రాక్ట్ కిల్లర్‌ను నియమిస్తుంది. ఇక్కడే మృత్యుంజయ్ కర్ కథలోకి ప్రవేశిస్తాడు. అతను “కిల్‌బిల్ సొసైటీ” అనే సంస్థలో పనిచేసే కాంట్రాక్ట్ కిల్లర్. అయితే పూర్ణను వెంటనే చంపడానికి బదులు, మృత్యుంజయ్ ఆమెతో సమయం గడపడం ప్రారంభిస్తాడు. ఆమె పట్ల ప్రేమను పెంచుకుంటాడు. ఈ క్రమంలో కథ ఊహించని మలుపులు తీసుకుంటుంది. పూర్ణ ప్రైవేట్ వీడియో ఎలా లీక్ అయింది ? ఎవరు వైరల్ చేశారు ? మృత్యుంజయ్ తో పూర్ణ ప్రేమలో పడుతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Read Also : పోలీస్ ఫ్యామిలీనే టార్గెట్ చేసే కిల్లర్… ఒక్కో హత్య అతి కిరాతకంగా… మస్ట్ వాచ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×