E-Paper
Advertisement

తెరవెనుక హాలీవుడ్: మనకు తెలియని చిత్ర విచిత్రాలు!

తెరవెనుక హాలీవుడ్: మనకు తెలియని  చిత్ర విచిత్రాలు!
Advertisement

Hollywood Facts:సినిమా మొదటగా పుట్టింది హాలీవుడ్ లోనే .అలాంటి హాలీవుడ్ లో ఎన్నో విశేషాలు ,మరెన్నో సంచలనాలు,మరి మనకు తెలియని కొన్ని సరికొత్త సంగతులేంటో ఒకసారి చూసేద్దాం.

కొందరు హాలీవుడ్ నటులు తమ తెలివితేటలతో చరిత్రనే మార్చేసిన సందర్భాలు మీకు తెలుసా ..మామూలుగా సినిమాల్లో ఏం చేస్తారు పారితోషికాలు తీసుకొని నటిస్తారు.కానీ 1989 లో వచ్చిన “బ్యాట్‌మ్యాన్” సినిమాలో జోకర్ పాత్ర వేసిన జాక్సన్ ఏం చేశాడో తెలుసా..పారితోషికం తగ్గించుకొని సినిమా లాభాల్లో మరియు ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ మెర్చండైజ్ అమ్మకాల్లో షేర్ తీసుకున్నాడు  (అంటే బొమ్మలు టీషర్ట్స్  వచ్చిన అమ్మకాల్లో వాటా అన్నమాట)ఈ ఒక్క తెలివైన  నిర్ణయం అతనికి ఎంత లాభం తెచ్చిపెట్టిందో  తెలుసా ..అక్షరాలా 90 మిలియన్ డాలర్లు.

Advertisement

ఇక కొన్ని సినిమాలకి కొంతమంది పర్ఫెక్ట్ యాక్టర్స్ మాత్రమే సరిపోతారని వాళ్ళ కోసం కొన్ని రోజులు వెయిట్ చేయడం సహజం .కానీ మేరీ పాపిన్స్ అనే సినిమా కి జూలీ ఆండ్రూస్ కోసం వాల్ట్ డిస్నీ ఎంతలా వెయిట్ చేశారో తెలుసా.. ఆమె గర్భవతి అని తెలిసి కూడా ఆమె డెలివరీ అయ్యే వరకు షూటింగ్ ని వాయిదా వేశారట.మామూలుగా రెండు లేదా మూడు నెలలు వెయిట్ చేస్తారేమో కానీ ఇలా ఏకంగా ప్రెగ్నెంట్ అయి డెలివరీ అయ్యే వరకు ఒక నటి కోసం అంతలా వెయిట్ చేశారంటే ఆమె మీద వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ అనేది తెలుస్తుంది.ఇక దాన్ని ప్రూవ్ చేసుకుంటూ ఆమె చేసిన ఆ పాత్రకి ఆస్కార్ దక్కించుకుంది కూడా.

ఇక ఘోస్ట్ సినిమాలో హూపీ గోల్డ్ బెర్గ్  పర్సనాలిటీ సినిమాకి సెట్ అవ్వదు అంటూ మేకర్స్ ఆమెని పక్కన పెట్టారు.కానీ ఆ సినిమాకి ఆమెనే పర్ఫెక్ట్ అంటూ హీరో పాట్రిక్ స్వైజీ పట్టుబట్టి ఆమెకు ఆ రోల్ ఇప్పించాడు .ఫలితంగా ఆమె ఆస్కార్ అందుకొని తనే ఆ రోల్ కి తనే  పర్ఫెక్ట్ అని నిరూపించుకుంది .

Advertisement

ఇక బెట్ డేవిస్‌ ఇండస్ట్రీలో ఎలా నిలదొక్కుకున్నాడో తెలుసా ..సూపర్ హిట్ అయిన ఆల్ అబౌట్ ఈవ్ అనే సినిమాలో మొదటగా నటించాల్సింది క్లాడెట్ కోల్బర్ట్ వెన్నుపూస గాయం వల్ల ల్ల తప్పుకోవడంతో  ఆ అవకాశం పెట్టింది వెతుక్కుంటూ బెట్ డేవిస్‌ ని చేరింది.అలా హాలీవుడ్ లో ఆయన కెరీర్ నిలబడింది .

ఇక మీకు అందరికీ తెలుసా.. చిన్న పిల్లల ఫేవరెట్ “బగ్స్ బన్నీ”  క్యారెక్టర్ ఎలా పుట్టిందో …“ఇట్ హ్యాపెండ్ వన్ నైట్”అంటూ 1934లో ఒక సినిమా వచ్చింది .ఆ సినిమాలోని నటుడు క్లార్క్ గేబుల్  క్యారెట్ తింటూ మాట్లాడే ఒక స్టైల్ నచ్చి యానిమేటర్లు దాన్ని ‘బగ్స్ బన్నీ’కి పెట్టారట ఇక దీనివల్లే కుందేళ్ళకి క్యారెట్ అంటే ఇష్టమనే  అపోహ తెగ స్ప్రెడ్ అయిపోయింది.

ఇక  స్టీవెన్ స్పీల్‌బర్గ్ తీసిన “ఈ.టి. (E.T.)”అనే సినిమా ఇప్పుడంటే ఎమోషనల్ ఫ్రెండ్షిప్ స్టోరీ గా ఉంది.కానీ ఇది మొదటగా అనుకున్నప్పుడు ఒక భయంకరమైన ఏలియన్ హర్రర్ కథ అనుకున్నారట స్టీవెన్ స్పిల్బర్.

ఇక మామూలుగా మనం సినిమాల్లో కాపీ కొట్టడం చూస్తూనే ఉంటాం కానీ ఎయిర్‌ప్లేన్ అనే కామెడీ సినిమా ని తెరకెక్కించడానికి మేకర్స్ ఏం చేస్తారో తెలుసా..1957 లో వచ్చిన జీరో అవర్ అనే సిరీస్ డ్రామాని  ఎంతలా  కాపీ కొట్టారంటే మళ్ళీ లీగల్ ఇష్యూస్ ఏం రాకుండా ఏకంగా ఆ సినిమా రైట్స్ ని అఫీషియల్ గా తక్కువ రేట్ కి కొనేసి మరి పేరడీగా రీమేక్  చేశారట.

మామూలుగా సినిమాల్లో పాటలు కామన్.అవి చూపే ఇంపాక్ట్ కూడా చాలా ఉంటుంది.కానీ ‘ది విజార్డ్ ఆఫ్ ఓజ్’ నుండి “సమ్‌వేర్ ఓవర్ ది రెయిన్‌బో”అనే పాటని మేకర్స్ తీసేయాలనుకున్నరట. కారణం అది సినిమా స్పీడ్ ని తగ్గిస్తుందని.కానీ ఆ పాట బయటకు వచ్చాక ఎంత వైరల్ అయిందో చెప్పక్కర్లేదు.ఇక టైటానిక్ చివరలో వచ్చిన ‘మై హార్ట్ విల్ గో ఆన్’అనే  పాప్ సాంగ్ పెట్టడం అసలు జేమ్స్ కామెరూన్ కి  ఇష్టమే లేదట ,పైగా గాయని సెలిన్ డియోన్‌ కి కూడా ఇష్టం లేదు .కానీ మ్యూజిక్ డైరెక్టర్పట్టుబట్టి మరి దాన్ని రికార్డ్ చేయించి ఒప్పించాడు.కట్ చేస్తే ఆ సాంగ్ ఎంత వైరల్ అయిందో చెప్పక్కర్లేదు .

ఇక పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సినిమా జానీ డెప్ చేసిన వెరైటీ యాక్టింగ్ వల్ల అట్టర్ ప్లాఫ్ అవుతుంది అని అనుకున్నారట డిస్నీ మేకర్స్.కానీ అది ఏ రకమైన హిస్టరీ క్రియేట్ చేసిందో దాని కలెక్షన్లే చెప్పాయి .ఇక షూటింగ్ విషయానికి వస్తే ది బ్రేక్‌ఫాస్ట్ క్లబ్” అనే సినిమాని ఒక పాతబడిన మూసివేసిన హైస్కూల్ జిమ్నాజియంలో  సెట్ వేసి తీశారట.ఇక అక్కడ విపరీతమైన వేడి వల్ల నటులు పడుకుండి పోతుంటే ఏకంగా వారిని నిద్ర లేపడానికి ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లని పెట్టవలసి వచ్చిందట .

ఇక ‘ఇట్స్ ఎ వండర్‌ఫుల్ లైఫ్’1946లో వచ్చిన ఈ సినిమా థియేటర్లో అట్టర్ ప్లాప్ అయ్యింది. అయితే ఆ సినిమా 1974 కి వచ్చేసరికి కాపీ రైట్ టైం ముగిసిపోవడంతో టీవీ ఛానల్ అన్ని ఆ సినిమాని ఫ్రీగా క్రిస్మస్ టైం లో ప్లే చేసి ఏకంగా దాని యొక్క ఎంటర్టైనింగ్ క్లాసిక్ గా మార్చేశాయి .

ఇక భారీ బడ్జెట్ వల్ల ఏకంగా 260 ఎకరాల స్టూడియో స్థలాన్ని 20th సెంచరీ ఫాక్స్ సంస్థ అమ్మేసుకుందన్న సంగతి మీకు తెలుసా ….అవును “క్లియోపాత్రా” (1963) సినిమా బడ్జెట్ ఊహించని కారణాల వల్ల ఎంతగా పెరిగిపోవడం వల్ల  20th సెంచరీ ఫాక్స్ సంస్థ దివాలా తీయకుండా ఉండటానికి తమకున్న 260 ఎకరాల స్టూడియో స్థలాన్ని అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఆ స్థలంలోనే నేడు లాస్ ఏంజిల్స్‌లోని ప్రసిద్ధ ‘సెంచరీ సిటీ’ వెలవడం విశేషం .ఇక

అదే స్టూడియో తర్వాత “హోమ్ అలోన్” బడ్జెట్ $14 మిలియన్లకు పెరగడంతో వార్నర్ బ్రదర్స్ వదిలేసిన ప్రాజెక్ట్‌ను రిస్క్ తీసుకుని నిర్మించి, ఊహించని భారీ లాభాలను అందుకుంది.

ఇవీ హాలీవుడ్ సినీ చరిత్రలో మనకు తెలియని కొన్ని విశేషాలు.

Related News

ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో అంచనాలు పెంచేసిన ‘ఆపరేషన్ అరుణారెడ్డి’

ఆమిర్ ఖాన్ రెండో వెడ్డింగ్‌పై రూ.5 కోట్ల సుపారీ.. బాలీవుడ్‌లో ముసలం పుట్టించిన అంతర్మత వివాహం!

స్టార్ క్రికెటర్ తో మృణాల్ డేటింగ్.. ఇది నిజమా..? ఫేక్ నా? కన్ఫ్యూజన్లో ఫ్యాన్స్..

ముద్రగడ పద్మనాభం కన్నుమూత.. ఒక పోరాట శకం ముగిసిందంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!

భారతదేశంలో మొదటి సినిమా టికెట్ ధర ఎంతో తెలుసా ?

జేబులకి చిల్లు పెడుతున్న నోలన్ ‘ది ఒడిస్సీ’.. రూ. 3,100 కి టికెట్ ఏంది సామీ!

పోసాని తండ్రి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం?

Big Stories

Advertisement
×