E-Paper
Advertisement

జేబులకి చిల్లు పెడుతున్న నోలన్ ‘ది ఒడిస్సీ’.. రూ. 3,100 కి టికెట్ ఏంది సామీ!

జేబులకి చిల్లు పెడుతున్న నోలన్  ‘ది ఒడిస్సీ’.. రూ. 3,100 కి టికెట్ ఏంది సామీ!
Advertisement

The Odyssey:క్రిస్టోఫర్ నోలన్ .. మూస పద్ధతిలో పరిగెడుతున్న సినిమాని తనదైన స్క్రీన్ ప్లే తో మలుపులు దిప్పిన  క్రియేటివ్ డైరెక్టర్.సినిమా మామూలుగా కాదు మెదడుకు పని చెప్పేలాఉండాలన్నది ఈయన స్టైల్ .మెమెంటో (2000),ది ప్రెస్టీజ్ (2006),ఇన్సెప్షన్ (2010),ఇంటర్‌స్టెల్లార్ (2014),డన్‌కిర్క్ (2017),టెనెట్ (2020) ఇలా ప్రతి సినిమా ఆడియన్స్ కి ఒక మైండ్ బెండింగ్ ఎక్స్పీరియన్స్.ఈ సినిమాలు చాలు ..ఈయన మార్క్ ఏంటో చెప్పడానికి .అలాంటి నోలన్ నుండి మరో సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర ఏ రేంజ్ హడావిడి ఉంటుందో చెప్పక్కర్లేదు.

ఇక గతేడాది నోలన్  దర్శకత్వంలోనే వచ్చిన ఓపెన్ హైమర్ బాక్సాఫీస్ దగ్గర చేసిన రచ్చ అంత ఇంతా కాదు.అలాంటి నోలన్ ‘ది ఒడిస్సీ’అంటూ మరో సినిమాతో జులై 17న పలకరించడానికి రెడీ అయిపోయాడు.మ్యాట్ డామన్, టామ్ హాలండ్ లాంటి హాలీవుడ్ స్టార్స్ ఉన్నారనే క్రేజ్ ఉన్నప్పటికీ నోలన్ సినిమా కాబట్టి థియేటర్లో విజువల్స్ మామూలుగా ఉండవని క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.

Advertisement

ఇదే పాయింట్ ని క్యాష్ చేసుకుంటున్న మల్టీప్లెక్స్

అయితే ఆడియన్స్ లో ఉన్న ఈ క్యూరియాసిటీని థియేటర్ మల్టీప్లెక్స్ ఓనర్స్ కమర్షియల్ గా వాడుకుంటే పనిలో పడ్డారు .ఈ సినిమాని కంప్లీట్ గా ఐమాక్స్ 70mm ఫిలిం కెమెరాతో షూట్ చేశాడట నోలన్.అంటే అసలైన కిక్ రావాలంటే ఐమాక్స్ స్క్రీన్ మీదనే చూడాలన్నమాట.ఇదిగో సరిగ్గా ఇదే పాయింట్ ని క్యాష్ చేసుకుంటున్నారట మల్టీప్లెక్స్ వాళ్ళు .

Advertisement

also read :శేఖర్ Vs జానీ.. రెండు ముక్కలైన డ్యాన్సర్స్ అసోసియేషన్.. రంగంలోకి దిగిన ఫిల్మ్ ఫెడరేషన్!

ముంబైలోని ముంబైలోని పీవీఆర్ ఐకాన్ (లోయర్ పరేల్) మల్టీప్లెక్స్‌లో ఐమాక్స్ రిక్లైనర్ సీట్ ఏకంగా రూ. 3,100 ఫిక్స్ చేశారట.  ఏంటి షాక్ అయ్యారా? ఒక సినిమా టికెట్ ధరతో ఇల్లంతా హ్యాపీగా రేషన్ సామాన్లు కొనుక్కోవచ్చని లెక్కేస్తున్నారా.ఇక ముంబై సంగతి అలా ఉంటే ఢిల్లీలోని ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని పీవీఆర్ ప్రియా, సెలెక్ట్ సిటీ వాక్ లాంటి మల్టీప్లెక్స్ లో కూడా టికెట్లు 2,500రూపాయలు వరకు పలుకుతున్నాయట.

పాప్ కార్న్,కూల్ డ్రింక్స్ కొన్నారంటే ఆలెక్క వేరే

అలా అని మామూలు సీట్లో కూర్చుందాం అనుకున్నా వెయ్యి నుంచి 2000 వరకు ముట్ట చెప్పాల్సిందే.ఇక అదే సినిమా థియేటర్ కి వెళ్లి పాప్ కార్న్,కూల్ డ్రింక్స్ కొన్నారంటే ఆలెక్క వేరే.అయితే ఇంతలా టికెట్ రేట్లు మండిపోతున్నా నోలన్ ఫ్యాన్స్  మాత్రం అస్సలు తగ్గేదేలే అంటూ ఆరేట్లకే టికెట్లను ఎగబడి కొనడం ఇక్కడ గమనార్హం .ఇక ముంబై, ఢిల్లీ తో పోల్చుకుంటే మిగతా నగరాల్లో ఈ రేట్లు కాస్త తక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది.బెంగళూరులోని మల్టీప్లెక్స్ లో ఈ సినిమా టికెట్లు 1200 నుంచి 1950 మధ్యలో ఉంటే కోల్కతాలోరూ. 1,100 నుంచిరూ.1,240 వరకు ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే టికెట్ రేట్ల పై గవర్నమెంట్ కంట్రోల్ ఉండే చెన్నైలో మాత్రం ఐమాక్స్ లో ఎక్కువ లో ఎక్కువగా రూ. 508కే టికెట్  దొరకడం విశేషం.చెన్నై జనాలు తక్కువ రేట్లకే నోలన్ మాస్టర్ పీస్ ని ఎంజాయ్ చేస్తుంటే మిగతా సిటీల వాళ్ళు కుళ్ళుకుంటారు కాబోలు.ఏదేమైనా గ్రీక్ మైథాలజీ స్టోరీ తో వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ కి  ఎక్కడా తగ్గకుండా ఇండియాలో కూడా రికార్డ్  స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టడం పక్కా అని ఇప్పుడే లెక్క లేస్తున్నారు ట్రేడ్ పండితులు .చూడాలి మరి థియేటర్లో ఈ  సినిమా చూశాక నోలన్ చెప్పాలనుకుంది చెప్పింది ఎంతవరకు ఎక్కుతుందో!

Related News

‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

గ్లామర్ డోస్ పెంచేసిన దురంధర్ బ్యూటీ.. ఫ్యాన్స్‌కు కనువిందే!

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

RC 17 షూటింగ్ పై సుకుమార్ బిగ్ అప్డేట్… ప్రయాణం ప్రారంభం!

బ్లూ శారీలో అదరగొట్టిన ప్రీతి ముఖుందన్.. అందం మామూలుగా లేదుగా!

మళ్లీ లాయర్‌గా కీర్తి సురేష్.. ఈసారి అయినా హిట్ కొడుతుందా?

చిరుత హీరోయిన్ అందాల విందు.. ఇన్‌స్టాలో హాట్ టాపిక్!

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

Big Stories

Advertisement
×