Mythri Movie Makers:ఒకప్పుడు తెలుగు సినిమా అంటే థియేటర్లలో ఎన్ని కోట్లు వసూలు చేసిందని లెక్కలు వేసేవారు. కానీ ట్రెండ్ మారింది. థియేటర్ లలో వసూళ్ళతో పాటు ఓటీటీలో ఆ సినిమాకు ఎలాంటి అప్లాజ్ వచ్చిందనేది కూడా ముఖ్యమైపోయింది. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ లాంటి డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో మన తెలుగు సినిమాలను అన్ని భాషల వాళ్ళు చూడటం నిర్మాతలకు కొత్త జోష్ ఇస్తోందనే చెప్పాలి.
ఇక ఇదే ఈ విషయంలో టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ మరోసారి తన సత్తా చాటుకుంది. ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా నాలుగు సినిమాలతో నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ చార్టుల్లో టాప్‌లో ఉన్నట్టు క్రేజీ పోస్టర్ తో అనౌన్స్ చేశారు.
మొదటగా విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘రణబాలి’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రెండో స్థానంలో ట్రెండ్ అవుతుంటే, వాళ్లదే మరో సినిమా ‘418’ మూడో స్థానంలో నిలవడం విశేషం. ఇలా ఒకే నిర్మాణ సంస్థకు చెందిన రెండు సినిమాలు ఇలా ఒకేసారి టాప్ స్థానాల్లో ఉండటం బట్టి చూస్తే మైత్రి ఇండస్ట్రీలో ఎలా దూసుకుపోతుందో,ఎలాంటి కథలతో ఆడియన్స్ ని అలరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.ఇక ఇదే ఊపులో గతంలో తమ బ్యానర్ నుంచి వచ్చిన ‘ఇరుముడి’, ‘మోద రాత్రి’ సినిమాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో కొన్ని వారాల పాటు దుమ్మురేపాయని మరోసారి గుర్తుచేసుకున్నారు మేకర్స్.
‘రణబాలి’ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ సినిమాకు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. 1870ల నాటి దక్షిణ భారతదేశంలో వచ్చిన కరువు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాలో వారికి ఎదురు తిరిగిన యోదుడిగా విజయ్ దేవరకొండ ఫెర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్. అక్టోబర్ 16న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ టాప్ గేర్ లో దూసుకుపోవడం విశేషం.
మరోవైపు ‘418’ అనే సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ లో రచ్చ చేస్తుంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా హారర్, సస్పెన్స్ నేపథ్యంలో కీర్తన్ నాగగౌడ తీసిన ఈ సినిమా కి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. అక్టోబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నవంబర్ 19 నుంచి ఐదు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చి మూడో స్థానంలో ట్రెండ్ అవుతోంది.
ఇక అంతకుముందు మైత్రీ బ్యానర్‌కు మంచి వచ్చిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 250కోట్ల వసూల్లని కొల్లగొట్టగా సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన గ్లోబల్ నాన్-ఇంగ్లీష్ సినిమాల లిస్టులో ఏకంగా నంబర్ వన్ స్థానంలో నిలవడం విశేషం. మొత్తంగా ఇలా ఒకే బ్యానర్ నుంచి వచ్చిన రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా టాప్ 1, 2 స్థానాల్లో నిలవడం పెద్ద హాట్ టాపిక్ అయింది.
Continuing our unstoppable reign on Netflix 😃❤️
After #Irumudi & #ModhaRathri dominated the charts for weeks, #Ranabaali & #418TheFilm are now trending at the top on @NetflixIndia ❤️🔥
Four films. Two back-to-back chart-topping runs.
Now streaming in Telugu, Hindi, Tamil,… pic.twitter.com/mAjQDJGq2b
— Mythri Movie Makers (@MythriOfficial) November 21, 2026
ALSO READ:ఇయర్ ఎండ్‌కు టాలీవుడ్ ట్విస్ట్.. ‘మైసా’, ‘వృషకర్మ’, ‘కింగ్ 100’ డేట్స్ మారుతున్నాయా?