E-Paper
Advertisement

భారతదేశంలో మొదటి సినిమా టికెట్ ధర ఎంతో తెలుసా ?

భారతదేశంలో మొదటి సినిమా టికెట్ ధర ఎంతో తెలుసా ?
Advertisement

Movie Ticket:ఈ రోజుల్లో సినిమా థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలి అంటే మినిమం 2000 నుంచి 3000 సమర్పించుకోవాల్సిందే.ఇక నార్మల్ గా అయితే 200 నుంచి 500 వరకు ఉండటం కామన్.ఇక పెద్ద హీరోల సినిమాలు, వీకెండ్స్ అయితే ఆ లెక్క వేరు. కానీ మన దేశంలో మొదటిసారిగా సినిమా చూసిన ప్రేక్షకులు ఆ టికెట్ కి ఎంత చెల్లించారో తెలుసా? వింటే షాక్ అవుతారు .అవును మరి అప్పట్లో సినిమా టికెట్ ధర ఒక అణా మాత్రమే .ఇప్పుడంటే మనం రూపాయల్లో, పైసల్లో మాట్లాడుకుంటున్నాం కానీ, ఒకప్పుడు మన కరెన్సీ అంతా అణా లోనే సాగేది .

ఒక రూపాయికి 16 అణాలు .అంటే ఇప్పటి లెక్కల్లో ఒక అణా విలువ సుమారు 6 పైసలు అన్నమాట .ఇక 1900లలో స్టార్టింగ్ లో ఇండియాలో సినిమాలు మొదలైనప్పుడు జనాలకి అది పెద్ద వింతలా కనిపించింది.ఎంతలా అంటే తెరపై బొమ్మలు కనిపించడం చూసి పిచ్చెక్కిపోయేంత.ఇక 1896లో ఫ్రాన్స్‌కు చెందిన లూమియర్ బ్రదర్స్ అప్పటి బొంబాయి లోని వాట్సన్ హోటల్‌లో ఫస్ట్ టైమ్  సినిమాని స్క్రీనింగ్ చేశారు .

Advertisement

ఇండియాలో జరిగిన మొట్టమొదటి పబ్లిక్ ఫిల్మ్ షో

ఒక ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో జరిగిన మొట్టమొదటి పబ్లిక్ ఫిల్మ్ షో అదే.ఇక దానికి లూమియర్ బ్రదర్స్ ఛార్జ్  కాస్త ఎక్కువే చేశారు.కానీ మెల్లిగా సినిమా జనాల్లోకి వెళ్తుండేసరికి రేట్లు కాస్త అందుబాటులోకి తెచ్చారు.అందుకే ఒక అణా, రెండు అణాలు నాలుగు అణాలకి టికెట్లు అమ్మేవారట.ఇక ఆ తర్వాత 1913లో దాదాసాహెబ్ ఫాల్కే తీసిన రాజా హరిచంద్ర సినిమాతో ఇండియన్ సినిమాకి గట్టి పునాది పడింది.ఇప్పుడంటే ఏసీలు ,సోఫాలు, వెనక్కి వాలే రిక్లైనర్ సీట్లు, డాల్బీ సౌండ్ సిస్టం ఇలా హంగులు ఉన్నాయి.కానీ ఆ రోజుల్లో ఇవి ఏమీ లేవు ఎక్కడ  ఖాళీ ప్లేస్ దొరికితే అక్కడ షెడ్లు వేసి  డేరా థియేటర్లు నడిపేవారు.ఆ తర్వాత మెల్లిగా నార్మల్ సినిమా హాళ్ళు  వచ్చాయి.

Advertisement

also read :జేబులకి చిల్లు పెడుతున్న నోలన్ ‘ది ఒడిస్సీ’.. రూ. 3,100 కి టికెట్ ఏంది సామీ!

అలా కూర్చునే ప్లేస్ కి బట్టి టికెట్ రేట్లు ఉండేవి.స్క్రీన్ కి దగ్గరగా కింద కూర్చునే వాళ్ళకి తక్కువ టికెట్ ధర ఉంటే వెనుక కూర్చునే వాళ్ళకి కాస్త ఎక్కువ ఉండేది.ఆ రోజుల్లో ఒక రూపాయి విలువ చాలా ఎక్కువగా కాబట్టి ఉన్న కొంచెం డబ్బుతోనే ఒక ఫ్యామిలీ నెలంతా గడిపేది.అలాంటి టైం లో ఒక అణా టికెట్ పెట్టడం వల్లే కూలీలు రైతులు, చిన్న ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇలా ప్రతి ఒక్కరు సినిమాని చూసేవారు.

కట్ చేసే సీన్ టోటల్ రివర్స్

అదే మన సినిమా వేగంగా దూసుకెళ్ళడానికి మెయిన్ రీజన్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా టికెట్ జర్నీ కూడా బలే ఇంట్రెస్టింగ్ గా సాగిందండోయ్. ఒక అణా తో మొదలైన ప్రయాణం  ఆ తర్వాత రెండు అణాలకి,ఆ ఆతర్వాత 4అణాలని  దాటుకుంటూ రూపాయల్లోకి వచ్చింది.ఇక 1960లో కొన్ని థియేటర్లలో రేట్లు ఒకటి నుంచి మూడు రూపాయల మధ్య ఉండేది.మధ్య ఉండేదట ఇంకా 1970,80లలో బాల్కనీ టికెట్ 5 నుంచి 10 ఉంటేనే అది చాలా కాస్ట్లీ అనేవారట.ఇక 1990 లలో 20 ,30రూపాయలకి చేరినపుడు కూడా మరి ఇంత రేటా అనుకునే వాళ్లట జనాలు.

అలాంటిది కట్ చేసే.. సీన్ టోటల్ రివర్స్ అయిపోయింది .మల్టీప్లెక్స్‌లు, లగ్జరీ సీట్లు, ఆన్‌లైన్ బుకింగ్ ఛార్జీలు, పాప్‌కార్న్ రేట్లు ఒక్కటేంటి ఇవన్నీ టికెట్ రేట్లని ఆకాశంలో పెట్టేశాయి .అలా ఒక్క అణాతో మొదలైన  ఇండియన్ సినిమా ఇవాళ వందలు వేల కోట్లకి  ఎదగడం చూస్తుంటే నిజంగా గ్రేట్ అనిపిస్తుంది.

Related News

జేబులకి చిల్లు పెడుతున్న నోలన్ ‘ది ఒడిస్సీ’.. రూ. 3,100 కి టికెట్ ఏంది సామీ!

పోసాని తండ్రి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం?

జైలర్ నటికి వేధింపులు.. అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆవేదన!

శేఖర్ Vs జానీ.. రెండు ముక్కలైన డ్యాన్సర్స్ అసోసియేషన్.. రంగంలోకి దిగిన ఫిల్మ్ ఫెడరేషన్!

స్పీడ్ పెంచిన యశ్.. నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఊహించని బజ్..

స్పీడ్ పెంచుతున్న సుక్కు ..వచ్చే ఏడు దసరా బరిలో దిగనున్న చరణ్ ?

నాని ‘ది ప్యారడైజ్’ మళ్లీ వాయిదా పడిందా?

Big Stories

Advertisement
×