Mrunal Thakur : ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న చాలామంది ముద్దుగుమ్మలపై లవ్ ఎఫైర్స్ అని వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.. సోషల్ మీడియాలో ఎవరినైనా ఫాలో చేసిన లేదా అన్ ఫాలో చేసిన కూడా వాళ్ల గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తాయి.. ఇటీవల కాలంలో హీరోయిన్ల గురించి ఇలాంటి వార్తలు రోజుకొకటి బయటకు వస్తూనే ఉంది.. తాజాగా ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇండియన్ స్టార్ క్రికెటర్ తో డేటింగ్ లో ఉందంటూ వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. నిజానికి వీరిద్దరూ ఫాలో అయినట్లు క్లారిటీ లేదు కానీ.. అప్పుడే డేటింగ్ అంటూ కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి.. ఈ వార్తల పై వీరిద్దరూ ఎక్కడ స్పందించలేదు.. అయితే ఈ వార్తలు నిజమేనా? లేక ఫేక్ న్యూస్ నా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
సినిమా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిందని గతంలో అనేకసార్లు వార్తలు వినిపించాయి. ఆమె తమిళ స్టార్ హీరో ధనుష్ తో ప్రేమాయణం నడిపిస్తుంది అంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు సోషల్ మీడియాలో ఊపొందుకున్నాయి. ఇప్పుడు మరోసారి స్టార్ క్రికెటర్ తో డేటింగ్ లో ఉంది అంటూ మరోసారి ఆమె గురించి వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆ వార్తలు వినిపించడానికి కారణం రీసెంట్గా ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఇండియన్ స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ను ఫాలో చేసిందట. ఇక అతను కూడా తిరిగి ఫాలో చేశాడట. నిజానికి ఇది ఫేక్ న్యూస్.. వీరిద్దరూ ఎక్కడా ఫాలో అయిన దాఖలాలు కనిపించలేదు.. ఇక పోతే ఈమధ్య క్రికెటర్లతో హీరోయిన్ల ఎఫైర్లు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈమె చేసిన చిన్న తప్పు రూమర్స్ కు క్లారిటీ ఇవ్వకపోవడమే.. మరి ఇప్పటికైన ఈమె క్లారిటీ ఇస్తే బాగుండు అని ఫ్యాన్స్ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు.
ఇండియన్ స్టార్ క్రికెటర్ అయిన రిషబ్ పంత్ గురించి గతంలో అనేక సార్లు వార్తలు వినిపించాయి. నటి ఊర్వశి రౌతేలాతో ఆయన పేరు తరచూ ముడిపడేది.. ఆ వార్తలపై నటి ఊర్వశి రౌతేలా తీవ్రంగా ఖండించింది.. తమ మధ్య ఎలాంటి ప్రేమ సంబంధం లేదని వెల్లడించారు. ఆ తర్వాత ఆ వదంతులకు ముగింపు పలికినట్లే.. అలాగే మృణాల్, ధనుష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అలాంటి వార్తలపై మృణాల్ నవ్వుతూ స్పందించగా, ధనుష్ కూడా ఎప్పుడూ వాటిని ధృవీకరించలేదు.. ఇప్పుడు రిషబ్ పంత్ తో కూడా అలాంటి వార్తలే వస్తున్నాయి.. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ సోషల్ మీడియాలో ఫాలో అయినట్లు టాక్ నడుస్తుంది. అంతేకాదు.. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో మాత్రం హాట్ టాపిక్ అవుతుంది.. హీరోయిన్లకు ఇలాంటి వార్తలు కామన్.. మరి దీనిపై అయినా ఈ అమ్మడు స్పందిస్తుందేమో చూడాలి.. ఇక మృణాల్ ఠాకూర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె భారీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉంది..
Also Read :నటి వందన ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఇదేనా..?