E-Paper
Advertisement

ముద్రగడ పద్మనాభం కన్నుమూత.. ఒక పోరాట శకం ముగిసిందంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!

ముద్రగడ పద్మనాభం కన్నుమూత.. ఒక పోరాట శకం ముగిసిందంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
Advertisement

Mudragada Death:కాపు నాయకుడు ,మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం మృతి చెందడం తెలుగు రాష్ట్రాలని తీరని లోటని చెప్పాలి. ఇక ఇప్పటికే చాలామంది ప్రముఖులు తమ తమ సంతాపాన్ని వ్యక్తం చేయగా ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఆయన మృతి పట్ల ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేశారు

ప్రజా సమస్యల పట్ల ముద్రగడ చూపిన నిబద్ధత, తన నమ్మకాల కోసం రాజీపడని నైజం, సమాజం పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ ప్రజలకు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అంటూ మెగాస్టార్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

Advertisement

1978లో కేవలం 25 ఏళ్ల అతి చిన్న వయసులోనే

Advertisement

ముద్రగడ విషయానికి వస్తే 1953 జనవరి 22న తూర్పు గోదావరి జిల్లా  కిర్లంపూడి లో జన్మించిన ముద్రగడ 1978లో కేవలం 25 ఏళ్ల అతి చిన్న వయసులోనే ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.ఇక ఆ తర్వాత 1983, 1985 ఎన్నికల్లో కూడా వరుసగా విజయాలు సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు ముద్రగడ .ఆ తర్వాత ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రి పదవి నిర్వహించారు .ఇక క్యాబినెట్ లో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు అప్పట్లో సంచలనం స్ప్రుష్టించాయి కూడా.ఆ తర్వాత నిర్వహిస్తున్న మంత్రి పదవిని వదిలిపెట్టి ప్రజారక్షణ సమితిని స్థాపించారు.

also read :అయ్యగారి ఖాతాలో 100 కోట్ల సినిమా పడ్డట్టేనా ?

ఈ కృష్ణమూర్తి, కుందూరు జానారెడ్డితో కలిసి తెలుగునాడు పార్టీ

ఆ తర్వాత తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న కేఈ కృష్ణమూర్తి, కుందూరు జానారెడ్డి తో కలిసి తెలుగునాడు పార్టీని స్థాపించారుఇక 1988లో ఇక 1999లో మళ్లీ తెలుగుదేశం పార్టీ నుంచి కాకినాడ నుంచి లోక్ సభ కి ఎన్నికయ్యారు ముద్రగడ .అయితే అదే నియోజకవర్గం నుండి 2004లో ఓడిపోవడం గమనార్హం .

అన్నింటికన్నా ముఖ్యంగా కాపు సామాజిక వర్గ హక్కుల కోసం ఆయన చేసిన సుదీర్ఘ పోరాటాలు పాదయాత్రలు దీక్షలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో ఎప్పటికీ నిలిచిపోతాయని చెప్పాలి.ముఖ్యంగా 2016 తుని ఉద్యమం, ఆ తర్వాత ఆయన చేపట్టిన ఆమరణ  నిరాహార దీక్షలు  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  ప్రకంపనలు స్ప్రుష్టించాయనే చెప్పాలి.ఇక మొన్న 2024 ఎలక్షన్స్  ముందర వైసీపీ కండువా వేసుకున్న ముద్రగడ పవన్ కళ్యాణ్ తో చేసిన చాలెంజ్ అప్పట్లో ఒక సంచలనం.

విడిచి వెళ్ళడం నిజంగా బాధాకరం

పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో ఓడిస్తానని ఒకవేళ ఓడించకపోతే ముద్రగడ పద్మనాభరెడ్డిగా తన పేరు మార్చుకుంటానని శపథం చేయడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి నెగ్గడం, తన మాట కట్టుబడి ముద్రగడ పద్మనాభం రెడ్డి గా  మార్చుకోవడం మనకు తెలిసిందే.ఏది ఏమైనా తాను బతికినంత కాలం కాపు సామాజిక అభివృద్ధికై నిరంతరం పాటు పడ్డ ముద్రగడ పద్మనాభం 73 ఏళ్ల వయసులో మనల్ని విడిచి వెళ్ళడం నిజంగా బాధాకరం !

Related News

స్టార్ క్రికెటర్ తో మృణాల్ డేటింగ్.. ఇది నిజమా..? ఫేక్ నా? కన్ఫ్యూజన్లో ఫ్యాన్స్..

భారతదేశంలో మొదటి సినిమా టికెట్ ధర ఎంతో తెలుసా ?

జేబులకి చిల్లు పెడుతున్న నోలన్ ‘ది ఒడిస్సీ’.. రూ. 3,100 కి టికెట్ ఏంది సామీ!

పోసాని తండ్రి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం?

జైలర్ నటికి వేధింపులు.. అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆవేదన!

శేఖర్ Vs జానీ.. రెండు ముక్కలైన డ్యాన్సర్స్ అసోసియేషన్.. రంగంలోకి దిగిన ఫిల్మ్ ఫెడరేషన్!

స్పీడ్ పెంచిన యశ్.. నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఊహించని బజ్..

Big Stories

Advertisement
×