Dhanush OM:ధనుష్ …కోలీవుడ్ స్టార్ హీరోగా సౌత్ ఆడియన్స్ కి భాగా దగ్గరైన ఈ వెర్సటైల్ స్టార్ తాజాగా ‘ఓం’అనే సినిమాతో పలకరించిన సంగతి తెల్సిందే. ‘అమరన్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి, ఈసారి స్పై యాక్షన్ థ్రిల్లర్ కథతో ధనుష్ ని కొత్తగా చూపించడం విశేషం.అయితే తాజాగా ఈ సినిమా ధనుష్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే సినిమా పై మొదట్లో భారీ అంచనాలు ఏర్పడగా థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఫలితం ఎలా ఉంటుందా అని ఈగర్ గా వెయిట్ చేశారు ధనుష్ ఫ్యాన్స్.అయితే అందరి అంచనాలని తలకిందులు చేస్తూ ఈ సినిమా మొదటి రోజే వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మేకర్స్ పోస్టర్ వదలడం ఖుషీ అయిపోతున్నారు మూవీ లవర్స్.
ఇక ఈ వసూళ్లతో ధనుష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫస్ట్ డే ఓపెనింగ్ సాధించిన చిత్రంగా ‘ఓం’ రికార్డు క్రియేట్ చేసిందనే చెప్పాలి. గతంలో ధనుష్ సినిమాలకు మంచి మార్కెట్ ఉన్నా, తొలిరోజే ఈ రేంజ్లో వసూళ్లు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. రిలీజ్ కి ముందున్న హైప్, భారీ ప్రమోషన్లు, క్రేజీ స్టార్ కాస్టింగ్ ఈ ఓపెనింగ్స్ రావడానికి ప్రధాన కారణాలని సమాచారం.
ఇక దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి విషయానికి వస్తే ‘అమరన్’ సినిమాతో శివకార్తికేయన్, సాయి పల్లవిలకు మంచి హిట్ ఇచ్చిన , ఈ క్రేజీ డైరెక్టర్ ధనుష్‌తో స్పై యాక్షన్ జానర్ లో సినిమా తీయడం విశేషం. ఇక సినిమా మొదలైనప్పటి నుండి భారీ అంచనాలని పెంచుకున్న ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇందులో కీలక పాత్ర పోషించడం సినిమాకు పెద్ద ప్లస్ అయిందనే చెప్పాలి.
అలాగే ‘మారి 2’ తర్వాత ధనుష్, సాయి పల్లవి మరోసారి జతకట్టడం, అందులోనూ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ సినిమాకు బాగా కలిసొచ్చిందనడంలో సందేహం లేదు. వీరితో పాటు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న శ్రీలీల కూడా ఇందులో నటించడంతో, తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.
ఇక మ్యూజిక్ పరంగా చూస్తే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యాంకర్ ఈ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్.మాములుగా స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పక్కర్లేదు.ఓక రకంగా సినిమాకి సాయి అభ్యాంకర్ మెయిన్ పిల్లర్ గా నిలిచాడనే చెప్పాలి.
అయితే ప్రస్తుతం సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నప్పటికీ అదే స్థాయిలో మిక్స్డ్ టాక్ వస్తుండటంతో సినిమా లాంగ్ రన్ లో ఏ మేరకి నిలబడుతుందా అన్న డౌట్స్ రైజ్ చేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. చూడాలి మరి వరుస ప్లాపులతో సావాసం చేస్తున్న ధనుష్ కి ఈ సినిమా అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో !
ALSO READ:చరణ్ సినిమా.. హీరోయిన్ విషయంలో అంతా గందరగోళమే!