E-Paper
Advertisement

స్పీడ్ పెంచిన యశ్.. నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఊహించని బజ్..

స్పీడ్ పెంచిన యశ్.. నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఊహించని బజ్..
Advertisement

Yash:కన్నడ స్టార్ హీరో యశ్ ఆచితూచి అడుగులు వేస్తూ.. పాన్ ఇండియా హీరోగా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఈయన కే జి ఎఫ్ 1&2 చిత్రాలతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కన్నడలో స్థానికంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన కే జి ఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించారు. తన అద్భుతమైన నటన పర్ఫామెన్స్ తో యావత్ దేశ అభిమానులను తన వైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం టాక్సిక్ – ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ చిత్రంలో నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార వీడియోలు, పాటలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందులో ఏకంగా 5 మంది హీరోయిన్లు నటించగా.. అటు ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్ లో తమ నటనను కనబరచడం సినిమాకు మరింత ప్లస్ గా మారింది.

యశ్ నెక్స్ట్ ప్రాజెక్టుపై అదిరిపోయే న్యూస్..

ఇదంతా బాగానే ఉన్నా.. ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ , సాంగ్స్, గ్లింప్స్ పై ప్రశంసల కంటే కూడా విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరీ బోల్డ్ గా ఈ సినిమాలో సన్నివేశాలు చిత్రీకరించారు అంటూ ఒక వర్గం ఆడియన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక అలాంటి ఈ సినిమా ఇప్పుడు పలుమార్లు వాయిదా పడుతూ.. ఎట్టకేలకు ఆగస్టు 26న లాక్ చేసుకుంది. ఇక ఈ పాన్ ఇండియా సినిమా.. ఇండియన్ భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా ఆగస్టు 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు? ఆ చిత్ర దర్శకుడు ఎవరు ? ఎలాంటి స్టోరీ తో ఆయన మళ్లీ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయబోతున్నారు? అనే విషయం అటు అభిమానులలో ఇటు నెటిజన్స్ లో తెగ ఆసక్తి రేకెత్తిస్తోంది.

Advertisement

ALSO READ:నాని ‘ది ప్యారడైజ్’ మళ్లీ వాయిదా పడిందా?

ఆ హిట్ డైరెక్టర్ దర్శకత్వంలో..

ఈ మేరకు తాజాగా నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అప్పుడే ఒక చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తన తదుపరి ప్రాజెక్టును ఏ దర్శకుడి డైరెక్షన్లో చేయబోతున్నారు అంటూ శాండిల్ వుడ్ లో చర్చించుకుంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. యశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ‘సప్తసాగర దాచే ఎల్లో’ మూవీతో దర్శకుడిగా హిట్టు కొట్టిన డైరెక్టర్ హేమంత్ ఎం రావు తో జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీని ఓ ఆర్మీ జవాన్ పోలీసుగా మారిన కథాంశంగా తెరకెక్కించనున్నారని సమాచారం. ఇక మొత్తానికి అయితే యశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై వచ్చిన ఈ బజ్ సోషల్ మీడియాలో మరిన్ని అంచనాలను పెంచుతోంది.

సత్తా చాటుతున్న యశ్..

Advertisement

ఇకపోతే తాజాగా యశ్ కి సంబంధించిన మరో విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హేమంత్ ఎం రావుతో చేయబోయే ప్రాజెక్టు కోసం హీరోగా నటించడమే కాకుండా రచయితగా కూడా పనిచేయబోతున్నారట. ఇక కరణ్ జోహార్, హిరూ జోహార్, అపూర్వ మెహతలు ఈ సినిమాలో నిర్మించనున్నారని ఒక వార్త వినిపిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం హేమంత్ ఎం రావు 666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బిజీగా ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో వస్తున్న ఈ వార్తపై డైరెక్టర్ స్పందిస్తారేమో చూడాలి.

Related News

పోసాని తండ్రి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం?

జైలర్ నటికి వేధింపులు.. అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆవేదన!

శేఖర్ Vs జానీ.. రెండు ముక్కలైన డ్యాన్సర్స్ అసోసియేషన్.. రంగంలోకి దిగిన ఫిల్మ్ ఫెడరేషన్!

స్పీడ్ పెంచుతున్న సుక్కు ..వచ్చే ఏడు దసరా బరిలో దిగనున్న చరణ్ ?

నాని ‘ది ప్యారడైజ్’ మళ్లీ వాయిదా పడిందా?

ముదురుతోన్న ‘స్పిరిట్’ టైటిల్ వివాదం… ఆపేస్తామంటూ ఓపెన్ వార్నింగ్!

కాబోయే భర్త కోసం ప్రీతి ముకుందన్ కలలు.. ఆ ఒక్క క్వాలిటీ చాలంటూ!

Big Stories

Advertisement
×