Tollywood Movies:ఏడాది చివర్లో వరుస పెద్ద సినిమాలతో టాలీవుడ్ కల కలలాడుతుందని ఆశ పడ్డ ఆడియన్స్ కి పెద్ద షాక్ తగిలేలానే ఉంది. అవును.. నవంబర్, డిసెంబర్ నెలల్లో వరుసగా పెద్ద సినిమాలు థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తాయని అనుకుంటే అవి కాస్తా వాయిదాల పాట పాడేలా కనిపిస్తున్నాయి.ఒకటి రెండు కాదు ముచ్చటగా మూడు సినిమాల రిలీజ్ డేట్స్ మారబోతున్నాయంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దీంతో ఇపుడు థియేటర్ల లెక్కలు, బాక్సాఫీస్ క్లాష్‌లు అన్ని తారుమారయ్యేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రష్మిక మందన్న ‘మైసా’, నాగచైతన్య ‘వృషకర్మ’, నాగార్జున వందో సినిమా ‘కింగ్ 100’ సినిమాల చుట్టూ పెద్ద డిబేటే జరుగుతుంది. నిజానికి ఈ మూడు సినిమాల మీద ఆడియన్స్ లో మంచి అంచానాలు ఉన్న సంగతి తెల్సిందే.
అయితే సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ కి ఇంకా టైమ్ పట్టేలా ఉండటంతో సెన్సార్, ప్రమోషన్లకు టైమ్ సరిపోక మేకర్స్ డేట్స్ మార్చుకునే దిశగా మేకర్స్ ఆలోచిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. అయితే ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు కాబట్టి ఇవన్నీ ప్రస్తుతానికి ఇండస్ట్రీలో వినిపిస్తున్న గాసిప్స్ అనే చెప్పాలి.
‘మైసా’ విషయానికి వస్తే
రష్మిక మందన్న లీడ్ రోల్‌లో చేస్తున్న ‘మైసా’ విషయానికి వస్తే, దీనిపై మొదటి నుంచే అంచనాలు భారీగా ఉన్న సంగతి తెల్సిందే. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తీస్తున్నారని అప్ డేట్స్ చూస్తేనే అర్థం అవుతుంది. పైగా రష్మిక క్యారెక్టర్, లుక్, ఫైట్ సీన్స్ మెయిన్ హైలైట్ అవుతాయని ఆశలు పెంచేసుకున్నారు రష్ ఫ్యాన్స్.
ఇక ముందుగా నవంబర్ 27న రిలీజ్ చేద్దామని అనుకున్నా, ఇప్పుడు ఆ డేట్‌కి రావడం కష్టమనే టాక్ వినిపిస్తుంది.సెన్సార్ పనులు, ఫైనల్ కాపీ రెడీ అవడంలో లేట్ అయ్యే అవకాశం ..వెరసి ఈ సినిమాని డిసెంబర్ 4కి పోస్ట్ పోన్ చేస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘వృషకర్మ’ కూడా
ఇక నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘వృషకర్మ’ కూడా వాయిదాల పాట పాడేలానే కనిపిస్తుంది. ‘విరూపాక్ష’తో హిట్ కొట్టిన కార్తీక్ దండు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెల్సిందే.పైగా చైతు తండెల్ వంటి సాలిడ్ హిట్ తర్వాత ఈ సినిమా వస్తుండటంతో అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై మంచి అంచనాలే పెట్టుకున్నారు.
ఇక ‘దూత’వంటి క్రేజీ ప్రాజెక్ట్ కూడా చైతు ఖాతాలో ఉండటంతో మైథలాజికల్ అడ్వెంచరస్ జానర్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ ఉంది కూడా.అయితే డిసెంబర్ 4న వస్తామని మేకర్స్ ఇప్పటికే చెప్పగా తాజాగా వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా టైమ్ పట్టేలా ఉండటంతో క్రిస్మస్‌కి షిఫ్ట్ చేసే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది.
నాగార్జున వందో సినిమా ‘కింగ్ 100’ కూడా
మరోవైపు నాగార్జున వందో సినిమా ‘కింగ్ 100’ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కెరీర్‌లో మైలురాయి లాంటి వందో మూవీ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. డిసెంబర్ 24న వస్తుందని అనుకున్నా, వర్క్స్ పెండింగ్ ఉండటంతో జనవరికి వెళ్తుందేమో అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. వందో సినిమా కాబట్టి హడావిడిగా కాకుండా అన్ని పనులు పక్కాగా అయ్యాకే దింపాలని టీమ్ చూస్తోందట.
ఒక వేళ సినిమాలు ఇలాగే వాయిదాల పాట పాడితే మాత్రం డిసెంబర్ బాక్సాఫీస్ లెక్కలు మారడం పక్కా. ఎందుకంటే క్రిస్మస్ టైమ్‌లో బాలకృష్ణ ‘దాదా’ సినిమాను డిసెంబర్ 24న రిలీజ్ చేస్తామని ఇప్పటికే చెప్పేసింది మూవీ టీమ్. ‘కింగ్ 100’ కూడా అప్పుడే వస్తే బాలయ్య వర్సెస్ నాగ్ పోటీ మామూలుగా ఉండేది కాదు.
కానీ నాగ్ సినిమా వాయిదా పడితే, ఆ ప్లేస్‌లో నాగచైతన్య ‘వృషకర్మ’ను తీసుకొస్తారనే టాక్ వినిపిస్తుంది. అదే నిజమైతే డిసెంబర్ 24న బాలయ్యకు పోటీగా నాగార్జున కాకుండా, ఆయన కొడుకు నాగచైతన్య నిలబడతారన్నమాట. చూడాలి మరి ఈ వాయిదాల పర్వం ఎలాంటి బాక్సాఫీస్ వార్ కి తెర తీస్తుందో !
ALSO READ:రూ.40 కోట్లతో అదరగొట్టిన ధనుష్.. కానీ అసలు పరీక్ష ఇప్పుడే!