E-Paper
Advertisement

ఎంతో బిజీగా ఉన్నా ఆ పాటలు వింటే రిలాక్స్ అవుతా.. తన మ్యూజిక్ టేస్ట్ బయటపెట్టిన వేణుస్వామి!

ఎంతో బిజీగా ఉన్నా ఆ పాటలు వింటే రిలాక్స్ అవుతా.. తన మ్యూజిక్ టేస్ట్ బయటపెట్టిన వేణుస్వామి!
Advertisement

Venu Swamy:వేణుస్వామి..ప్రముఖ జ్యోతిష్కుడుగా పేరొందిన ఈయనకి ఇష్టమైన సినిమా పాటలు ఏంటో తెలుసా..ఇదిగో ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు వేణు స్వామి. అంతేకాకుండా తన జీవితంలోని ఎన్నో వ్యక్తిగత విషయాలను, కష్టాలను, అనుభవాలను ఓపెన్‌గా పంచుకున్నారు. సాధారణంగా జాతకాలు, వివాదాలతో వార్తల్లో నిలిచే ఆయన, ఈసారి తన బాల్యం, పేదరికం, కుటుంబం, రాజకీయాల గురించి చెప్పడం విశేషం.

సిద్ధిపేట జిల్లా నాచారం ప్రాంతానికి చెందిన వేణుస్వామి తండ్రి నరసింహస్వామి ఆలయంలో పూజారిగా, జ్యోతిష్యంలో పండితుడిగా ఉండేవారని చెప్పారు. 1987లో పదకొండేళ్ల వయసులోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయని,. తండ్రి పోయినప్పుడు ఇంట్లో కేవలం పదిహేను, ఇరవై రూపాయలే ఉన్నాయని, ఆ తర్వాత అన్న దగ్గర ఉంటూ చదువుకుంటూనే పూజలు చేస్తూ చిన్న వయసులోనే సంపాదన మొదలుపెట్టానని ఆనాటి రోజులని గుర్తుచేసుకున్నారు.

Advertisement

హైదరాబాద్‌లో చదువుకుంటూనే ‘ప్రాణ స్నేహితులు’ లాంటి సినిమాలకు ముహూర్తాలు పెట్టారని, 2000 నుంచి 2004 వరకు సినిమా ఇండస్ట్రీతో అనుబంధం ఉందని, ఆ తర్వాతే పూర్తిస్థాయి జ్యోతిష్యం వైపు వచ్చానని వివరించారు.

ఇక తన జర్నీలో ఎదురైన కష్టాలను గుర్తుచేసుకుంటూ 2001లో స్నేహితుడు శ్యామ్‌తో కలిసి ఒకే గదిలో ఉండే రోజుల్లో, తినడానికి డబ్బులు లేక రెండు ప్లేట్ల ఇడ్లీలతో రోజంతా గడిపిన సందర్భం ఇప్పటికీ గుర్తుందని ఎమోషనల్ అయ్యారు. ఉదయం ఒక ఇడ్లీ, మధ్యాహ్నం మిగిలినవి తిని, రాత్రికి సాంబార్‌లో నీళ్లు కలుపుకుని తాగేవాళ్లమని, అలాంటి స్థితి నుంచి ఇప్పుడు విదేశాల నుంచి కూడా ఫోన్లు వచ్చే స్థాయికి ఎదిగానని చెప్పారు.

Advertisement

తనకు మొదటి నుంచీ కింగ్ కావడం కంటే కింగ్ మేకర్‌గా ఉండటమే ఇష్టమని, వామాచారం, దశమహావిద్యల కోసం కామాఖ్య వెళ్లి వంద రోజుల దీక్ష చేశానని తెలిపారు. అలాగే ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్న భయం అవసరం లేదని, పోటీ వచ్చినప్పుడే మనిషిలోని అసలైన ప్రతిభ బయటపడుతుందని చెప్పుకొచ్చారు.

ఇక నలుపు రంగు రాహువుకు సంకేతమని, తన మొదటి కారును అమావాస్య రోజే కొన్నానని పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తన దగ్గరకు వచ్చే ప్రముఖుల విషయాల్లో దాదాపు 99 శాతం సీక్రెట్ మెయింటేన్ చేస్తానని, భార్యతో కూడా క్లయింట్ల విషయాలు పంచుకోనని క్లారిటీ ఇచ్చారు.ఇక రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ప్రస్తుతానికి లేదని, భవిష్యత్తులో అసెంబ్లీ సీట్లు పెరిగితే తనకు, తన భార్యకు అవకాశాలు రావచ్చని చెప్పారు.

ఇక ఇంట్లో ఆడవాళ్లు సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుందని, తన భార్య వాణి, కూతురు తన కష్టాల్లో అండగా నిలిచారని కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు.ఇక తన భార్య వాణి వీణ వాయిస్తుంటే ‘వెంకటాచలనిలయం’, ‘7/G బృందావన్ కాలనీ’, ‘ఆషికీ 2’ లాంటి పాటలు వినడం తనకు ఎంతో ఇష్టమని తన ఇష్టా ఇష్టాలని చెప్పుకొచ్చారు వేణు స్వామి.

ALSO READ:చరణ్ సినిమా.. హీరోయిన్ విషయంలో అంతా గందరగోళమే!

Tags

Related News

చరణ్ సినిమా.. హీరోయిన్ విషయంలో అంతా గందరగోళమే!

ఆ సినిమాకు కాపీనా? ‘ఆకాశంలో ఒక తార’ వివాదంపై డైరెక్టర్ పవన్ సాదినేని స్ట్రెయిట్ ఆన్సర్!

ధనుష్ పొరపాటున ఇండస్ట్రీలోకి వచ్చారా?ఆ పని చేయడం అంత ఇష్టమా?

లండన్ వీధుల్లో చిల్ అవుతున్న రుక్మిణి వసంత్.. క్యూట్ పిక్స్ వైరల్!

సీనియర్ నటుడు సుధాకర్ కొడుకును చూశారా.. అచ్చం తండ్రి పోలికలే!

సన్నీ డియోల్ ఇంటికి సచిన్ కూతురు కోడలిగా ..పెళ్లి వార్తలు వైరల్!

60 ఏళ్లు దాటితే టికెట్ అక్కర్లేదా? ‘ఆలోచన’ టీమ్ సర్‌ప్రైజ్!

Big Stories

Advertisement
×