Ram Charan RC17:చరణ్ ,సుక్కు కాంబోలో వస్తున్న RC17 సినిమాపై ఎప్పటి నుండో భారీ అంచనాలున్న సంగతి చెప్పక్కర్లేదు. ‘రంగస్థలం’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ ఇద్దరూ మరోసారి జోడీ కట్టడంతో అభిమానుల్లో సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోయింది.అయితే సినిమాలో హీరోయిన్ ని సెలెక్ట్ చేసే విషయంలో మాత్రం మేకర్స్ ఇంకా డైలమాలో ఉన్నట్టే కనిపిస్తుంది.
మాములుగా పెద్ద హీరో సినిమా అనౌన్స్ అయిందంటే అందులో హీరోయిన్ ఎవరా అని అభిమానులు ఆరా తీయడం సహజం.కానీ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు సంబంధించి మాత్రం హీరోయిన్ పేరు మాత్రం పూటకొకటి వినిపించడంతో అసలేం జరుగుతుందన్న టాక్ వినిపిస్తుంది.
తాజాగా ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో ప్రేక్షకులని అలరించిన సాత్విక పేరు వినిపిస్తుంది. తొలి సినిమాతోనే తన నటనతో మంచి పేరు తెచ్చుకోవడంతో పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ లు వచ్చే అవకాశమే ఎక్కువ.అందులో భాగంగా చరణ్ సినిమాలో ఛాన్స్ దక్కిందని వినిపిస్తున్నప్పటికీ ఎక్కడా అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రాకపోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్గా ప్రీతి ముకుందన్, సారా అర్జున్, శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే వంటి పేర్లు కూడా గతంలో మీడియాలో చక్కర్లు కొట్టాయి.వీరిలో శ్రీలీల ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది కూడా.ముఖ్యంగా ‘ధమాకా’, ‘భగవంత్ కేసరి’, ‘గుంటూరు కారం’ వంటి సినిమాలతో స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ కొట్టేసింది.
.మరోవైపు భాగ్యశ్రీ బోర్సే లెనిన్ సినిమాతో తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకుంది.ఇక ప్రీతి ముకుందన్ బ్లాస్ట్ సినిమాతో బ్లాస్ చేయగా సారా అర్జున్ దురంధర్ సినిమాతో దంచి కొట్టిందే.మొత్తంగా చరణ్ సినిమా కోసం ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ పేర్లు వినిపిస్తుండగా వీరిలో ఎవరు ఫైనల్ అవుతారు ..లేక ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ ఇందులో భాగం కాబోతున్నారా అంటూ డైలామాలో పడిపోయారు మెగా ఫ్యాన్స్.
ఇక సుకుమార్ తన సినిమాల్లో హీరోయిన్స్ రోల్స్ కి ఎంతటి ఇంపార్టెన్స్ ఇస్తారో చెప్పక్కర్లేదు.ఆర్య’, ‘రంగస్థలం’, ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ వంటి సినిమాలను చూస్తే అది అర్థం అవుతుంది కూడా. కేవలం స్టార్ హీరో పక్కన అందంగా కనిపించే హీరోయిన్ను ఎంపిక చేయడం కాకుండా, కథలో భాగంగా హీరోయిన్ ని తీర్చి దిద్దడం ఆయన స్పెషాలిటీ.
ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.మరి అప్పటికైనా ఒక నిర్ణయానికి వచ్చి అనౌన్స్ చేస్తారా లేక అప్పటికీ ఇంకా డైలమాతోనే మూవీ మొదలెడతారా చూడాలి !
ALSO READ:ఆ సినిమాకు కాపీనా? ‘ఆకాశంలో ఒక తార’ వివాదంపై డైరెక్టర్ పవన్ సాదినేని స్ట్రెయిట్ ఆన్సర్!