Cpi Narayana: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయి. అలానే ఇప్పటికిప్పుడు కొన్ని సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా సినీ కార్మికులు తమ వేతనాలను 30 శాతం వరకు పెంచాలి అని గత కొన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుమూలంగానే కొన్ని షూటింగ్స్ కూడా ఆగిపోయాయి.
ఈ తరుణంలో ఒక కాస్ట్యూమర్ ని సెట్ వద్దకు వెళ్లి కాస్ట్యూమ్ యూనియన్ సెక్రటరీ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇండస్ట్రీలో ఈ సినీ కార్మికుల వేతనాలు గురించి ఇప్పటికి ఒక కొలిక్కి రాలేదు. దీనిపై సిపిఐ నారాయణ రెస్పాండ్ అయ్యారు.
సిపిఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు
బాంబే నుంచి రెడ్ లైట్ ఏరియా వారిని తెప్పించుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ఇక్కడి కార్మికుల పొట్టగొట్టి అక్కడి కార్మికులను తెచ్చుకుంటే అంతు చూస్తాం, కార్మికుల వైపుకు నిలబడతాం, పోరాటాలు సాగిస్తాం. సినిమా ఇండస్ట్రీ మొత్తం పది మంది కుటుంబాల చేతుల్లో ఉంది.హీరోలు వాళ్లే, దర్శకులు వాళ్లే ప్రొడ్యూసర్లు వాళ్లే, సినిమా థియేటర్లు వారివే.సినిమా థియేటర్లు కొంతమంది చేతుల్లో ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఆ పది కుటుంబాలే ముఖ్యమంత్రిని కూడా శాసిస్తున్నాయి.
కార్మికులు లేకుండానే స్థాయికి వెళ్ళారా.?
కార్మికులు లేకుండానే స్టార్లు, స్టార్ ప్రొడ్యూసర్లు అయ్యారా.? ప్రొడ్యూసర్లు చిరంజీవి ఇంటికి వెళ్లడం పులికి పాలు పోసినట్టుగా ఉంది. కార్మికులతో మాట్లాడకుండా చిరంజీవి ఇంటికి వెళ్ళడం ఏం లాభం. పులికి మేకలను అప్పజెప్పడమే అవుతుంది. గతంలో చిరంజీవిపై వాస్తవాలు మాట్లాడను కానీ దానికి క్యాస్ట్ జోడించి తప్పుడు ప్రచారాలు చేశారు. అది చిరంజీవి విజ్ఞతకే వదిలేస్తున్న. ఇప్పటికైన పాత వీడియోలు సోషల్ మీడియా నుంచి తొలగించాలి, లేదంటే నేను యాక్షన్ లోకి దిగాల్సి వస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో కళామతల్లి బిడ్డలు పొట్ట చేత పెట్టుకొని ఆందోళన చేస్తున్నారు. కలామ్మ తల్లి కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలి. వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు ప్రభుత్వాలు కూడా మళ్లీ వారికే రాయితీలు ఇస్తున్నాయి. బ్లాకులో అమ్ముకోవడానికి అనుమతులు ఇస్తున్నాయి.
కార్మికులు 30% వేతనాలు అడిగితే ఇవ్వరా..?
బడా బడా వ్యాపారవేత్తలు, బడా ప్రొడ్యూసర్లు మాత్రమే ముఖ్యమంత్రికి కనిపిస్తారా..? కార్మికులు కనిపించరా..? సినీ కార్మికుల పట్ల ముఖ్యంత్రి నేరుగా చెరువ చూపాలి. ఆర్.నారాయణమూర్తి లాంటివారు సినిమాలు తీస్తే ప్రోత్సాహం ఉండదు, సినిమా థియేటర్లు దొరకవు. సినీ కార్మికుల పొట్ట కొట్టడం సరైన పద్ధతి కాదు. తెలుగు రాష్ట్రాల్లో స్కిల్స్ లేవని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పెద్ద సినిమాలకు 30 శాతం వెతనాలు పెంచాల్సిందే. అంటూ పూర్తి మద్దతును కార్మికుల వైపు తెలియజేశారు సిపిఐ నారాయణ. దీనిపై తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.
Also Read: Producer Kalyan: చిన్న సినిమాలకు లైన్ క్లియర్… షూటింగులు జరపవచ్చు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత!