E-Paper
Advertisement

OTT Movie : పక్కనున్న భార్య మిస్సింగ్ అంటూ కేసు… పోలీసులకే పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : పక్కనున్న భార్య మిస్సింగ్ అంటూ కేసు… పోలీసులకే పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఓటీటీలో వైవిధ్యమైన వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. సినిమాలకు ధీటుగా ఇవి ఆడియన్స్ ని హడలెత్తిస్తున్నాయి. రీసెంట్ గా ఒక కన్నడ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సరికొత్త స్టోరీతో ఇంట్రెస్టింగ్ గా నడుస్తోంది. ఈ కథలో ఒక వ్యక్తి, ఒక ప్రమాదం తరువాత తన భార్యను మాత్రం మరచిపోతాడు. ఆ తరువాత కథ నెక్స్ట్ లెవెల్ ల్ ఉంటుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో ఉందంటే

‘షోధా’ (Shodha) సునీల్ మైసూరు డైరెక్ట్ చేసిన కన్నడ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇందులో రోహిత్, సిరీ రావికుమార్, అనుషా రంగనాథ్, అరుణ్ సాగర్, రవి హున్సూర్, దియా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించారు. 6 ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ సిరీస్, 2025 ఆగస్ట్ 29న ZEE5 లో స్ట్రీమింగ్ కి వచ్చింది. IMDbలో దీనికి 7.5/10 రేటింగ్ కూడా ఉంది.

కథలోకి వెళ్తే

Advertisement

రోహిత్ అనే ఒక లాయర్ తన భార్యను చాలా ప్రేమిస్తుంటాడు. ఒక రోజు అతనికి ఒక ప్రమాదం జరుగుతుంది. దీంతో రోహిత్ తన భార్య, అక్సిడెంట్‌లో చనిపోయిందని భావిస్తాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఫైల్ చేస్తాడు. పోలీసులు ఆమె కోసం సెర్చ్ చేస్తారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆమె తిరిగి వస్తుంది. కానీ రోహిత్ ఆమె తన భార్య కాదని అని అనుకుంటాడు. ఆమె రోహిత్‌తో మాట్లాడుతూ, నేను నీ భార్యనే అని నమ్మించడానికి ట్రై చేస్తుంది. కానీ రోహిత్ ఆమెను తన భర్యగా ఏ మాత్రం అంగీకరించడు. కానీ ఆమె తన ఐడెంటిటీ ప్రూవ్ చూపిస్తుంది. దీంతో పోలీసులు, ఫ్యామిలీ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. రోహిత్ ఆమెను ఇంపాస్టర్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాడు.

Read Also :  రోజుకో అబ్బాయితో ఆ పని… కోరిక తీర్చుకుని చంపేసే ఆడ పిశాచి… ఈ సిరీస్ తెలుగులోనే ఉంది

రోహిత్ తన భార్య గురించి డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అక్సిడెంట్ రిపోర్ట్‌లు, విట్నెస్‌లతో ఆమె పాస్ట్ ను చెక్ చేస్తాడు. ఆమె కూడా రోహిత్‌తో సాఫ్ట్‌గా మాట్లాడుతూ, తనను తాను అతని భార్యగా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. రోహిత్‌కు ఉన్న ఈ డౌట్ కథను సస్పెన్స్ లోకి తీసుకెళ్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి అతను ఒక డిటెక్టివ్‌ను హైర్ చేస్తాడు. ఇక క్లైమాక్స్ లో ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. దీంతో అసలు నిజం బయటకి వస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? రోహిత్ భార్య నిజంగా చనిపోయిందా? రోహిత్ కి మానసిక సమస్య ఉందా ? అనే విషయాలను, ఈ కన్నడ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.
Advertisement

 

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×