Nagavamshi: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా సక్సెస్ అందుకున్న నిర్మాత నాగ వంశీ (Nagavamshi)త్వరలోనే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో చేసిన కింగ్ డం(King Dom) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gautham Thinnanuri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడుతూ వచ్చింది. అయితే జులై నెలలోనే ఈ సినిమా విడుదల కాబోతుందని వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక జూన్ 12వ తేదీ విడుదల కావలసిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హర హర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా వాయిదా పడుతూ జూలై 24వ తేదీ విడుదలకు సిద్ధమైంది.
నేనేంటో మీ అందరికీ తెలుసు..
ఈ క్రమంలోనే జూలై 25 వ తేదీ నాగ వంశీ కింగ్ డం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.. ఇలా ఈ వార్తలపై నాగ వంశీ స్పందిస్తూ అసలు క్లారిటీ ఇచ్చారు. కింగ్ డం సినిమా గురించి ఏం పోస్ట్ చేసిన అప్పుడప్పుడు నాకు మీ నుంచి తిట్లు పడతాయి అనే విషయం తెలుసు. అయినా మీరు నన్ను నమ్మండి మా టీమ్ అంతా మీకు ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. నేనేంటో మీ అందరికీ తెలుసు నేను ఏదైనా చెబుతున్నాను అంటే ఆ విషయం గురించి పూర్తిగా నమ్మకం ఉంటేనే చెబుతాను.
విన్నర్ అని మీరే రాస్తారు..
నేను చెప్పిన దాంట్లో ఏమాత్రం మిస్ అయిన మీరందరూ కూడా నాపై మీ క్రియేటివిటీ చూపిస్తారు. నేను ఈ సినిమా విషయంలో ఒకటే చెబుతున్న సినిమా చూసిన తర్వాత కింగ్ డం విన్నర్ అని మీరే రాస్తారు అంటూ పోస్ట్ చేశారు. త్వరలోనే మీకు ఈ సినిమా విడుదల గురించి అలాగే టీజర్, సాంగ్ అనౌన్స్మెంట్ అన్ని కూడా తెలియ చేయబోతున్నాను అంటూ ఈ సినిమా విడుదల గురించి వచ్చే వార్తలను పూర్తిగా ఖండించారు. ఈయన చేసిన పోస్ట్ బట్టి చూస్తుంటే జులై 25వ తేదీ కింగ్ డం విడుదలవుతుందనేది పూర్తిగా అవాస్తవం అని తెలుస్తోంది.
Em post chesina, Kingdom sweet curses mathram vasthune untayi ani telusu 😅
But trust me our team is working around the clock to bring you a Massive Big Screen Experience… One thing I can promise you – The ADRENALINE RUSH this film delivers is unreal 🔥🔥
And you all know…
— Naga Vamsi (@vamsi84) June 30, 2025
ఇక నాగ వంశి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ సినిమాకు తాను ఏ మాత్రం అడ్డుగా రానని చెబుతూనే వస్తున్నారు. ఒకవేళ మేము ఫిక్స్ చేసుకున్న తేదీని పవన్ కళ్యాణ్ సినిమా కోసం అడిగితే తప్పకుండా నేను ఆ తేదీని ఇచ్చేసి వెనుకడుగు వేస్తానని నాగ వంశీ తెలిపారు. అయితే ఆయన చెప్పిన విధంగానే ఇచ్చిన మాట పైనే నిలబడ్డారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు. ఇక విజయ్ దేవరకొండకు కూడా ఈ సినిమా చాలా కీలకంగా మారిందని చెప్పాలి. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ కూడా సరైన సక్సెస్ లేక ఎంతో సతమతమవుతున్నారు. ఈయన కూడా కింగ్ డం సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: ఈ టాలీవుడ్ నటుడు మాజీ ప్రధాని మనవడా.. బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదే?