BigTV English
Advertisement

Dharmasthala: లోపల తవ్వకాలు.. బయట ప్రైవేట్ సైన్యం.. నెగిటివ్ గా మాట్లాడితే చంపేస్తారు!

Dharmasthala: లోపల తవ్వకాలు.. బయట ప్రైవేట్ సైన్యం.. నెగిటివ్ గా మాట్లాడితే చంపేస్తారు!

Dharmasthala Mass Burial: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల మృతదేహాల మిస్టరీ తేల్చేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. సిట్‌ బృందం ప్రత్యేకంగా తవ్వకాలు జరుపుతోంది. పారిశుద్ధ కార్మికుడు భీమా చెప్పిన ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అక్కడ సైన్యాన్ని మోహరించారు. మీడియాకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. చుట్టూ గ్రీన్ మ్యాట్ కట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. చూస్తుంటే అక్కడ పెద్ద స్థాయిలో మానవ అవశేషాలు లభించినట్లు తెలుస్తోంది.


8,9 లొకేషన్లు లో తవ్వకాలు ప్రారంభించిన సిట్ బృందం
ధర్మస్థలలో శవాలను పూడ్చారని చెబుతున్న 8,9 లొకేషన్లలో తవ్వకాలు ప్రారంభించింది సిట్ బృందం. కూలీల సాయంతో తవ్వకాలు చేస్తున్నారు. నేత్రావతి నది ఒడ్డునే ఈ రెండు లొకేషన్లు ఉన్నాయి.

పోలీసుల బందోబస్తు నడుమ తవ్వకాల ప్రారంభం
పవిత్రమైన ధర్మస్థలలో వందలకొద్దీ మృతదేహాలను పూడ్చిపెట్టానని పారిశుద్ధ కార్మికుడు చెప్పడంతో కలకలం రేగింది. దీనిపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆందోళనలు జరిగాయి. వీటి తీవ్రత పెరుగుతుండటంతో.. కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సిట్‌ బృందం జరుపుతున్న తవ్వకాల్లో ఎముకలు బయటపడటంతో.. ఈ దర్యాప్తు మలుపు తిరిగింది. దీంతో ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పిన మరికొన్ని స్పాట్లలో తవ్వకాలు కొనసాగుతున్నాయి.


Also Read: పగలు టీచర్.. రాత్రయితే కిలాడి.. 8 పెళ్లిల్లు చేసుకున్న మాయా లేడి!

ఈ కేసులో ఇవాళ్టితో వీడనున్న మిస్టరీ
ఈ దర్యాప్తులో అనేక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సి ఉంది. ఎముకలు దొరికితే అవి ఎవరివి ? ఎంతకాలం క్రితం చనిపోయారు ? అనే డీటైల్స్‌ రాబట్టాల్సి ఉంటుంది. దీనికితోడు పారిశుద్ధ కార్మికుడు వందల శవాలను పూడ్చిపెట్టానని చెప్పడంతో.. చాలాచోట్ల తవ్వకాలు జరపాల్సి ఉంటుంది.

అయితే అనేక మంది అమ్మాయిలను అత్యాచారం చేసి దారుణంగా చంపి.. 100ల మందిని పూడ్చి పెట్టారని తెలిపారు. 450 మందిని చంపేశాను కొందరు.. 116 మందిని అని దీనికి ప్రత్యక్ష సాక్షి అయినటువంటి అజ్ఞాత వ్యక్తి తెలిపారు. పిల్లల్ని, మహిళల్ని, బడికెళ్లే అమ్మాయిల శవాలు కూడా ఉన్నాయంటున్నాడు. ఇప్పడు అతను ఇచ్చిన వాంగ్మూలం దేశాన్ని కుదిపేస్తుంది. నిజంగానే ధర్మస్థలిలో అన్ని ఘోరాలు జరిగాయా? ఇన్నేళ్లు ఎందుకు ఆ నిజాలు బయటపడలేదు? ఒక వేళ ఇన్ని ఘోరాలు జరుగుతున్న అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? దీని వెనకున్న మిస్టరీ ఏంటి? ప్రతి ప్రశ్న మైండ్‌లో దిగుతుంటే.. నిద్ర పట్టటంలేదే! అసలేం జరిగింది?

పాపం వెంటాడుతుందని నిజాలు బయట పెట్టిన అజ్ఞాతవ్యక్తి..

అనుకోకుండా ఒకే ఒక్కడు అతను చేసిన పాపం వెంటాడుతుందని.. ప్రాణ భయంతో చేశానంటూ నోరు విప్పాడు. లెక్క లేనన్ని శవాలను పూడ్చానంటున్నాడు ఓ పారిశుధ్య కార్మికుడు. తన చేతులతోనే వందల శవాలను పూడ్చి పెట్టానన్నాడు. తాను పూడ్చిన ఓ శవం ఎముకలను ఫోటోలను కూడా తీసి చూపించాడు. తనకు తెలిసిందల్లా సీల్డ్‌ కవర్లో పెట్టి.. అత్యున్నత న్యాయస్థాన న్యాయవాదికి ఇచ్చాడు. వీటన్నింటిని బట్టి చూస్తే చాలా పెద్ద వ్యవహారం బయటపడుతుందని జనాలందరిలో ఒక ఉత్కంఠ.. భయంతో ఎదురుచూస్తున్నారు.

Related News

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో దారుణం.. వృద్ధుడిపై దాడి చేసి బయటకు తోసేశారు.. చివరకు?

Karimnagar: ఉపాధ్యాయుడు కొట్టాడని గడ్డిమందు తాగిన ఇద్దరు విద్యార్థులు

Vikarabad Crime: రాష్ట్రంలో మరో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. స్పాట్‌లో డ్రైవర్..?

Pet Dog Killed: కుక్క పిల్లను నేలకేసి కొట్టి చంపిన పని మనిషి.. లిఫ్ట్ లో జరిగిన దారుణం సీసీ కెమెరాల్లో రికార్డ్

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌‌లోనే ముగ్గురు

Coimbatore Gang Rape Case: కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ కేసు.. పోలీసులపై నిందితులు దాడి, ఆపై కాల్పులు

Road Accidents: ఒకేసారి వరుసగా 3 ప్రైవేట్ ట్రావెల్ బస్సుల ప్రమాదాలు.. స్పాట్‌లో 65 మంది

Hyderabad: అమీన్ పూర్‌లో విషాదం.. స్విమ్మింగ్ ఫూల్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతి

Big Stories

×