E-Paper
Advertisement

జైలర్ నటికి వేధింపులు.. అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆవేదన!

జైలర్ నటికి వేధింపులు.. అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆవేదన!
Advertisement

Jailer 2 Movie:సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకొని సైబర్ దాడులు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన నటీమణులను మొదలుకొని పేరు మోసిన సెలబ్రిటీల వరకు ఎంతో మందిపై ఈ సెలబ్రిటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే . ముఖ్యంగా ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర రీతిలో సృష్టించి.. వాటిని అంతర్జాలంలో వదులుతూ సెలబ్రిటీలకు మానసిక వేదనను కలిగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జైలర్ నటికి కూడా వేధింపులు మొదలయ్యాయి. అసభ్యకరంగా ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంపై నటి ఆవేదన వ్యక్తం చేసింది.

ఆన్లైన్ వేదికగా నటికి వేధింపులు..

ఆమె ఎవరో కాదు ప్రముఖ మలయాళ హీరోయిన్ అన్నా రేష్మ రాజన్. తాజాగా సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న సైబర్ దాడిపై తీవ్రంగా స్పందించింది. తన ప్రమేయం లేకుండానే తన ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వ్యక్తిపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఫైర్ అయ్యింది. ఈ మేరకు అతని ఇంస్టాగ్రామ్ ఖాతా వివరాలను వెల్లడిస్తూ కేరళ పోలీసులు, సైబర్ సెల్ కి ఫిర్యాదు చేసింది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా పంచుకున్న ఈ విషయాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.

Advertisement

ALSO READ:స్పీడ్ పెంచిన యశ్.. నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఊహించని బజ్..

న్యాయం జరిగే వరకూ పోరాడుతాను – జైలర్ నటి

ఈ మేరకు అన్నా రేష్మ రాజన్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పోస్ట్ రూపంలో ఆవేదనను పంచుకుంది. “ఇంతటి నీచమైన చర్య నా ప్రతిష్టకు, వ్యక్తిగత ప్రైవసీకి తీవ్రభంగం కలిగించింది. ఇలాంటి అసభ్యకర కంటెంట్ ని సృష్టించే వారు ఎవరైనా సరే దానిని ఇతరులతో పంచుకునే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ ఇంస్టాగ్రామ్ ఖాతాపై అధికారికంగా ఫిర్యాదు చేశాను. ముఖ్యంగా నాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపను. చట్టపరంగా ముందడుగు వేస్తాను. ఈ దుర్మార్గపు పనికి పాల్పడిన వారు, అలాగే దీనిని ప్రోత్సహించిన వారు ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సిందే.”. అంటూ అన్నా రాజన్ తన ఇన్స్టా ఖాతాలో చెప్పుకొచ్చింది. ఇకపోతే ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవడం ఈమెకు తొలిసారి కాదు.. గతంలో కూడా ఈమె ధరించిన దుస్తులను లక్ష్యంగా చేసుకొని నెటిజన్స్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బాడీ షేమింగ్ , అసభ్యకర వ్యాఖ్యలకు గురైన ఈమె అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది. ఇప్పుడు కూడా ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది.

అన్నా రాజన్ కెరియర్..

Advertisement

ఈమె కెరియర్ విషయానికే వస్తే.. అంగమాలి డైరీస్ అనే చిత్రం ద్వారా 2017 లో వెండితెరకు పరిచయమైన ఈమె.. ఈ చిత్రంలో పోషించిన లిచ్చి పాత్రతో మంచి పేరు దక్కించుకుంది. పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ప్రస్తుతము సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన జైలర్ 2 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ద్వారా ఈమె కోలీవుడ్ రంగ ప్రవేశం చేస్తోంది. కోలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న ఈ ముద్దుగుమ్మకి ఎలాంటి గుర్తింపు లభిస్తుందో చూడాలి.

https://www.instagram.com/annaspeeks/p/DaxCMSWtHCo/?hl=en

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×