Naga Chaitanya:అక్కినేని నాగచైతన్య అక్కినేని నట వారసుడిగా జోష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకో లేకపోయినా చై నటించిన ఏ మాయ చేసావే సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి అతనికి హీరోగా ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. ఈ ఒక్క సినిమా చైతన్య జీవితాన్ని మార్చేసింది అని చెప్పొచ్చు. దీని తర్వాత వరస సినిమాలతో బిజీగా మారిన నాగచైతన్య అదే సినిమాలో హీరోయిన్ గా నటించిన సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరి పెళ్లి నాలుగేళ్లు కూడా నిలవకుండా విడాకులతో ఎండ్ అయ్యింది. అయినా కూడా టాలీవుడ్ అభిమానులు నాగచైతన్య- సమంత జంటను గుండెల్లో పెట్టుకున్నారు.
విడాకులు తర్వాత ఈ జంట కలిసింది లేదు. ఎవరి జీవితాల్లో వారు బిజీగా మారారు. ఇప్పటికే నాగచైతన్య తండేల్ సినిమా తో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇంకోపక్క సమంత బాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ చేస్తుంది. అంతేకాకుండా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి చిన్న చిన్న సినిమాలను తెరకెక్కిస్తూ అందులో కూడా విజయం అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ జంట భార్యాభర్తలుగా విడిపోయినా కనీసం హీరో హీరోయిన్లుగా ఆయన మళ్ళీ ఒక సినిమాలో కనిపిస్తే బాగుంటుంది అని ఎప్పటినుంచో అభిమానులు కోరుకుంటున్నారు. కానీ, ఈ ఛాన్స్ మాత్రం ఎప్పటికీ వచ్చేలా కనిపించడం లేదు.
ఈ మధ్యనే ఏ మాయ చేసావే సినిమా రీరిలీజ్ కానుందని మేకర్స్ అధికారికగా ప్రకటించారు. కనీసం వారికి ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చిన ఈ సినిమా కోసం అయినా ఈ జంట ఒకటిగా ప్రమోషన్స్ చేస్తారేమోనని అందరూ ఎన్నో ఆశలతో ఎదురు చూశారు. కానీ, ఆ ఆశలను కూడా సమంత నిరాశపరిచింది. తాను ఎలాంటి ప్రమోషన్స్ కు రావడం లేదని తేల్చి చెప్పేసింది. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. దీంతో జీవితంలో ఈ జంట ఎప్పటికీ కలవరు అని ఫిక్స్ అయిపోయారు. ఇక తాజాగా టాలీవుడ్ లో ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
ప్రస్తుతం నాగచైతన్య విరూపాక్ష డైరెక్టర్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత చై తన కెరీర్ లో మంచి విజయాన్ని అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ తో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. నాగచైతన్య వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో శివ నిర్వాణ మజిలీ సినిమాతో ఒక మంచి విజయాన్ని అందించాడు. ఆ విజయంలో సగభాగం సమంతకే చెందుతుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అప్పుడు సామ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. పెళ్లి తర్వాత సమంత – నాగచైతన్య కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగి మజిలీ సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఇక ఇప్పుడు నాగచైతన్య మరోసారి మజిలీ డైరెక్టర్ తో జతకట్టాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇది కూడా ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా తో కూడుకున్న మంచి ఫీల్ గుడ్ మూవీ అని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో నాగచైతన్య -సమంత మ్యూచువల్ ఫ్యాన్స్ మజిలీ చిత్రంలాగే మరోసారి నాగచైతన్య- సమంతను ఈ సినిమాతో కలపండి సార్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి శివ నిర్మాణ సమంతను తీసుకునే ప్రయత్నం చేస్తాడా దానికి చైతన్య ఒప్పుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.