BigTV English

Kannappa Movie : తమిళనాట కన్నప్పకు ఘోర అవమానం… విష్ణు ఇది చూస్తే తట్టుకోగలడా ?

Kannappa Movie : తమిళనాట కన్నప్పకు ఘోర అవమానం… విష్ణు ఇది చూస్తే తట్టుకోగలడా ?

Kannappa Movie: మంచు విష్ణు (Manchu Vishnu)చాలా రోజుల తర్వాత కన్నప్ప (Kannappa) అనే ఒక మైథాలజీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే మొదటి రోజు ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ తదుపరి కలెక్షన్లపై భారీగా దెబ్బ పడిందని తెలుస్తుంది. ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే మూడు రోజుల వ్యవధిలోనే అన్ని ప్రాంతాలలో కలెక్షన్లు పూర్తిగా పడిపోయాయని తెలుస్తోంది. ఇక తమిళనాడులో అయితే విష్ణు కన్నప్ప సినిమాకు ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి.


తమిళనాడులో షో క్యాన్సిల్..

మంచు విష్ణు కన్నప్ప సినిమాని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకులకు ముందుకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు. కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్(Sarath Kumar) కూడా ఈ సినిమాలో భాగమైన విషయం తెలిసిందే. అయితే కన్నప్ప సినిమాకు మాత్రం తమిళనాడులో ఊహించని షాక్ తగిలింది. థియేటర్లలో ఆడియన్స్ లేకపోవడంతో కొన్నిచోట్ల ఈ షోస్ క్యాన్సిల్ చేశారని తెలుస్తోంది. ఇలా మొదటి మూడు రోజుల్లోనే జనాలు లేక షో క్యాన్సిల్ చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.


ప్రభాస్ వల్లే ఓపెనింగ్స్..

చెన్నైలో మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాలలో కూడా కొన్ని ప్రాంతాలలో ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తుంది. మొదటి రెండు రోజుల కూడా ప్రేక్షకులు ఈ సినిమా కోసం థియేటర్లకు క్యూ కట్టారు అంటే అది కేవలం ప్రభాస్(Prabhas) కోసమేనని స్పష్టమవుతుంది. ఇక ఈ విషయం గురించి కూడా మంచు విష్ణు చాలా ఓపెన్ అయ్యారు. నా కెరియర్ లో ఇప్పటివరకు ఏ సినిమాకు రాని ఓపెనింగ్స్ కన్నప్ప సినిమాకు వచ్చాయని తెలిపారు అయితే ప్రభాస్ కారణంగానే తన సినిమాకు ఈ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయని ఈయన తెలియజేశారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రభాస్ ను వెండితెరపై చూడటం కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చినప్పటికీ చెన్నైలో మాత్రం షో క్యాన్సిల్ అవ్వటం అనేది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

హెచ్ డీ ప్రింట్ లీక్..

ఇకపోతే ఈ సినిమా విడుదలైన మరుసటి రోజే హెచ్డి ప్రింట్ కూడా లీక్ అవడంతో సినిమా కలెక్షన్ల పై భారీ ప్రభావం చూపిస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన విష్ణు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా తన సినిమా హెచ్డి ప్రింట్ లీక్ అయిందనే విషయం తెలిసి గుండె బద్దలైంది అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఏది ఏమైనా కన్నప్ప సినిమా మరింత పుంజుకుంటేనే సునాయసంగా బ్రేక్ ఈవెన్ అవుతుందని లేకపోతే విష్ణుకి ఇబ్బందులు ఎదురవుతాయని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా మోహన్ బాబు నిర్మాణంలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 10 వారాల వరకు ఓటీటీలోకి రాదని, ఇంకా ఓటీటీ డీల్ కూడా కుదరలేదని ఇటీవల స్వయంగా విష్ణు తెలియజేశారు.

Also Read: వీరమల్లుకు పోటీగా కింగ్ డం.. మీ క్రియేటివిటీ చూపించొద్దు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

Related News

Rudramadevi: గోన గన్నారెడ్డిపై ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్, మహేష్.. మరి బన్నీతో ఎలా?

Lokesh Kanagaraju : లోకేష్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… కూలీనే కూనీ చూసింది ?

Little hearts: రిలీజ్ అయిన ఒక్క రోజులోనే… రికార్డు క్రియేట్ చేసిన లిటిల్ హార్ట్స్!

Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!

Kishkindhapuri: ఆ టార్చర్ నుండి బయటపడేసిన కౌశిక్.. నో ముఖేష్ నో స్మోకింగ్..!

Madharaasi Collections : తెలుగు రాష్ట్రాల్లో షాకిచ్చిన ‘మదరాసి’.. ఇలా అయితే కష్టమే..!

Big Stories

×