MP Arvind: ఎట్టకేలకు తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా రామచందర్‌రావు పగ్గాలు చేపట్టనున్నారు. రేపో మాపో ఈ కార్యక్రమం జరగనుంది. అధ్యక్షుడి రేసులో చివరివరకు నిలిచారు ఇద్దరు ఎంపీలు. వారిలో ఒకరు ఈటెల రాజేందర్ కాగా, మరొకరు ధర్మపురి అరవింద్. పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయంపై ఇరువురు నేతలు ఏమంటున్నారు? ఇదే చర్చ ఇప్పుడు తెలంగాణలో మొదలైంది.
బీజేపీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలు చాలామందికి అంతుబట్టవు. మనం ఒకటి తలస్తే.. జరిగేది ఇంకొకటి. ఈ విషయం బీజేపీలోని నేతలకు బాగా తెలుసు. వాజ్‌పేయి-అద్వానీ హయాంలో ఫలానా వ్యక్తి అంటే అతడ్ని అధ్యక్షుడిగా నియమించేవారు. బలమైన వాయిస్ కలిగిన నేత ఉండాలని కోరుకునేవారు.
మోదీ-అమిత్ షా ద్వయం ఆలోచనలు వేరు. ముఖ్యమంత్రి ఎంపిక, రాష్ట్రాల అధ్యక్షులు ఇలా ఏది చూచినా జాగ్రత్తగా ఎంపిక చేస్తారు. ఆయా రాష్ట్రాల గురించి పూర్తిగా కేడర్ నుంచి సమాచారం తీసుకున్న తర్వాతే ఎంపిక చేస్తున్నారు. తాజాగా తెలంగాణ అధ్యక్షుడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు.
ఒకరు ఈటెల రాజేందర్, మరొకరు ధర్మపురి అరవింద్. ఈ రేసులో చివరివరకు వీరిద్దరు నిలిచారు. అనుహ్యంగా తెరపైకి మూడో వ్యక్తి వచ్చారు. ఆయన ఎవరోకాదు మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు. ఆయన ఎంపిక వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. కాకపోతే వివాదాలకు దూరంగా ఉంటాడనే పేరు ఆయన సొంతం. అదే ఆయన్ని అందలం ఎక్కించింది.
ALSO READ: పొలిటికల్ హీట్.. సోషల్‌మీడియాలో కొండా సుస్మిత సంచలన పోస్టు
అధ్యక్షుడిగా రామచందర్‌రావు ప్రకటించగానే షాకయ్యారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఆయన యూటర్న్ తీసుకున్నారు. అధ్యక్ష పోటీ నుంచి ఆయన వెనక్కి తగ్గారు. చివరకు ఆయన నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. పార్టీ తరపున అధ్యక్షుడిగా ఎవరు నామినేషన్ వేసినా తన మద్దతు ఉంటుందని తెలిపారు. అలాగే పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని చెప్పకనే చెప్పారు. వన్ సైడ్, గట్టిగా మాట్లాడేవారికి బీజేపీ దూరం పెట్టిందని చెప్పవచ్చు.
సౌమ్యుడు, వివాదాలకు దూరంగా ఉన్న వ్యక్తికి పగ్గాలు అప్పగించింది. ఏపీ కూడా అదే జరిగిందనుకోండి. అది వేరే విషయం. ఇంకొకరు నేత ఎంపీ ఈటెల ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటిస్తారా? లేకుంటే తన పని తాను చేసుకుపోతారా? అనేది చూడాలి.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై యూటర్న్ తీసుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఆర్వింద్.
పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. అధ్యక్షులుగా ఎవరు నామినేషన్ చేసినా సపోర్ట్ చేస్తా: ఆర్వింద్ pic.twitter.com/fiJE2gjCSf
— ChotaNews App (@ChotaNewsApp) June 30, 2025