Thandel : చాలామంది పెద్ద హీరోలు అప్పటిలా సినిమాలు చేయడం మానేశారు. ప్రతి హీరో కూడా ఒకే సంవత్సరం రెండు సినిమాలు వచ్చేటట్లు ఒకప్పుడు ప్లాన్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం రెండేళ్లకు ఒక సినిమా మూడేళ్లకు ఒక సినిమా వస్తుంది. ఇలా హీరోలు సినిమాలు స్లోగా చేయడం వలన థియేటర్ కు వచ్చే ఆడియన్స్ కూడా తగ్గిపోయారు.
దాదాపు ఆడియన్స్ థియేటర్ కి రావడం మానేశారు అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే కానీ థియేటర్స్ కు ఆడియన్స్ రాని పరిస్థితి. అయితే ఆ సినిమాకి టాక్ బాగుంటే ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. టాక్ కొంచెం తేడా కొట్టిన ఈవినింగ్ షో కి థియేటర్లు మొత్తం ఖాళీ అయిపోతాయి. ఇక 2025 లో వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి.
ఆ మూడు సినిమాలు బుల్లితెరపై ప్రభంజనం
థియేటర్లో మిస్ అయిన సినిమాలు ఒకప్పుడు కేవలం టీవీలో మాత్రమే వచ్చేవి. ఇప్పుడు ఓటిటి ఉండటం వలన సినిమా రిలీజ్ అయిన నెలలోపలే ఓటిటిలో దర్శనం ఇస్తాయి. అయితే టీవీలో సినిమా వచ్చినప్పుడు డబుల్ డిజిట్ టిఆర్పి రావడం అనేది మామూలు విషయం కాదు. ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం, పుష్ప, సినిమాలకు మంచి టిఆర్పి రేటింగ్ వచ్చింది. ఈ ఏడాది హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ నమోదు చేసుకున్న సినిమాలలో ఈ సినిమా రెండవ స్థానంలో ఉంది. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటించిన తండేల్ సినిమాకి కూడా అద్భుతమైన టిఆర్పి వచ్చింది. ఈ ఏడాది హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ నమోదు చేసుకున్న సినిమాలలో ఈ సినిమా రెండవ స్థానంలో ఉంది. ఈ సినిమాకి దాదాపు పదికి పైగా టిఆర్పి లభించింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు నిర్మాత బన్నీ వాసు.
బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం
ఇక తండేల్ సినిమా విషయానికొస్తే ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. భారతదేశానికి చెందిన కొంతమంది పాకిస్తాన్ సరిహద్దులకు పోయి అక్కడ ఇరుక్కుపోయి, చాలా ఇబ్బందులు పడిన తర్వాత ఇండియాకి ఎలా వచ్చారు అనేది ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించి అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. నాగచైతన్య కెరియర్ లోనే ఈ సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ప్రస్తుతం మరో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులు వద్దకు రావడానికి నాగచైతన్య సిద్ధమవుతున్నాడు.
#Thandel wins hearts once again! Now a sensation on the small screen ❤️
Overwhelmed by all the love!
10.32 – Second Highest Rating in 2025 in @ZeeTelugu@chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @thisisdsp @GeethaArts @ZeeTelugu pic.twitter.com/CQhiavHC0l— Bunny Vas (@TheBunnyVas) July 10, 2025