BigTV English

Naga Vamsi: సినిమాని తప్పు అనలేదు, ఆ డైరెక్టర్ కు సారీ

Naga Vamsi: సినిమాని తప్పు అనలేదు, ఆ డైరెక్టర్ కు సారీ

Naga Vamsi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో నాగ వంశీ ఒకరు. తన సినిమా రిలీజ్ కి ముందు మీడియాలో సినిమాను ప్రమోట్ చేసే విధానం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఒక సినిమాను ముందుండి ఎలా నడిపించాలి అనడానికి మంచి ఉదాహరణ నిర్మాత నాగ వంశీ. అలానే దర్శకుడుని కూడా ప్రొటెక్ట్ చేస్తూ వస్తాడు.


మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు నాగవంశీ ఇచ్చే సమాధానం వింటే, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. విషయాన్ని ఎక్కువగా లాక్ చేయకుండా, ఎక్కడికి అక్కడే కట్ చేస్తాడు. కొన్నిసార్లు ఇంటర్వ్యూలో తన మాట్లాడిన మాటలు వైరల్ గా మారుతాయి. ఎన్నో సందర్భాలలో, సోషల్ మీడియాలో నాగ వంశీ ట్రోల్ కి గురి అయ్యాడు.

సినిమాని తప్పు అనలేదు 


రీసెంట్ గా నాగ వంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…. నిజంగా జనాలకు ఏ సినిమాలు ఎందుకు నచ్చుతున్నాయో ఎవరికీ అర్థం కావట్లేదు. నిన్ను లాస్ట్ ఇయర్ కొన్ని సినిమాలు చూశాను. ఆ సినిమా ఎందుకు ఆడిందో కూడా నాకు అర్థం కాలేదు అంటూ మాట్లాడారు. అయితే ఆ సినిమా పేరుని నాగ వంశీ ప్రస్తావించలేదు. అలానే మిస్టర్ బచ్చన్ సినిమా గురించి కూడా నాగ వంశీ మాట్లాడారు.

మొత్తానికి ఆ సినిమా గురించి కంట్రోల్ చేసుకొని ఏమీ అనలేదు. అయితే ఆ సినిమాను గురించి తక్కువగా మాట్లాడటం వలన ఆ దర్శకుడు చాలా ఫీలయ్యాడు అని ఒక ప్రముఖ జర్నలిస్ట్ నాగ వంశీకి తెలిపారు. నన్ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. సినిమాని నేను తప్పు పట్టలేదు, నేనిప్పుడు ఓపెన్ గా ఆ దర్శకుడికి సారీ కూడా చెప్తున్నాను. నేను సినిమాను ఏమీ అనలేదు సార్. నాకు ఆ సినిమా ఎందుకో ఎక్కలేదు అని చెప్పాను. అంటూ క్లారిటీ ఇచ్చాడు నాగ వంశీ.

వార్ 2 తో మరోసారి ప్రేక్షకులు వద్దకు

ఇక నాగ వంశీ కేవలం తీసిన సినిమాలు మాత్రమే కాకుండా, డిస్ట్రిబ్యూషన్ చేసే సినిమాలు గురించి కూడా మంచి ప్రమోషన్స్ చేస్తాడు. చాలా ట్రై చేసి కూలి సినిమా రైట్స్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. మొత్తానికి అది వర్కౌట్ కాదు అని తెలుసుకొని నాగ వంశీ వదిలేశారు. వెంటనే ఆ సినిమాను ముగ్గురు అగ్ర నిర్మాతలు కలిసి తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు నాగ వంశీ వార్ 2 సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాడు. స్వతహాగా ఎన్టీఆర్ కి అభిమాని కావడం వలన ఒక అడుగు ముందుకేసాడు వంశీ. సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఇప్పుడు మొదలు పెట్టనున్నాడు.

Also Read: Rashmika Mandanna: మారువేషంలో ఆ థియేటర్ వెళ్లి కింగ్డమ్ సినిమా చూసిన రష్మిక

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×