E-Paper
Advertisement

పిఠాపురంలో మోడల్ అంగన్వాడీ ప్రారంభించిన ఉపాసన కొణిదెల..

పిఠాపురంలో మోడల్ అంగన్వాడీ ప్రారంభించిన ఉపాసన కొణిదెల..
Advertisement

Upasana Konidela: ఉపాసన కొణిదెల కాకినాడ జిల్లా పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈమె మహిళల ఆరోగ్యం అలాగే పిల్లల ఆరోగ్యం కోసం అపోలో హాస్పిటల్ ఫౌండేషన్స్ ద్వారా అపోలో ఆరంభ్ ద్వారా మోడల్ అంగన్వాడీ(Model anganwadi) కేంద్రాన్ని ప్రారంభించారు మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti  irani)తో కలిసి ఉపాసన ఈ అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇదివరకే ఉపాసన (Upasana)సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తాజాగా ఈమె మరొక వీడియోని కూడా తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.

అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించిన స్మృతి ఇరానీ..

ఈ అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. మనదేశంలో 1.4 బిలియన్స్ ప్రజలు ఉన్నారని ఇందులో దాదాపు 13 కోట్లకు పైగా ఆరు సంవత్సరాల పిల్లలు ఉన్నారని తెలిపారు. వికసిత భారత్ 2047  లో భాగంగా ఈ పిల్లలే రేపు మన దేశానికి కీలకమని కొనియాడారు అందుకే వారి ఆరోగ్యం కోసం అపోలో ఆరంభ్ ముందుకు వచ్చిందని తెలిపారు.అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని గృహాల్లో శుభ కార్యక్రమాలు జరిగినప్పుడు కేంద్రాల్లో పిల్లలు, గర్భిణీలకు పండ్లు, పాలు అందించే కార్యక్రమాలు చేపట్టాలని స్మృతి ఇరానీ ఈ సందర్భంగా సూచించారు.

పవన్ కళ్యాణ్ ఎంపవర్ స్టార్..

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాసన సైతం మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ డిప్యూటీ సీఎం అయితే నాకు మాత్రం ఎంపవర్ స్టార్ అని తెలిపారు.అంగన్‌వాడీలను అభివృద్ధి చేయాలని అపోలో గ్రూపు నిర్ణయించి దానిని పిఠాపురం నుంచే శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా కేవలం పిల్లల ఆరోగ్యం మాత్రమే కాదు తల్లుల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చూపుతోందని ఈ సందర్భంగా ఉపాసన తెలియజేశారు. ఇలా గర్భిణీ మహిళల కోసం అలాగే చిన్న పిల్లల ఆరోగ్యం కోసం అపోలో హాస్పిటల్స్ ద్వారా ఉపాసన చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

?hvrq=MWN6NDB4M29hN3JmcA%3D%3D

Advertisement

ఇక పిఠాపురం నియోజకవర్గ అగ్రహారంలో ఈ మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని సుమారు 50 కోట్లతో నిర్మించారు. కేవలం పిఠాపురంలో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అంగన్వాడీ కేంద్రాలు సుమారు 109 కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అంగన్వాడీ కేంద్రాలలో లాన్‌, డిజిటల్‌ పాఠాలకు ఎల్‌ఈడీ స్ర్కీన్లు, క్రీడా పరికరాలు, భోజనశాల, విద్యార్థులు కుర్చునేందుకు చైర్లు, టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. ఇలా ప్రజలు పిల్లల ఆరోగ్యం పట్ల అపోలో హాస్పిటల్స్ తీసుకుంటున్న ఈ చొరవపట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: వంశీకి బిగ్ షాక్.. డైరెక్ట్ గా నామినేట్ చేసిన నాగార్జున.. సిగ్గుపడుతున్నానంటూ!

Related News

రూ.40 కోట్లతో అదరగొట్టిన ధనుష్.. కానీ అసలు పరీక్ష ఇప్పుడే!

ఎంతో బిజీగా ఉన్నా ఆ పాటలు వింటే రిలాక్స్ అవుతా.. తన మ్యూజిక్ టేస్ట్ బయటపెట్టిన వేణుస్వామి!

చరణ్ సినిమా.. హీరోయిన్ విషయంలో అంతా గందరగోళమే!

ఆ సినిమాకు కాపీనా? ‘ఆకాశంలో ఒక తార’ వివాదంపై డైరెక్టర్ పవన్ సాదినేని స్ట్రెయిట్ ఆన్సర్!

ధనుష్ పొరపాటున ఇండస్ట్రీలోకి వచ్చారా?ఆ పని చేయడం అంత ఇష్టమా?

లండన్ వీధుల్లో చిల్ అవుతున్న రుక్మిణి వసంత్.. క్యూట్ పిక్స్ వైరల్!

సీనియర్ నటుడు సుధాకర్ కొడుకును చూశారా.. అచ్చం తండ్రి పోలికలే!

Big Stories

Advertisement
×