BigTV English

Dil Raju: ఫేక్ కలెక్షన్స్ పోస్టర్ అందుకే వేస్తారా.. గుట్టు రట్టు చేసిన దిల్ రాజు?

Dil Raju: ఫేక్ కలెక్షన్స్ పోస్టర్ అందుకే వేస్తారా.. గుట్టు రట్టు చేసిన దిల్ రాజు?

Dil Raju:  సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో సినిమా విడుదల అవుతుంది అంటే ఆ సినిమాపై ఎన్నో అంచనాలు పెంచే విధంగా దర్శక నిర్మాతలు పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైన టీజర్ విడుదలైన పెద్ద ఎత్తున వ్యూస్ సొంతం చేసుకుందని పోస్టర్లు విడుదల చేయడంతో సినిమా పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది తద్వారా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. ఇలా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే క్రమంలోనే వ్యూస్ , కలెక్షన్లకు సంబంధించిన పోస్టర్లను నిర్మాతలు విడుదల చేస్తుంటారు. ఇక సినిమా విడుదలైన తర్వాత మరుసటి రోజు సినిమా మొదటి రోజు కలెక్షన్లకు సంబంధించిన పోస్టర్లు బయటకు వస్తుంటాయి.


ఫేక్ కలెక్షన్లతో పోస్టర్లు..

ఇలా సినిమా కలెక్షన్ల గురించి వేసే పోస్టర్ల పట్ల ఎన్నో రకాల విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అది నిజమైన కలెక్షన్స్ కాదని, కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి ఫేక్ కలెక్షన్లతో(Fake Collections) పోస్టర్లు వేస్తుంటారని భారీ స్థాయిలో విమర్శలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju)ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు యాంకర్ ప్రశ్న వేస్తూ.. మొదటి రోజు సినిమాకు వచ్చిన కలెక్షన్లను మరుసటి రోజు పోస్టర్లు వేస్తున్నారు అయితే చివరికి సినిమా మాత్రం నష్టాలు వచ్చిందని చెబుతున్నారు ఇది ఎలా సాధ్యం అంటూ ప్రశ్న ఎదురైంది.


మార్కెటింగ్ స్ట్రాటజీ…

ఈ ప్రశ్నకు దిల్ రాజు సమాధానం చెబుతూ.. కలెక్షన్లకు సంబంధించిన పోస్టర్లు మార్కెటింగ్ (Marketing)స్ట్రాటజీ కోసమే మొదలుపెట్టారు. ఈస్ట్రాటజీ తో మన సినిమా ఇంత కలెక్షన్లు రాబట్టిందని చెబితే జనాలు సినిమాకు వస్తారని వేస్తారు. అయితే అది మన భ్రమ మాత్రమేనని దిల్ రాజు తెలిపారు. ఇప్పుడు మనం ఫేక్ కలెక్షన్లతో ఒక పోస్టర్ ఏస్తే పక్కన వెంటనే కౌంటర్ మరొకరు ఇస్తున్నారని తెలిపారు. మార్కెటింగ్ కోసం ఇలా ఫేక్ కలెక్షన్లతో పోస్టర్ వేయడం వల్ల మొదటికే మోసం వచ్చింది.

అభిమానుల కోసమే..

ఇక రెండో విషయానికి వస్తే ఒక హీరో ఒక సినిమా ద్వారా ఇంత కలెక్షన్లు రాబట్టారని పోస్టర్ వేయటం వల్ల ఇంకొక హీరో కూడా తప్పనిసరి పరిస్థితులలో వేయాల్సి ఉంది. హీరోల మధ్య కాంపిటీషన్ (Competation), అభిమానుల కోసం ఇలా ఫేక్ పోస్టర్స్ వేయాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పుడు ఒక హీరో సినిమా ఎంత కలెక్షన్స్ రాబట్టిందనేది నిర్మాతగా నాకు మాత్రమే తెలుసు. అయితే ఆ హీరో ఇంకో సినిమా వచ్చినప్పుడు ముందు సినిమాకు వచ్చిన కలెక్షన్ల గురించి కూడా చర్చలు జరుగుతాయని, డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా ఫేక్ కలెక్షన్స్ చెప్పి సినిమాని అమ్మడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపోతున్నారు అంటూ ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేవలం అభిమానుల కోసం హీరోల మధ్య ఉన్న కాంపిటీషన్ కోసమే ఫేక్ పోస్టర్లు వేయాల్సిన  పరిస్థితి వచ్చిందని తద్వారా నిర్మాతలకు నష్టాలు మిగులుతున్నాయని అసలు విషయం బయటపెట్టారు.

Also Read: కపిల్ శర్మ కేఫ్ పై ఉగ్రదాడి.. ఆ వాక్యాలే కారణమా? 

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×