E-Paper
Advertisement

ఆ సినిమాకు కాపీనా? ‘ఆకాశంలో ఒక తార’ వివాదంపై డైరెక్టర్ పవన్ సాదినేని స్ట్రెయిట్ ఆన్సర్!

ఆ సినిమాకు కాపీనా? ‘ఆకాశంలో ఒక తార’ వివాదంపై డైరెక్టర్ పవన్ సాదినేని స్ట్రెయిట్ ఆన్సర్!
Advertisement

Aakasamlo Oka Tara:‘ఆకాశంలో ఒక తార’..దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాదినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో మంచి టాక్‌తో దూసుకుపోతోందన్న సంగతి తెల్సిందే.ముఖ్యంగా ఈ సినిమా కథ, నటీనటుల యాక్టింగ్, ఎమోషన్స్, ముఖ్యంగా స్పేస్ సీన్స్ గురించి బాగా మాట్లాడుకుంటున్నారు ఆడియన్స్. ఇక ఈ సందర్భంగా డైరెక్టర్ పవన్ సాదినేని ఒక ఇంటర్వ్యూలో పాల్గొని
ఈ సినిమా వెనుక ఉన్న అసలు కథను, పలు ఆసక్తికరమైన విషయాలను ఇలా చెప్పుకొచ్చారు.

నిజానికి ఈ కథ 2020లో కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో పుట్టిందని, కనీసం బయటకు వెళ్లి మనుషులను కలవడానికి కూడా భయపడుతున్న రోజుల్లో ఈ ఆలోచన వచ్చిందని వివరించారు.ఒక చిన్న పల్లెటూరిలో కనీసం స్కూల్‌కు వెళ్లడానికి బస్సు సౌకర్యం కూడా లేని ఒక అమ్మాయి, ఏకంగా రాకెట్ ఎక్కి అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కనడమే ఈ కథ మెయిన్ పాయింట్ అని తెలిపారు.ఈ ఒక్క లైన్ వినగానే గుండం గంగరాజు గారికి బాగా నచ్చేసిందని ఆ తర్వాత వసంత్‌తో కలిసి పూర్తి కథను రెడీ చేశానని చెప్పుకొచ్చారు.

Advertisement

ఇక ఈ ప్రాజెక్టులోకి దుల్కర్ సల్మాన్ రావడం కూడా చాలా ఆసక్తికరంగా జరిగిందని మొదట్లో ఈ కథను చాలామంది హీరోలకు చెప్పాలని ట్రై చేస్తే ఎవరూ కనీసం కథ వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదని వాపోయారు. అలాంటి టైమ్‌లో దుల్కర్ సల్మాన్ కథ విన్న వెంటనే ఓకే చెప్పడం తనకి పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తానూ కథ చెప్పిన విధానం, అందులోని ఎమోషన్స్ దుల్కర్‌కు బాగా కనెక్ట్ అయ్యాయని చెప్పుకొచ్చారు.

తానూ గతంలో తీసిన మూడు సినిమాలు పెద్దగా ఆడకపోయినా, గంగరాజు, సన్నీ లాంటి వాళ్లు ఆయన టాలెంట్‌ను నమ్మారని,. తన కెరీర్‌లో నాలుగో సినిమా అయిన ‘ఆకాశంలో ఒక తార’ తనలోని పూర్తి దర్శకుడిని బయటకు తెచ్చిందని సంతోషంగా చెప్పుకొచ్చారు పవన్ సాదినేని.

Advertisement

ఇక ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా కథ మరో సినిమాకు కాపీ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వార్తలపై రియాక్ట్ అవుతూ ఈ స్టోరీని 2020లోనే రెడీ చేశామని వేరే దర్శకుడి సినిమాతో తమకు ఎలాంటి సంబంధం లేదని కుండ బద్దలు కొట్టేశారు.

గతంలో ఆ దర్శకుడితో మాట్లాడినప్పుడు ఆయన సినిమా తండ్రి, కూతుళ్ల మధ్య నడుస్తుందని చెప్పారని, కానీ తమ సినిమాలో భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని వివరించారు. ట్రైలర్‌లో కొన్ని పోలికలు కనిపించడం తనకూ ఆశ్చర్యం వేసిందని చెప్పారు.

ఒకే సమయంలో ఇద్దరు దర్శకులకు ఒకే రకమైన ఆలోచన రావడం సహజమే తప్ప దాన్ని కాపీ అనకూడదని అన్నారు. నిజానికి కల్పనా చావ్లా భర్త రాసిన ఆమె జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు వచ్చిన ఆలోచన నుంచే ఈ కథ పుట్టిందని అసలు విషయం బయటపెట్టారు పవన్ సాధినేని. చూడాలి మరి ఈ సినిమాపై ముందు ముందు ఇంకెన్ని కాంట్రవర్సీలు చుట్టుముడతాయో !

ALSO READ:జానపదానికి డీజే టచ్.. మాధురి రాథోడ్ స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్ అదిరిపోయాయ్ గా !

Tags

Related News

ధనుష్ పొరపాటున ఇండస్ట్రీలోకి వచ్చారా?ఆ పని చేయడం అంత ఇష్టమా?

లండన్ వీధుల్లో చిల్ అవుతున్న రుక్మిణి వసంత్.. క్యూట్ పిక్స్ వైరల్!

సీనియర్ నటుడు సుధాకర్ కొడుకును చూశారా.. అచ్చం తండ్రి పోలికలే!

సన్నీ డియోల్ ఇంటికి సచిన్ కూతురు కోడలిగా ..పెళ్లి వార్తలు వైరల్!

60 ఏళ్లు దాటితే టికెట్ అక్కర్లేదా? ‘ఆలోచన’ టీమ్ సర్‌ప్రైజ్!

నన్ను క్షమించు.. ఒప్పుకోక తప్పడం లేదు: నభా నటేష్!

స్నానం చేసేటప్పుడు కల్లు ఉప్పు వేసుకొని చేస్తా : సంయుక్త మీనన్!

Big Stories

Advertisement
×