BigTV English

Oppo K13x 5G Launch: పవర్ ఫుల్ బ్యాటరీతో బడ్జెట్ స్మార్ట్‌పోన్.. కొత్త ఒప్పో ఫోన్ లాంచ్.. తక్కువ ధరలో సూపర్ ఫీచర్లు

Oppo K13x 5G Launch: పవర్ ఫుల్ బ్యాటరీతో బడ్జెట్ స్మార్ట్‌పోన్.. కొత్త ఒప్పో ఫోన్ లాంచ్.. తక్కువ ధరలో సూపర్ ఫీచర్లు

Oppo K13x 5G Launch| ఒప్పో కంనెనీ తన కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్.. Oppo K13x.. భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ. 15,000 లోపు ధరలో అద్భుతమైన ఫీచర్లతో వస్తోంది. పవర్ ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 50MP డ్యూయల్ కెమెరా, 6,000mAh బ్యాటరీ వంటి లక్షణాలతో ఈ ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్ 50s, iQOO Z10x, రియల్‌మీ P3 వంటి ఫోన్‌లతో పోటీ పడుతుంది.


వేరియంట్లు, ధర వివరాలు
Oppo K13x మూడు వేరియంట్లలో లభిస్తుంది:

4GB RAM + 128GB స్టోరేజ్: రూ. 11,999
6GB RAM + 128GB స్టోరేజ్: రూ. 12,999
8GB RAM + 256GB స్టోరేజ్: రూ. 14,999
ఈ ఫోన్ జూన్ 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది రెండు ఆకర్షణీయమైన రంగులలో వస్తుంది. 1. మిడ్‌నైట్ వైలెట్ ,  2.సన్‌సెట్ పీచ్


బ్యాటరీ, ఛార్జింగ్
Oppo K13xలో ఉన్న 6,000mAh బ్యాటరీ ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇది 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒప్పో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఒకటిన్నర రోజు సులభంగా పనిచేస్తుంది. గేమర్స్, ట్రావెలర్స్, ఎక్కువ ఫోన్ వాడే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

పరఫార్మెన్స్, ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది, ఇది 5G కనెక్టివిటీకి అనువైనది. ఇందులో:

Mali-G57 MC2 GPU
8GB వరకు LPDDR4x RAM
256GB వరకు UFS 2.2 స్టోరేజ్, ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కలర్‌ఓఎస్ 15తో వస్తుంది. ఓప్పో 4 సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్స్ మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని వాగ్దానం చేసింది. ఇంత తక్కువ ధరలో ఇది గొప్ప ఆఫర్.

కెమెరా
Oppo K13xలో 50MP OV50D ప్రధాన కెమెరా, 2MP పోర్ట్రెయిట్ సెన్సార్ ఉన్నాయి. ఇది 60fps వద్ద 1080p వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది 30fps వద్ద 1080p వీడియో తీస్తుంది.

డిస్ప్లే, డ్యూరబిలిటీ
ఈ ఫోన్‌లో 6.67-అంగుళాల HD+ డిస్ప్లే ఉంది. ఇందులో:

120Hz రిఫ్రెష్ రేట్

1,000 నిట్స్ బ్రైట్‌నెస్
పాండా గ్లాస్ ప్రొటెక్షన్
ఇంకా.. ఈ ఫోన్ IP65 వాటర్/డస్ట్ రెసిస్టెన్స్, MIL-STD-810H మిలటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది ఈ ధరలో చాలా అరుదు.

Also Read: బ్యాటరీపై జీవితకాల వారంటీ.. ఈవి వాహనాల రంగంలో టాటా గేమ్ ఛేంజింగ్ ప్రకటన

Oppo K13x సరసమైన ధరలో పవర్‌ఫుల్ ఫీచర్లను అందిస్తుంది. దీని బ్యాటరీ లైఫ్, కెమెరా, డిస్ప్లే, డ్యూరబిలిటీ ఈ ఫోన్‌ను బడ్జెట్ 5G సెగ్మెంట్‌లో గొప్ప ఎంపికగా చేస్తాయి. జూన్ 27 నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ లేదా ఒప్పో వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.

Related News

ATM PIN Safety: ఈ ఏటిఎం పిన్‌లు ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. సైబర్ నిపుణుల హెచ్చరిక!

Xiaomi 17 Pro: 5x జూమ్, 6,300mAh బ్యాటరీ.. అదిరిపోయే ఫీచర్లతో షావోమీ 17 ప్రో లాంచ్

Amazon Xiaomi 14 CIVI: షావోమీ 14 సివీపై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.17000 డిస్కౌంట్!

Tesla Model Z: ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. టెస్లా మోడల్ జెడ్ పూర్తి వివరాలు..

Amazon vs Flipkart Laptops: అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లలో ఏది బెటర్?

Aprilia Tuono 457: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే ఈ బైక్!.. అబ్బాయిలు రెడీనా?

iPhone 17 Connectivity issues: ఐఫోన్ 17, ఆపిల్ వాచ్‌లో వైఫై, బ్లూటూత్ సమస్యలు.. అసలు కారణం ఇదే..

Best Waterproof Phones: అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2025.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

Big Stories

×