Rashmika Mandanna : రష్మిక మందన్న బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ తనదైన శైలిలోనే ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇటీవల రణబాలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే మైసా(mysaa) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నవంబర్ 27వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా నుంచి ఒసేయ్ రాములమ్మ(osey Ramulama) అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు.
ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా రష్మిక మందన్న(Rashmika Mandanna) మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఈ సినిమాలో ఒసేయ్ రాములమ్మ పాటను రీమిక్స్ చేయడం గురించి తన దగ్గర ప్రస్తావనకు రావడంతో తాను చాలా భయపడిపోయాను అని తెలిపారు.. ఒక ఐకానిక్ సినిమాలోని అంత గొప్ప పాటను రీ క్రియేట్ చేయడం అనేది చాలా బాధ్యతతో కూడుకున్న విషయం. ఈ పాట చేయటానికి తాను చాలా భయపడ్డానని, అయితే వందేమాతరం శ్రీనివాస్ గారు ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో తనకు కాస్త ధైర్యం వచ్చిందని తెలిపారు. ఇక ఈ సినిమాలోని ఒరిజినల్ పాటను ఎవరు మ్యాచ్ చేయలేకపోయినప్పటికీ నా వంతు న్యాయం చేశాను అనే సంతృప్తి నాలో ఉందని రష్మిక తెలిపారు.
ఇక ఈ సినిమాలో ఈ పాట కోసం వందేమాతరం శ్రీనివాస్ గారు భాగం అయినందుకు రష్మిక మందన్న ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఈ పాట విడుదల కార్యక్రమంలో భాగంగా నటి విజయశాంతి గారు వచ్చి ఉంటే చాలా బాగుండేదని తెలిపారు. ఇక ఒసేయ్ రాములమ్మ సినిమా విషయానికి వస్తే 1997లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విజయశాంతి టైటిల్ రోల్ చేసి అద్భుతమైన నటనను కనబరిచారు. విజయశాంతి సినీ కెరియర్ లోనే ఒసేయ్ రాములమ్మ సినిమా ఒక మైల్ స్టోన్ లాంటిదని చెప్పాలి. ఇలాంటి ఒక ఐకానిక్ సినిమా నుంచి ఈ ఐకానిక్ పాటను రష్మిక మందన్న మైసా సినిమాలో రీ క్రియేట్ చేసి రిలీజ్ చేయటంతో ఈ పాటకు సోషల్ మీడియాలో ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది.
ఇక మైసా సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు రవీంద్ర పుల్లె దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. రష్మిక యాక్షన్ సన్నీవేశాలలో అదరగొట్టిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా నవంబర్ 27వ తేదీ రాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు కానీ ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు చిత్ర బృందం ఈ సినిమా వాయిదా గురించి ఎక్కడ స్పందించలేదు.
Also Read: పిఠాపురంలో మోడల్ అంగన్వాడీ ప్రారంభించిన ఉపాసన కొణిదెల..