BigTV English
Advertisement

Kiara Advani: స్టార్ హీరోయిన్ బయోపిక్ లో కియారా.. ఎన్నా సెలక్షన్ తలైవి

Kiara Advani: స్టార్ హీరోయిన్ బయోపిక్ లో కియారా.. ఎన్నా సెలక్షన్ తలైవి

Kiara Advani: సాధారణంగా ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో నటీనటులు జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని ఎంతో ఆత్రుతగా ఉంటుంది.  ఎన్నో విజయాలను సాధించి చివరి అంకంలో నటీనటులు ఎలా మరణించారు..? ఎన్ని కష్టాలు పడ్డారు..?  లాంటి విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఆ ఆత్రుతను, ఆసక్తిని గమనించిన మేకర్స్ స్టార్ నటీనటుల బయోపిక్ ను తెరకెక్కించి కొన్ని వాస్తవాలతో కూడిన కల్పిత కథను తెరకెక్కించి మంచి విజయాలను అందుకుంటున్నారు .ఇప్పటికే ఎంతోమంది స్టార్ నటీనటుల జీవిత కథలను సినిమా రూపంలో ప్రేక్షకుల ముదుకు తీసుకొచ్చారు.


 

ఇక తాజాగా మరో స్టార్ హీరోయిన్ బయోపిక్ ను మేకర్స్ తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఆ నటి ఎవరో కాదు బాలీవుడ్ ను తన అందంతో మంత్రముగ్ధుల్ని చేసిన మీనా కుమారి. ఆమె గురించి ఇప్పటి జనరేషన్ కు తెలియకపోవచ్చు.  కానీ ఒకానొక సమయంలో మీనా కుమారి సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.  క్లాసిక్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకుంది మీనా కుమారి. అయితే ఎన్నో మంచి మంచి చిత్రాలలో నటించి మెప్పించిన మీనా కుమారి కేవలం 38 ఏళ్లకే తనువు చాలించింది.  భారతీయ సినిమాకి ట్రాజడీ క్వీన్ గా ఆమెను అభివర్ణిస్తారు.  ఆమె 30ఏళ్ల కెరీర్ లో దాదాపు 90 సినిమాల్లో నటించింది. వాటిలో ఎన్నో సినిమాలు క్లాసిక్స్ గా నిలిచాయి. పాకీజా, సాహిబ్ బీబీ ఔర్ గులాం, ఆజాద్, శారద ఇలాంటి ఎన్నో సినిమాల్లో ఆమె నటనకు ఫాన్స్ ఫిదా అయ్యారు.


 

బాలనటిగా కెరీర్ ను  ప్రారంభించిన మీనా కుమారి గాయనిగా కూడా తన సత్తా చాటింది. అంతటి గొప్ప నటి బయోపిక్ ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా  తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఆమె ఎవరు.. ? ఎక్కడ నుంచి వచ్చింది. బాలీవుడ్ ను ఎలా ఏలింది.. ? చివరకు 38 ఏళ్లకే ఎలా తనువు చాలించింది.. ? అన్ని విషయాలను ఈ బయోపిక్ లో పొందుపరచనున్నారు. అయితే అంతటి అందమైన హీరోయిన్ గా ఇప్పుడు ఉన్న కుర్ర హీరోయిన్స్ లో ఎవరు నటిస్తున్నారు అనేది పెద్ద మిస్టరీగా మారింది. మీనా కుమారి పాత్ర కోసం కృతి సనన్, శ్రద్ధ కపూర్, కియారా అద్వానీ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే చివరికి కియరా ఆ ఛాన్స్ ను పట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఇక ఈ మధ్యనే సిద్ధార్థ పి మల్హోత్రా.. కియారాను  కలసి కథను వినిపించాడని, ఆమె కూడా వెంటనే ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. ఎంతోమంది తారలు మీనా కుమారి పాత్రలో నటించాలని ఆశపడినా చివరికి ఆ అవకాశం కియారాకే దక్కింది. ఇక ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయని, అన్ని అనుకున్నట్లుగా జరిగితే  మేకర్స్ ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది.

 

ఇకపోతే  ప్రస్తుతం కియారా ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే కియారా ఒక బిడ్డకు జన్మనివ్వనుంది. ఆ తర్వాత కొన్ని రోజులు ఇంటి వద్దనే రెస్ట్ తీసుకున్నాకా.. ఆమె ఎప్పుడు సెట్స్ కు వస్తాను అని చెప్తుందో అప్పుడే  ఈ సినిమాను పట్టాలెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం .ఏది ఏమైనా మీనా కుమారి పాత్రలో కియారా ఒదిగిపోతుంది అని చెప్పొచ్చు. ఈ వార్త తెలియడంతో ఆమె అభిమానులు ఈ సినిమా సెలక్షన్ బావుంది తలైవి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Actor Death: ఆర్థిక సహాయం కోసం ఎదురుచూసి నటుడు మృతి.. ఏమైందంటే?

Film industry: హీరోయిన్లతో నటుడు రాసలీలలు… ఎవరితో నడిపించాడో తెలుసు అంటున్న భార్య

Gatha Vibhavam Trailer: టైమ్ ట్రావెల్ ప్రేమ కథ.. భలే విచిత్రంగా ఉందే

SSMB 29 : మహేష్ సినిమాలో సింహం… ఇంతలా దాచుంచడం వెనుక పెద్ద స్టోరీ ఉందే!

Manchu lakshmi : మా నాన్న నన్ను చీట్ చేశారు.. మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్..పచ్చి నిజాలు..?

Roshan Meka: మోహన్ లాల్ సినిమా నుంచి తప్పుకొని శ్రీకాంత్ కొడుకు తప్పు చేశాడా.. ?

ENE2: ఈ నగరానికి ఏమైంది 2 నుంచి తప్పుకున్న సురేష్ ప్రొడక్షన్స్..?

Vijay Deverakonda: రష్మిక లక్ విజయ్ కి కలిసొచ్చేలా ఉందే.. అది కూడా జరిగితే తిరుగుండదు..

Big Stories

×