BigTV English

Mythri Movie Makers : మైత్రీ పదేళ్ల ప్రయాణం… వాళ్ల హిట్స్ అండ్ ప్లాప్స్ ఇవే

Mythri Movie Makers : మైత్రీ పదేళ్ల ప్రయాణం… వాళ్ల హిట్స్ అండ్ ప్లాప్స్ ఇవే

Mythri Movie Makers : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థలలో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలన్నీ కూడా ఈ ప్రొడక్షన్ హౌస్ లోనే నిర్మితం అవుతున్నాయి. ముఖ్యంగా చాలామంది స్టార్ హీరోలు ఈ బ్యానర్ లో పనిచేశారు.


తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సినిమాకి సంబంధించిన బ్యానర్  నిలబడడం అంటే మామూలు విషయం కాదు. చాలామంది నిర్మాతలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తర్వాత కొన్ని సినిమాలు తీసి వెనక్కి వెళ్లిపోయారు. అలానే డిస్ట్రిబ్యూటర్స్ గా కూడా కొంతమంది వచ్చి వెనక్కి వెళ్లిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు ఊహించిన విధంగా మైత్రి మూవీ మేకర్ సంస్థ. ఏకంగా పదేళ్లపాటు వాళ్ళ ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తుంది.

శ్రీమంతుడు తో మొదలైన ప్రయాణం 


మిర్చి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు కొరటాల శివ. బాహుబలి సినిమాకు ముందు ప్రభాస్ చేసిన ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు లేకపోయినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ తర్వాత కొరటాల శివకు విపరీతమైన పేరు వచ్చింది. వెంటనే మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు అనే సినిమాను చేశాడు. బాహుబలి సినిమాతో పాటు విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. దాదాపు 200 కోట్లకు దగ్గరగా ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చాయి. అక్కడితో మొదలైన మైత్రి మూవీ మేకర్స్ ప్రయాణం ఇప్పటికీ వరుస హిట్ సినిమాలు తో దూసుకు వెళుతుంది.

ఈ బ్యానర్ లో డిజాస్టర్ సినిమాలు 

వరుసగా హిట్ సినిమాలు వస్తున్న తరుణంలో ఈ బ్యానర్లో సినిమా చేయడం అనేది చాలామందికి ఒక కల అని కూడా చెప్పాలి. అలానే చాలామంది దర్శకులకు ఈ బ్యానర్లో అవకాశాలు వచ్చాయి. శ్రీను వైట్ల రవితేజ కాంబినేషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ, మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. నాగచైతన్య హీరోగా చందు దర్శకత్వం వహించిన సవ్యసాచి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమా కూడా ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ సినిమాలు మినహాయిస్తే ఈ బ్యానర్ కి మంచి సక్సెస్ రేట్ ఉంది. ప్రస్తుతం ఈ బ్యానర్లు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోలు సినిమాలను చేస్తున్నారు.

Also Read: Cpi Narayana: రెడ్ లైట్ ఏరియా నుంచి తెచ్చుకోండి… నిర్మాతలపై సీపీఐ నారాయణ కామెంట్స్

Related News

CPI Narayana: మేకప్ లేకుండా రజినీకాంత్ ను చూశారా.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు!

Mahesh Babu: మహేష్ బాబు వాడే వ్యానిటీ వాన్ ఖరీదు తెలిస్తే గుండె గుబేల్!

Cpi Narayana: రెడ్ లైట్ ఏరియా నుంచి తెచ్చుకోండి… నిర్మాతలపై సీపీఐ నారాయణ కామెంట్స్

Producer Kalyan: చిన్న సినిమాలకు లైన్ క్లియర్… షూటింగులు జరపవచ్చు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

Heroine Sangeeta: విడాకుల రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సంగీత.. ఏమన్నారంటే?

Big Stories

×