E-Paper
Advertisement

బట్టలు త్వరగా ఆరి పోవాలా? ఈ ఇన్-బిల్ట్ హీటర్ వాషింగ్ మెషీన్స్ పై ఓ లుక్కేయండి

బట్టలు త్వరగా ఆరి పోవాలా? ఈ ఇన్-బిల్ట్ హీటర్ వాషింగ్ మెషీన్స్ పై ఓ లుక్కేయండి
Advertisement

Best washing machine: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఇళ్లలో ఇల్లాళ్లకు పెద్ద పరీక్షే మొదలవుతుంది. ఆకాశం మబ్బుపట్టి, ఒకటే పనిగా వర్షం పడుతుంటే ఉతికిన బట్టలు ఆరక చస్తూ ఉంటాయి. రెండు మూడు రోజులు ఆరకపోయేసరికి బట్టల నుంచి ఒక రకమైన కుళ్లిన వాసన, తేమ వల్ల బూజు వచ్చేస్తాయి. అయితే..ఈ తలనొప్పికి లేటెస్ట్ టెక్నాలజీతో ఫుల్ స్టాప్ పెట్టేయవచ్చు. ఇన్-బిల్ట్ హీటర్స్ తో వచ్చే స్మార్ట్ వాషింగ్ మెషీన్స్ ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ అవుతున్నాయి. ఇవి బట్టలను కేవలం ఉతకడమే కాదు.. వేడి నీటితో మురికిని వదిలించి, 99.9% బ్యాక్టీరియాను చంపేసి, బట్టలను వెచ్చగా, పొడిగా బయటకు తీస్తాయి. ఈ సీజన్‌లో మీ లాండ్రీ కష్టాలను తీర్చే టాప్ 5 వాషింగ్ మెషీన్స్ డీటెయిల్స్ వివరాలు మీ కోసం.

ఇన్-బిల్ట్ హీటర్ ఉన్న టాప్ 5 వాషింగ్ మెషీన్స్:

మీరు వర్షాలు పడుతున్నప్పుడు కూడా బట్టలు వేడి వేడిగా.. ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా.. మంచి సువాసనతో.. బయటకు రావాలనుకుంటే.. ఈ కింద పేర్కొన్న వాషింగ్ మెషీన్స్ బెస్ట్ ఆప్షన్స్ అవుతాయి.

1. LG 8 Kg 5 Star AI Direct Drive:

Advertisement

ఎల్‌జీ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ లేటెస్ట్ మోడల్ సూపర్ హిట్ అయింది. దీనిలోని.. ఇన్-బిల్ట్ హీటర్ సహాయంతో నీటిని 60 డిగ్రీల వరకు వేడి చేయవచ్చు. దీని వల్ల బట్టలపై ఉండే మొండి మరకలు ఈజీగా వదిలిపోతాయి. ‘అలర్జీ కేర్’ ఫీచర్ ఉండటం వల్ల పిల్లల బట్టలలోని మైక్రో-ఆర్గానిజమ్స్ అన్నీ నశిస్తాయి. ఏఐ టెక్నాలజీ వల్ల బట్టల ఫ్యాబ్రిక్‌ను బట్టి డ్రమ్ రొటేషన్స్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతాయి. బట్టలు కూడా చాలా త్వరగా డ్రై అవుతాయి.

2. Samsung 9 Kg Wi-Fi EcoBubble:

ఇది పెద్ద ఫ్యామిలీస్ కి పర్ఫెక్ట్ ఛాయిస్. శాంసంగ్ లేటెస్ట్ AI EcoBubble టెక్నాలజీతో డిటర్జెంట్‌ను బబుల్స్‌గా.. మార్చి బట్టల్లోకి పంపిస్తుంది. దీని వల్ల తక్కువ టైంలోనే నీట్ గా క్లీన్ అవుతాయి. దీనిలోని పవర్‌ఫుల్ స్టీమ్ సైకిల్ హీటర్ ద్వారా.. బట్టలను వేడి గాలితో క్లీన్ చేస్తుంది. ఫలితంగా బట్టలు ఉతికిన తర్వాత తడి లేకుండా.. వెచ్చగా వస్తాయి. వైఫై కనెక్టివిటీ ద్వారా ఫోన్ లోనే కంట్రోల్ చేయొచ్చు.

3.IFB DeepClean 8 Kg 5 Star:

Advertisement

చాలా మంది ఫ్రంట్ లోడ్ కంటే టాప్ లోడ్ ఇష్టపడతారు. అలాంటి వారికోసం ఐఎఫ్‌బీ టాప్ లోడ్‌లోనే ఇన్-బిల్ట్ హీటర్ అండ్ పవర్ స్టీమ్ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ మెషిన్ నీటిని బాగా వేడి చేసి బట్టలను ఉతకడం వల్ల జిడ్డు మరకలు క్షణాల్లో మాయమవుతాయి. వర్షా కాలంలో బట్టలు ఆరకపోయినా దీనిలోని.. హాట్ రిన్స్ ఆప్షన్ వల్ల బట్టలు త్వరగా ఆరిపోవడానికి హెల్ప్ అవుతుంది.

4. Bosch 8 Kg Fully Automatic Front Load:

జర్మన్ టెక్నాలజీతో.. వచ్చే బాష్ వాషింగ్ మెషీన్స్ బిల్డ్ క్వాలిటీకి కేరాఫ్ అడ్రస్. దీనిలోని ఇన్-బిల్ట్ హీటర్ చాలా సైలెంట్‌గా, ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. బట్టల రంగులు పోకుండా.. ఫ్యాబ్రిక్ డ్యామేజ్ కాకుండా.. వేడి నీటితో క్లీన్ చేయడంలో ఇది దిట్ట. వర్షాకాలం, చలి కాలంలో బట్టలు త్వరగా డ్రై అవ్వడానికి దీని హై-స్పిన్ RPM బాగా ఉపయోగ పడుతుంది.

5. Haier 8 Kg Fully Automatic Top Load:

మీ బడ్జెట్ కొంచెం తక్కువగా ఉండి, హీటర్ ఫీచర్ కావాలనుకుంటే.. హయర్ బెస్ట్ ఛాయిస్. దీనిలో ప్రత్యేకమైన ‘ఇన్-బిల్ట్ బటర్‌ఫ్లై హీటర్’ ఉంటుంది. ఇది తక్కువ కరెంట్ వినియోగించుకుంటూనే.. నీటిని వేడి చేస్తుంది. ఓషియానస్ వేవ్ డ్రమ్ డిజైన్ వల్ల బట్టలు నలిగిపోకుండా సేఫ్‌గా క్లీన్ అవుతాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే మెషీన్ ఇది.

వర్షాకాలంలో బట్టలు ఉతికేటప్పుడు.. ఇన్-బిల్ట్ హీటర్ లో ‘హాట్ వాష్’ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే.. బట్టలు మురికి వదలడమే కాకుండా, మెషిన్ నుంచి బయటకు తీసిన కొద్దిసేపటికే ఫ్యాన్ గాలికి కూడా ఈజీగా ఆరిపోతాయి.

Tags

Related News

రూ.1037కే మిక్సీ గ్రైండరా? ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ కావద్దు!

క్షణాల్లోనే ఈజీగా కేకులు,పిజ్జాలు రెడీ.. పిజియన్ ఓటీజీ స్పెషల్స్ ఇవే!

రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!

స్టైలిష్ లుక్,బిగ్ బ్యాటరీతో ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్ విడుదల!

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

పొరపాటున ఫోటోలు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి!

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

Big Stories

Advertisement
×